Friday, July 19, 2013

Panchayat elections in Srikakulam,శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీల్లో ఎన్నికలు

  •  


  •  
2013 సం.జూలై లో జిల్లాలో 1095 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీసీలకు 590, ఎస్సీలకు 82, ఎస్టీలకు 61, జనరల్‌కు 366 స్థానాలు కేటాయించారు. ఇందులో మహిళలు 548, పురుషులు 547 స్థానాల్లో పోటీలో ఉన్నారు. కొన్ని పంచాయతీల్లో రోటేషన్‌ ప్రాదిపదికన రిజర్వేషన్లు మారాయి. అందులో 221 చోట్ల ఏకగ్రీవం కాగా, మిగతా చోట్ల ఎన్నికలు .  బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తరువాత రాత్రి 12 గంటలు దాటాక ఏకగ్రీవాలెన్ని అనేది కొలిక్కి వచ్చింది. అత్యధిక స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ మద్దతుదారులు సర్పంచులయ్యారు.జిల్లా కాంగ్రెస్‌ కీలక నాయకుల నియోజకవర్గాల్లో మాత్రం తెదేపా ప్రాబల్యం కనిపించింది. వైకాపా అంతగా ప్రభావం చూపలేకపోయింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం పదవుల్లో మహిళలకు మూడో వంతు కేటాయించాలన్న నిబంధనలను 1994 ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టంలో పేర్కొన్నారు. 73 రాజ్యాంగ సవరణ తర్వాత 1995లో తొలిసారిగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అప్పటి ముఖ్యమంత్రి  ఎన్టీరామారావు ప్రత్యేక శ్రద్ధతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం 33 శాతం మహిళా రిజర్వేషన్లను 50 శాతానికి పెంచింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. ఇలా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో మనది రెండోది. మొదటగా బీహార్‌లో అమలు చేశారు.

మొత్తం ఏకగ్రీవ పంచాయతీలు: 221.
కాంగ్రెస్‌ మద్దతుదారులు: 93.
తెదేపా మద్దతుదారులు: 55.
స్వతంత్రులు: 38.
వైకాపా మద్దతుదారులు: 31.
సీపీఎం: 1.
సీపీఐ: 1.

* అత్యధికంగా పాతపట్నం నియోజకవర్గంలో 42 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క పాతపట్నం మండలంలోనే 18 స్థానాలు ఏకగ్రీవం.
* అత్యల్పంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆరు సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
* రాజాం, ఎచ్చెర్ల మండలాల్లో అసలు ఏకగ్రీవాలే లేవు.
* పాతపట్నం నియోజకవర్గంలో 42 ఏకగ్రీవాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు 18, తెదేపా మద్దతుదారులు 8, వైకాపా మద్దతుదారులు 5, ఇతరులు 11.
* రాజాం నియోజకవర్గంలో ఏకగ్రీవాలు 24. 16 స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు, 4 స్థానాల్లో తెదేపా మద్దతుదారులు, మరో 3 స్థానాల్లో ఇతరులు. వైకాపా
మద్దతుదారులు ఒక్క స్థానానికే పరిమితమయ్యారు.
* ఆమదాలవలస నియోజకవర్గంలో ఏకగ్రీవాలు 17. కాంగ్రెస్‌ మద్దతుదారులు 7, తెదేపా మద్దతుదారులు 4, వైకాపా మద్దతుదారులు 3, ఇతరులు 3.
* నరసన్నపేట నియోజకవర్గంలో ఏకగ్రీవాలు 29. వైకాపా 13, కాంగ్రెస్‌ 12, తెదేపా 3, స్వతంత్రులు 1.
* శ్రీకాకుళం నియోజకవర్గంలోని 6 పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాయి. తెదేపా మద్దతుదారులు 5, కాంగ్రెస్‌ మద్దతుదారు 1.
* ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏకగ్రీవాలు 8. కాంగ్రెస్‌, వైకాపా మద్దతుదారులు చెరో రెండు స్థానాలు. స్వతంత్ర అభ్యర్థులవి 4.
* పాలకొండ నియోజకవర్గంలో ఏకగ్రీవాలు 23. కాంగ్రెస్‌ 6, వైకాపా 6, తెదేపా 4, ఇతరులు 7.
* టెక్కలి నియోజకవర్గంలో ఏకగ్రీవాలు 24. తెదేపా 10 పంచాయతీల్లో పాగా వేసింది. మిగతావాటిలో కాంగ్రెస్‌ 7, ఇతరులు 6. వైకాపా ఒక్క చోటే నిలబడగలిగింది.
* పలాస నియోజకవర్గంలో ఏకగ్రీవాలు 22. ఇక్కడ తెదేపా 9, కాంగ్రెస్‌ 8, ఇతరులు 4, వైకాపా 1 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలుపుకోగలిగాయి.
* ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మొత్తం ఏకగ్రీవాలు 27. కాంగ్రెస్‌ మద్దతుదారులు 16, తెదేపా మద్దతుదారులు 8, ఇతరులు 3.


872 పంచాయతీలకు ఎన్నికలు---
* జిల్లాలో ఇక ఎన్నికలు జరగనున్న పంచాయతీలు 872.
* సర్పంచి స్థానాలకు బరిలో ఉన్న అభ్యర్థులు 2155
* టెక్కలి డివిజన్‌లోని కంచిలి మండలం శాసనం, కోటబొమ్మాళి మండలం పట్టుపురం పంచాయతీల్లో సర్పంచి పదవులకు నామినేషన్‌ దాఖలు కాలేదు.
* 10,497 వార్డుల్లో 4,799 వార్డులు ఏకగ్రీవం కాగా 5,426 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ వార్డులకు 11,195 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
* శ్రీకాకుళం డివిజన్‌లో ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలు 303. సర్పంచి అభ్యర్థులు 784. వార్డుల అభ్యర్థులు 4751
* టెక్కలి డివిజన్‌లో ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలు 284. సర్పంచి అభ్యర్థులు 734. వార్డుల అభ్యర్థులు 2871
* పాలకొండ రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలు 285. సర్పంచి అభ్యర్థులు 637. వార్డు అభ్యర్థులు 3573


గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు పలువురు ఉద్యోగులు ఉన్నారు. వారి సేవల్ని సక్రమంగా వినియోగించుకుంటే గ్రామాల రూపురేఖల్ని మార్చవచ్చు. విద్య, వైద్యం, ఆరోగ్యం, స్త్రీ, శిశుసంరక్షణ, వ్యవసాయం, విద్యుత్తు సమస్యల్ని అధిగమించి ప్రజల కష్టాలు తొలగించవచ్చు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను--అర్హులందరికీ అందలా చేసే వీలుంది. పంచాయతీ స్థాయిలో విధులు నిర్వహించే పలువురు ఉద్యోగుల వివరాలివీ..

విభాగం జిల్లాలో మొత్తం ఉద్యోగులు
ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు 1134.
ఉపాధి హామీ మేట్‌లు 31,835.
రేషన్‌ దుకాణాల డీలర్లు 1983.
ఆదర్శ రైతులు 2,100.
మధ్యహ్న భోజన పథకం నిర్వహణ కమిటీలు. 3,663.
పంచాయతీ కార్యదర్శులు 266.
గ్రామ రెవెన్యూ అధికారులు 540.
గ్రామ రెవెన్యూ సహాకులు 1750.

* వీరితోపాటు గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, సాక్షర భారత్‌ గ్రామ సమన్వయకర్తలు, విద్యుత్తుశాఖ హెల్పర్లు విధులు.నిర్వహిస్తారు.

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment