Kuna Ravikumar,కూన రవికుమార్ .
ఆముదాలవలస నియోజకవర్గంలో ఇటీవల ప్రాదేశిక ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యకాండ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది తెదేపాకు సానుకూలంగా మారుతుందన్నది ఆపార్టీ శ్రేణుల గట్టి నమ్మకం. 2009 నుంచి తెదేపాకు వెన్నుదన్నుగా ఉన్న కూన రవికుమార్ పంచాయతీ, స్థానిక ఎన్నికల నిర్వహణలో అమలు జరిపిన వ్యూహం అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడగలదన్న ధీమాగా ఉన్నారు. సామాజిక వర్గ బలంతోపాటు పొందూరు, ఆమదాలవలస మండలాల్లో రవికుమార్‌కు ఉన్న వ్యక్తిగత ప్రాబల్యాన్ని ఓటుగా మార్చుకోగల ఎత్తుగడలపై తెదేపా శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఇక్కడ కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎమ్మెల్యే అభ్యర్థులుగా విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ వారి మధ్యనే పోటీ నెలకొంది. టీడీపీ తరఫున బరిలోకి దిగిన కూన రవికుమార్ కు ప్రజల్లో అంతగా గుర్తింపులేకపోవడం, సొంత మండలం పొందూరులో వీస్తున్న వ్యతిరేక పవనాలతో కలవర పడుతున్నారు.
Visit my website - >
Dr.Seshagirirao-MBBS.
No comments:
Post a Comment