- Tekkali Assembly Constituency elections 2014,టెక్కలి శాసనసభ నియోజకవర్గం ఎన్నికలు 2014
- కాంగ్రెస్ :కిల్లి రామమోహనరావు డా.(MBBS),
- వై.ఎస్.ఆర్ : దువ్వాడ శ్రీనివాసరావు ,
- టి.డి.ఫి. : కింజరపు అచ్చెన్నాయుడు ,
- జె.స.పా : కొర్ల భారతి ,
- బి.జె.పి :లేదు ,
- బి.యస్.పి : లాసా సోమేశ్వరరావు ,
- ఆమ్ ఆద్మీ : బేత వివేకానంద్ మహరాజ్ ,
- సి.పి.ఐ : లేరు ,
- సి.పి.ఎం :లేరు ,
- ఓటర్లు:
2,85,329 జనాభా ..............ఉన్నారు.
చరిత్ర :
టెక్కలి అసలు పేరు రఘునాధపురం. టెక్కలి అంటే ఒరియా భాషలో 'పసుపుకుంకుమ' (టికిలి)అని అర్ధం. పర్లాఖిమిడి మహారాజ తనకుమార్తెను టెక్కలి సంస్థానాధీసులకిస్తూ పసుపుకుంకుమ కింద ఈ పట్టణాన్ని ఇచ్చారు. కాలక్రమంలో టికిలి కాస్త టెక్కలిగా మారింది. టెక్కలికి ఆరువైపులా మంచినీటి కొలనులు, విశాలమైన వీధులు, నృత్యకళలు, సంస్కృతిక ప్రతిభ, క్రీడోత్సాహం పెట్టింది పేరు. ఇదంతా గతం. మారిన పరిస్థితులలో టెక్కలి పేరుకే డివిజన్ కేంద్రం అయింది. నాటి సౌభాగ్యం కోల్పోయింది. ప్రకృతి ప్రసాదించిన అరుదైన వనరులు తప్పితే పనితనంతో మిగిలింది ఏమీలేదు.
టెక్కలి మండలంలోని 10 పంచాయతీలు, నందిగాం మండలం, వజ్రపుకొత్తూరు మండలం, సంతబొమ్మాళి మండలంలోని 10 పంచాయతీలు, పలాస మండలంలోని 10 పంచాయతీలతో కలిపి టెక్కలి నియోజకవర్గంగా ఉండేది. 1994లో టెక్కలినుంచి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పోటీ చేయడంతో రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా టెక్కలి ప్రాచుర్యం పొందింది. టెక్కలి మండలంలోని 17 పంచాయతీలు, సంతబొమ్మాళి మండలంలో 22 పంచాయతీలు, కోటబొమ్మాళి మండలం, పాతపట్నం మండలంలోని 7 పంచాయతీలు, సారవకోట మండలంలోని 7 పంచాయతీలు, జలుమూరు మండలంలోని 5 పంచాయతీలు, పోలాకి మండలంలోని 5 పంచాయతీలు, నరసన్నపేట మండలంలోని 5 పంచాయతీలు కలిపి హరిశ్ఛంద్రపురం నియోజకవర్గంగా ఉండేది. హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో తొలి ఎమ్మెల్యేగా కింజరాపు కృష్ణమూర్తినాయుడు ఎన్నికకాగా, తర్వాత ఒక్కసారి మాత్రమే పి.ఎ.ఎన్.భుక్త ఎన్నికయ్యారు. తర్వాత కృష్ణమూర్తినాయుడు సోదరుని కుమారులు 1983లో ఎర్రన్నాయుడు ఎన్నికయ్యారు. 1995 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు ఎంపీగా ఎన్నికవడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడినుంచి గెలుపొందారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలను కలుపుతూ టెక్కలి నియోజకవర్గాన్ని ఏర్పాటుచేశారు.
టెక్కలి కొత్త నియోజకవర్గంలో కోర్కెలు తీర్చే కల్పవల్లి కొత్తమ్మతల్లి.. నవరుచులకు తల్లి నౌపడ ఉప్పుగల్లి.. విదేశీపక్షుల విడిదికేంద్రం తేలినీలాపురం.. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం కలియుగ కార్తీక కైలాసం రావివలస ఎండల మల్లిఖార్జున దేవాలయం.. చందనపూరిత సుబ్బమ్మపేట నర్సింహస్వామి దేవాలయం.. ప్రపంచ వాణిజ్య చిత్రపటంలో వెలుగొందిన నీలాల గ్రానైట్.. ఇలా వేటికవే నిరుపమానంగా నిలిచాయి. భౌగోళికంగా, సామాజికంగా టెక్కలి జిల్లాకే తలమానికం. ఈ ప్రాంతంలో వంశధార కాలువ కింద పంటల సిరులు, మైదాన ప్రాంతంలో జీడిమామిడిల హొయలు.. విస్తారంగా ఉన్న కొండల ప్రాంతంలో గిరిజన ప్రజలు.. టెక్కలి సొంతం.
టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలతో కొత్తగా ఏర్పడిన టెక్కలి నియోజకవర్గం అటు రాజకీయంగాను, ఇటు సామాజికంగాను జిల్లా రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తోంది. జిల్లాలో ప్రధాన వంశధార ఎడమ ప్రధానకాలువ పరిధిలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో విస్తారంగా వరి పండిస్తున్నారు. నియోజకవర్గంలోని మెట్టుప్రాంతాల్లో కొబ్బరి, జీడి, మామిడి పంటలను పండిస్తున్నారు. కోటబొమ్మాళి మండలం తర్లిపేట, టెక్కలి మండలం కె.కొత్తూరు తదితర ప్రాంతాల్లో, నందిగాం మండలం మదనాపురం, అన్నాపురం, నౌగాం ప్రాంతాల్లో కూరగాయలను పండిస్తారు. నియోజకవర్గంలో సంతబొమ్మాళి మండలంలో కాకరాపల్లి తంపర ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన ఈస్ట్‌కోస్టుపవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వడ్డితాండ్ర, ఆకాశలఖవరం, హనుమంతు నాయుడుపేట, అంట్లవరం, గొదలాం గ్రామాల ప్రజలు ఏడాదికాలంగా ఉద్యమాన్ని చేస్తున్నారు. 2011 ఫిబ్రవరి 29న జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు.
- ================================
No comments:
Post a Comment