Thursday, April 17, 2014

Vizianagaram Loksabha constituency,విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం




  •  
విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం లో శ్రీకాకుళం జిల్లాకు సంబందించి రెండు శాసనసభనియోజకవర్గాలు కలిసి ఉన్నాయి.
  •  
  • ఆవిర్భావం : విజయనగరం జిల్లా మూడు పార్లమెంటు నియోజకవర్గాలతో ముడిపడి ఉంది. విజయనగరం, అరకు, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాల్లో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు భాగంగా ఉన్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకు జిల్లాలో బొబ్బిలి, పార్వతీపురం పార్లమెంటు నియోజకవర్గాలు ఉండేవి. పునర్విభజన తరువాత బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం విజయనగరంగా, పార్వతీపురం నియోజకవర్గం అరకుగా నామాంతరం చెందాయి.

* విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో విజయనగరం జిల్లాకు చెందిన శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. 1971లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి విజయనగరం రాజా పి.వి.జి.రాజు స్వతంత్రుడిగా గెలిచారు.
* రిజర్వేషన్‌ : జనరల్‌

అసెంబ్లీ నియోజకవర్గాలు:
విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంలో
  1. విజయనగరం, 
  2. నెల్లిమర్ల, 
  3. చీపురుపల్లి, 
  4. గజపతినగరం, 
  5. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలు, 
శ్రీకాకుళం జిల్లాలోని 
  1. రాజాం, 
  2. ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఉన్నాయి.
ఓటర్లు సంఖ్య
* పురుషులు- 6,84,219
* మహిళలు- 6,88,281
* ఇతరులు- 98
* నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు : 14,09,298

రాజకీయ చరిత్ర
తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత జరిగిన 8 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగుసార్లు తెలుగుదేశంపార్టీ గెలవగా, కాంగ్రెసు పార్టీ నాలుగుసార్లు విజయం సాధించింది. అంతకుముందు నాలుగుసార్లు కాంగ్రెసు పార్టీ ఇక్కడ ఆధిపత్యం చూపింది. పి.వి.జి.రాజు రెండు సార్లు గెలిస్తే అంతకుముందు రెండు సార్లు కర్రి నారాయణరావు విజయం సాధించారు. పి.వి.జి.రాజు కుమారుడు ఆనందగజపతి కూడా రెండుసార్లు గెలవడం గమనార్హం. ఈయన ఒకసారి తెలుగుదేశం పక్షాన, మరోసారి కాంగ్రెస్‌ పక్షాన గెలుపొందారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేసిన లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన కొండపల్లి పైడితల్లినాయుడు రెండుసార్లు గెలిచారు. ఆ రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన బొత్స సత్యనారాయణ ఓటమి పాలయ్యారు.

1967 నుంచి 2009 వరకు విజేతలు వీరే
బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్నపుడు...
* 1967 : కర్రి నారాయణరావు- కాంగ్రెస్‌ పార్టీ
* 1971 : కర్రి నారాయణరావు- కాంగ్రెస్‌
* 1977 : పి.వి.జి.రాజు - కాంగ్రెస్‌
* 1980 : పి.వి.జి.రాజు - కాంగ్రెస్‌
* 1985 : ఆనందగజపతిరాజు - తెలుగుదేశం
* 1989 : కెంబూరి రామ్మోహనరావు - తెలుగుదేశం
* 1991 : ఆనందగజపతిరాజు - కాంగ్రెస్‌
* 1996 : కె.పైడితల్లినాయుడు - తెలుగుదేశం
* 1998 : కె.పైడితల్లినాయుడు - తెలుగుదేశం
* 1999 : బొత్స సత్యనారాయణ- కాంగ్రెస్‌
* 2004 : కొండపల్లి పైడితల్లినాయుడు - తెలుగుదేశం
* 2007 (ఉప ఎన్నిక) : బొత్స ఝాన్సీలక్ష్మి

విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంగా మారాక
* 2009 : బొత్స ఝాన్సీలక్ష్మి - కాంగ్రెస్‌

  • Courtesy with Eenadu telugu news paper.
  • =================================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment