Friday, April 18, 2014

Vyricherla Kishore Chandra Suryanarayana Deo,వైరిచెర్ల కిషోర్ చంద్రసూర్యనారాయణ దేవ్

  •  
  •  
 వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ భారత రాజకీయనాయకుడు భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు. అతను ఐదు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు, మరియు రాజ్యసభలో కూడా ఒక పర్యాయం నిర్వహించారు.
  • పుట్టుక : ఫిబ్రవరి 15, 1947 (వయసు 67), కురుపాం,
    జీవిత భాగస్వామి: ప్రీతి డియో,
    విద్య: మద్రాసు క్రైస్తవ కళాశాల,
    పార్టీ: భారత జాతీయ కాంగ్రెస్,
శ్రీకాకుళం తేదీ  18-04-14
    వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. పలుదఫాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యునిగా అరకు పార్లమెంటు స్థానం నుంచి మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు . గత 37 ఏళ్లుగా ఎన్నికలు చూస్తున్నారు . ఐదుసార్లు లోక్‌సభ, ఒకసారి రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు . ఇప్పుడున్నంత గందరగోళ పరిస్థితి ఎన్నడూ చూడలేదు. ప్రస్తుతం కొన్ని పార్టీలు, నేతల హవా నడుస్తోంది. కాంగ్రెస్‌కు వ్యతిరేక గాలి అన్నది ప్రచారమే. ఓటు వేయాల్సింది ప్రజలు. లెక్కింపు జరిగినప్పుడు అసలు విషయం తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కాకుండా ఇంతకు ముందే జరిగి ఉంటే కొంత స్పష్టత ఉండేది అని అంటారాయన .

 పీసీసీ సభ్యునిగా --

సమావేశం ఒకేసారి జరిగింది. అందులో ఏ నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌ సీనియర్‌ సభ్యులతో ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ వేశారు. అందులో ఇతన్ని  కూడా సభ్యునిగా వేశారు. హైదరాబాదులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌, స్క్రీనింగ్‌ కమిటీ నేత వాయిలార్‌ రవి తదితరులు అభ్యర్థుల ఎంపికపై చర్చించినప్పుడు ఇతను  కొందరి పేర్లు సూచించాను.

రాష్ట్రాన్ని రెండు కాదు... మూడు ముక్కలు చేస్తే ఉత్తమమని కిశోర్  అభిప్రాయపడ్డారు. కిరణ్‌, బొత్సలను పదవుల నుంచి మార్చాలని సోనియాకు లేఖ రాశారు. బొత్స సత్యనారాయణను లిక్కర్‌ డాన్‌గా అభివర్ణించారు. . .  డానో కాదో తెలియదు కానీ బొత్సకు మద్యం వ్యాపారం ఉందని ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. బాక్సైట్‌ మైనింగ్‌ ప్రతిపాదనలు అయిదో షెడ్యూల్‌ ఏరియాలో పెట్టారు. గిరిజనేతరులు ఆ భూమిపై అడుగు పెట్టేందుకు వీల్లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా గిరిజనేతరులకు ద్వారాలు తెరిచారు. ఆర్టికల్‌ 368 ప్రకారం షెడ్యూలు ఏరియాను కార్పొరేషన్‌కు ఇవ్వడం సరికాదు. విదేశీ కంపెనీలతో కార్పొరేషన్‌ ఎం.ఒ.యు.లో సంతకం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘాలకు గనులు తవ్వుకునేందుకు అవకాశం ఇవ్వవచ్చు కానీ, విదేశీయులకు ఇవ్వకూడదు.

మళ్లీ అరకు నుంచి పోటీ చేయడానికి సిద్ధము -- ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వను. ప్రైవేటు రంగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ రిజర్వేషన్లు అమలు, ఉపాధిహామీ పథకం పటష్ఠపరచడం వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్తాను. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియోజకవర్గానికి నిధులు రప్పించాను. గిరిజన ప్రాంతాల్లో ఏటా 150 రోజుల ఉపాధి హామీ పనులు, మూడేళ్లుగా జిల్లాకు రూ.30 కోట్లు చొప్పున ఐఏపీ గ్రాంటు తెచ్చి పలు అభివృద్ధి పనులు చేశాను. పీఎంజీఎస్‌వై ద్వారా రూ.600 కోట్లతో విశాఖ జిల్లాలో 900 కి.మీ.. రహదారులు వేశాం. తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం ద్వారా మూడు పథకాలు ప్రాంభించాం. ఒక్కో పథకానికి రూ.10 కోట్ల నుంచి రూ.14 కోట్లు వెచ్చించాం.

దేశంలోనే అరకు  నియోజకవర్గం పెద్దది. నాలుగు జిల్లాల్లో 700 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వంశధార నుంచి గోదావరి నది వరకు నా పరిధి. నెలలో రెండు రోజులు ఒక్కో నియోజకవర్గంలో తిరిగాను. ఖాళీ ఉన్నప్పుడల్లా కురుపాం కోటలో ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు .


  • =============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment