Thursday, May 22, 2014

Telangana ZPTc-MPTc,తెలంగాణలో జడ్పీటీసీ- ఎంపీటీసీ

  •  
  •  
 Telangana ZPTc-MPTc,తెలంగాణలో జడ్పీటీసీ- ఎంపీటీసీ-----------,జడ్పీటీసీల్లో తెరాస... ఎంపీటీసీల్లో కాంగ్రెస్‌--తెరాసకు మూడు జడ్పీలు--కాంగ్రెస్‌, తెదేపాకు ఒక్కొక్కటి--మహబూబ్‌నగర్‌, వరంగల్‌, రంగారెడ్డి, మెదక్‌లలో హంగ్‌.

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఫలితాలు బుధవారం(14-05-2014) తెల్లవారుజామున వెల్లడయ్యాయి. వాటి క్రోడీకరణ అనంతరం రాష్ట్ర . ఎన్నికల సంఘం ఫలితాలను విడుదల చేసింది. జడ్పీటీసీ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యాన్ని సాధించింది. ఎంపీటీసీల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్‌  గెలుచుకుంది.

మొత్తం 443 జడ్పీటీసీల్లో
  • తెరాసకు 191 .
  • కాంగ్రెస్‌ 176.
  • తెదేపాకు 53,
  • వైకాపాకి 6,
  • భాజపా 4,
  • సీపీఎం 2,
  • సీపీఐ 2,
  • బీఎస్పీ 1,
  • స్వతంత్రులు 5 ..
ఖమ్మం జిల్లాలో 2, మహబూబ్‌నగర్‌లో ఒక స్థానం ఫలితాలు కోర్టు కేసుల వల్ల ఆగిపోయాయి. పార్టీల పరంగా తెరాసకు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌  జిల్లా పరిషత్‌లు దక్కుతాయి. కాంగ్రెస్‌కు నల్గొండలో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఖమ్మం జడ్పీలో సగం స్థానాలు తెదేపా కైవసం చేసుకుంది. ఆ పార్టీకే పీఠం దక్కడం ఖాయంగా మారింది. మెదక్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, రంగారెడ్డిలలో హంగ్‌ ఏర్పడింది. మెదక్‌లో కాంగ్రెస్‌, తెరాసకు సమానమైన స్థానాలు రావడంతో హంగ్‌ ఏర్పడింది. మహబూబ్‌నగర్‌లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్‌ గెలుచుకున్నా మెజారిటీకి 5 తగ్గాయి. రంగారెడ్డిలోనూ కాంగ్రెస్‌ పెద్ద పార్టీగా అవతరించినా అక్కడ మెజారిటీకి 3 స్థానాలు తగ్గాయి. 50 స్థానాలు గల వరంగల్  లో కాంగ్రెస్‌కు 24 వచ్చాయి. మెజారిటీకి కాంగ్రెస్‌కు 2 స్థానాలు తగ్గాయి.

ఎంపీటీసీ: మొత్తం ఎంపీటీసీ స్థానాలు లో -- 6525 :
  •  కాంగ్రెస్‌ 2351,
  • తెరాస 1860 ..
  • తెదేపా 1061,
  • భాజపా 275,
  • సీపీఎం 145,
  • వైకాపా 121,
  • సీపీఐ 80,
  • బీఎస్పీ 28,
  • లోక్‌సత్తా 1,
  • ఇతర పార్టీలు 23 ..
  • స్వతంత్రులు 522 .
కోర్టు కేసుల వల్ల ఆగిపోయాయి. 30 ఫలితాలు
--ఈనాడు - హైదరాబాద్‌

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment