Monday, July 14, 2014

Srikakulam Z.P.chairperson-vice chairperson elections 2014, శ్రీకాకుళం జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు2014


  •  
 శ్రీకాకుళం జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు ఏకపక్షంగా ప్రశాంత వాతావరణంలో జరిగాయి. జిల్లాలో 38 జడ్పీటీసీ స్థానాలకు గాను 22 తెదేపా, 16 స్థానాలు వైకాపా సొంతం చేసుకున్నాయి. తెదేపా అధిష్ఠానం ఎన్నికలకు ముందే అధ్యక్ష స్థానానికి బీసీ వర్గానికి చెందిన ధనలక్ష్మి పేరు ప్రకటించింది.
  • అధ్యక్షురాలిగా ధనలక్ష్మి
  • ఉపాధ్యక్షురాలు: జ్యోతి
  • కో-ఆప్షన్‌ సభ్యులు: సదానందరౌళో, ముఖలింగం--అంతా ఏకగ్రీవమే

-
జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను తెదేపా సొంతం చేసుకుంది.జడ్పీ అధ్యక్షురాలిగా ఎచ్చెర్ల జడ్పీటీసీ సభ్యురాలు, జిల్లా తెదేపా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాజ్జి) భార్య చౌదరి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా వీరఘట్టం జడ్పీటీసీ సభ్యురాలు ఖండాపు జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో-ఆప్షన్‌ సభ్యులుగా మైనార్టీ వర్గం తరఫున కవిటికి చెందిన సదానందరౌళో, సీతంపేట కన్నెధార ఉద్యమ నాయకుడు, గిరిజన వర్గానికి చెందిన సవర తోట ముఖలింగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో రిటర్నింగ్‌ అధికారి, ఇన్‌ఛార్జి కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. తెదేపా తరఫున జడ్పీ అధ్యక్షురాలిగా చౌదరి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలుగా ఖండాపు జ్యోతిల పేర్లతో కూడిన పార్టీ బిఫారాలను ఉదయం 9.30 గంటలకు తెదేపా శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్‌లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్‌కు అందించారు. కో-ఆప్షన్‌ సభ్యులకు సంబంధించిన తెదేపా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్‌ల సమక్షంలో ఉదయం పది గంటల సమయంలో సదానందరౌళో, సవర తోటముఖలింగంలు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. తరువాత వైకాపా సభ్యులు 16 మంది సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం కో-ఆప్షన్‌ సభ్యుల ఫలితాలను రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. సదానందరౌళో, సవర తోటముఖలింగంలకు పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా వారు ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువపత్రాలు అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులిగా ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా జ్యోతిలు మాత్రమే నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ధనలక్ష్మి అభ్యర్థిత్వాన్ని నరసన్నపేటకు తెదేపా సభ్యురాలు శకుంతల ప్రతిపాదించారు. ఇచ్ఛాపురం, వంగరకు చెందిన తెదేపా సభ్యులు అంబటి లింగరాజు, బొత్స వాసుదేవరావునాయుడులు బలపరిచారు. ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ఉపాధ్యక్షురాలు జ్యోతిని సంతకవిటి తెదేపా జడ్పీటీసీ సభ్యురాలు కొల్ల జ్యోతిర్మయి ప్రతిపాదించగా, కవిటి, లావేరు తెదేపా సభ్యులు బెందాళం రమేష్‌, పిన్నింటి శ్రీదేవిలు బలపరిచారు. జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వీరికి ఎన్నిక ధ్రువపత్రం అందించి ప్రమాణ స్వీకారం చేయించారు.

Srikakulam dist. Z.P. members 2014 : 


-


-

















  • Z.P.Chair-persons in Andhrapradesh(seemandhra):


  • ========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment