Friday, May 22, 2015

2015 Sirisha(Srikakulam dist TDP president) , 2015 శిరీష -తెదేపా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు




  • Sirisha , శిరీష--May 2015





తెదేపా జిల్లా అధ్యక్ష పీఠం పలాస ఎమ్మెల్యే శివాజీ కుమార్తె శిరీషకే దక్కింది. ఈమె నియామక వివరాలు గురువారం హైదరాబాద్‌లో పార్టీ అధిష్టానం వెల్లడించింది.

శిరీష కుటుంబ నేపథ్యం
* పేరు: శిరీష
* స్వస్థలం: సోంపేట
* నియోజకవర్గం: పలాస
* పుట్టిన తేది: 16-5-1974
* విద్యార్హత: ఎంబీకే (మార్కెటింగ్‌)
* కుటుంబ రాజకీయ నేపథ్యం: తాత స్వాతంత్య్ర సమరయోధులు మాజీ మంత్రి, సర్థార్‌ గౌతులచ్చన్న. తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ. ఈయన మాజీ మంత్రి. ప్రస్తుత పలాస ఎమ్మెల్యే. తల్లి గౌతు

విజయలక్ష్మి. సోంపేట మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు.

* కుటుంబం: భర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి. ఈయన పారిశ్రామిక వేత్త. సంఘ సేవకులు. కుమారుడు, కుమార్తె ఉన్నారు.

* రాజకీయ అనుభవం: 2004 ఎన్నికల తరువాత పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 2014 ఎన్నికల్లో పూర్తిస్థాయి ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఆమె

తండ్రి విజయానికి కృషి చేశారు. 2014లో తెదేపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పలాస నియోజకవర్గంలో గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ పథకాల ప్రచారంలో

పాల్గొంటున్నారు. 2014లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి పలాసను జిల్లాలో రెండో స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశారు. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ(గ్లో) అధ్యక్షరాలిగా

పనిచేస్తున్నారు. గ్రామాల్లో నీటిశుద్ధి యంత్రాల ఏర్పాటు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
* వ్యాపార నేపథ్యం: శిరీషా పెట్రోలియం, సర్ధార్‌ ప్రాజెక్టు ప్రై.లిమిటెడ్‌(నిర్మాణరంగం).
* ఇప్పటి వరకూ చేపట్టిన రాజకీయ పదవులు: ఏమీ లేవు.

  • ==============================

Visit my website - > Dr.Seshagirirao-MBBS. 

No comments:

Post a Comment