Thursday, April 24, 2014

Reddy Santhi , రెడ్ది శాంతికి

  •  


  •  Reddy Santhi , రెడ్ది శాంతికి

సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం కుమార్తె ఆర్.శాంతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం కి .. టికెట్ ఇచ్చింది. శాంతి భర్త గ్రూప్ వన్ అధికారి. ఆయన కేంద్ర ప్రభుత్వంలో వేర్వేరు హోదాల్లో పనిచేశారు. గృహిణి అయిన శాంతి రాజకీయాలకు కొత్త ముఖం అయినప్పటికీ ఆమె తండ్రికి ఉన్న సుదీర్ఘమైన రాజకీయ అనుభవం దృష్ట్యా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అవకాశము ఇచ్చారు.

రాజకీయాలకు తొలి పరిచయం-----పేరు రెడ్డి శాంతి.. అయితే మాజీ జెడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరం కుమార్తెగానో, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ సెక్రటరీ, ఐ.ఎఫ్.ఎస్. అధికారి రెడ్డి నాగభూషణం సతీమణి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాకుళం పార్లమెంటు అభ్యర్థినిగా రెడ్డి శాంతి పేరు ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఖరారు చేశారు.  శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రధాన సామాజిక వర్గాలైన కాపు, కాళింగ, వెలమ సామాజిక వర్గాల నుంచి తొలిసారిగా వైకాపా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు (తెలుగుదేశం), కాళింగ సామాజిక వర్గం నుంచి సిట్టింగ్ ఎం.పి. డాక్టర్ కిల్లి కృపారాణి (కాంగ్రెస్) ఎం.పి. టిక్కెట్లు ఖరారు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కాపు సామాజిక వర్గం నుంచి ఎం.పి. అభ్యర్థిని బరిలోకి దించాలన్న ఆలోచనను జగన్ వ్యూహాత్మకంగా అమలు చేయడంతో మూడు తరాలుగా రాజకీయ అనభవం కలిగిన పాలవలస కుటుంబం నుంచి శాంతిని వైకాపా అభ్యర్థిగా బరిలోకి దించారు. బి.ఎస్సీ గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన శాంతి తన భర్త రెడ్డి నాగభూషణం ఢిల్లీలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గృహిణిగా ఉన్న ఆమె ప్రసుత్తం తొలిసారిగా రాజకీయాల్లో  అడుగు పెడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 19,28,544 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 15.88 శాతం కాపు సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. 10.38 శాతం వెలమ, 10.05 శాతం కాళింగ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వెలమ, కాళింగ సామాజిక వర్గాల మధ్య మాత్రమే అభ్యర్ధులు పోటీ పడేవారు. రెడ్డి శాంతి తొలిపరిచయంతో తొలిసారిగా ఎం.పి. బరిలో కాపు, వెలమ, కాళింగ సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలువనున్నారు.

  • ====================
Visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment