Thursday, May 22, 2014

2014 Communist party CPM position in Andhrapradesh

  •  


  •  
ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పోటాపోటీగా సీట్లు సాధించిన కామ్రేడ్లు.. విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ శానసభలో కనీస ప్రాతినిధ్యం కాదు కదా, ఒకచోట మినహా ధరావతులు కూడా దక్కించుకోలేకపోయారు.
సీపీఎం 31 చోట్ల పోటీ చేయగా, అందులో 18 స్థానాల్లో జైసమైక్యాంధ్ర పార్టీతో పొత్తు పెట్టుకుంది.
మొత్తంగా 1,06,664 ఓట్లు సాధించింది. సగటున 3,440 ఓట్లు పొందింది. ఇందులో అత్యధికంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 16,032 ఓట్లు దక్కాయి. ఆ తర్వాత అరకులో 9,032 ఓట్లు, మంగళగిరిలో 6,627, కర్నూలులో 6,159, కురుపాంలో 5,689 ఓట్లు దక్కాయి. ఒకే ఒక్క నియోజకవర్గంలోనే పదివేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.

ఐదువేల నుంచి 10 వేలలోపు నాలుగు స్థానాల్లో,
మూడు వేల నుంచి ఐదువేల లోపు ఓట్లు తొమ్మిదిచోట్ల,
వెయ్యి నుంచి రెండువేల లోపు ఓట్లు 15 స్థానాల్లో ,.
వెయ్యిలోపు ఓట్లు రెండు నియోజవర్గాల్లో................ ,
అత్యల్పంగా సూళ్లూరుపేటలో 732 ఓట్లే వచ్చాయి.

రెండు లోక్‌సభ స్థానాల ఫలితాల్లోనూ పెద్దగా సాధించేదేమీ లేదు.
  • అరకులో 38,898 ఓట్లు, 
  • తిరుపతిలో 11,168 ఓట్లే వచ్చాయి.

-ఈనాడు - హైదరాబాద్‌

  • ==============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment