మృణాళిని చీపురుపల్లికి కొత్త ముఖమే అయినా ఆమెకు చీపురుపల్లితో అనుబంధం ఉంది. ఈమె పుట్టింది చీపురుపల్లిలోనే. మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహనరావుకు స్వయానా సోదరి. ఈ నియోజకవర్గానికి ఆడపడచుగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా రేగిడికి చెందిన కిమిడి గణపతిరావును మృణాళిని వివాహం చేసుకున్నారు. గణపతిరావు 1999 నుంచి 2004 వరకు ఉణుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. బావగారైన కిమిడి కళావెంకటరావు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఉన్నత విద్యావంతురాలైన మృణాళిని ఏంబీబీఎస్ పట్టభద్రురాలు. జిల్లాలోని తెర్లాం మండలం పెరుమాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారిగా కొన్నాళ్లు పనిచేశారు. 1985లో జిల్లాపరిషత్ అధ్యక్ష పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాపరిషత్ నుంచి తెదేపా అభ్యర్థిగా అప్పట్లో ఎన్టీ రామారావు అవకాశం కల్పించడంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి 1985 నుంచి 1990 వరకు శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. 1991లో జరిగిన జడ్పీ ఎన్నికల్లో రెండోసారి శ్రీకాకుళం జడ్పీకి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. జడ్పీ పాలనలో పరిపాలనా దక్షురాలిగా ఎంతో గుర్తింపు పొందారు. శ్రీకాకుళం జడ్పీ పాలనలో రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా పనిచేసిన తీరు ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. చీపురుపల్లి నుంచి బీసీవర్గానికి చెందిన వారినే బరిలోకి దించాలని భావించిన చంద్రబాబునాయుడు చివరకు మృణాళినికి ఆ అవకాశం కల్పించారు. చీపురుపల్లి ఆడపడచుగా ఆమెను నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని తెదేపా అధిష్ఠానం భావించింది.
పూర్తి వివరాలు (Bio-Data):
· పేరు : Kimidi Mrunalini, కిమిడి మృణాలిని,
·
వయస్సు : 55,
· పోటీ చేస్తున్న పార్టీ పేరు : టి.డి.పి పార్టీ,
· పోటీ చేసున్న నియోజకవర్గం : చీపురు పల్లి అసెంబ్లీ నియోజకవర్గం,
·
ఎన్నోసారి పోటీచేయడము : 1,
·
తండ్రి / భర్త : కిమిడి గనపతి రావు డా.,
·
పిల్లలు : ఇద్దరు ,
·
ఆడ్రస్ : రేగిడి (గ్రా.),రేగిడి (మం) , పాలకొండ (వయా) , శ్రీకాకుళం (జిల్లా) ,
· పోన్ నెంబర్ : 9440197799,
·
చదువు : ఎం.బి.బి.ఎస్(ఆంధ్రా మెడికల్ కాలేజి విశాఖపట్నం),
·
వృత్తి : రాజకీయ సామాజిక సేవ , వైద్యము , వ్యాపారము ,
·
కులము /మతము : కాపు / హిందూ,
· ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
· నేర-అరోపణలు :
ఉన్నా కనిపించనీయరు.
source :
http://www.ceoandhra.nic.in/
- =============================
No comments:
Post a Comment