తెదేపాకు పూర్తి బలం ఉన్న మండలాలు :
- కవిటి,
- సోంపేట,
- ఇచ్ఛాపురం,
- వజ్రపుకొత్తూరు,
- మందస,
- టెక్కలి,
- కోటబొమ్మాళి,
- సంతబొమ్మాళి,
- శ్రీకాకుళం,
- గార,
- రణస్థలం,
- లావేరు,
- నరసన్నపేట,
- పోలాకి,
- సంతకవిటి,
- వంగర,
- రేగిడి,
- పాతపట్నం,
- ఎల్.ఎన్.పేట,
- పాలకొండ,
- భామిని.
వైకాపాకు పూర్తి బలం ఉన్న మండలాలు:
- కంచిలి,
- నందిగాం,
- జలుమూరు,
- సరుబుజ్జిలి,
- మెళియాపుట్టి,
- సారవకోట,
- పొందూరు,
- వీరఘట్టం,
- సీతంపేట.
తెదేపాకు 21 మండలాల్లో కచ్చితమైన మెజారిటీగల ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.
8 మండలాలపై తెదేపా దృష్టి కేవలం ఒకరిద్దరు లేదా ముగ్గురు సభ్యుల మద్దతుతో మండల పరిషత్తులను చేజక్కించుకునేందుకు తెదేపా ప్రయత్నిస్తోంది.
శ్రీకాకుళం, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస, టెక్కలి తదితర నియోజకవర్గాల్లోని మరికొందరు కీలక నేతలు త్వరలోనే తమ నిర్ణయం ప్రకటించే అవకాశం కనబడుతోంది. కొంతమంది నాయకుల బలవంతంమీద వైకాపాలో చేరిన వారు కూడా పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం.
* పలాస మండల పరిషత్తు పరిధిలో 11 మండల పరిషత్తు ప్రాదేశిక స్థానాలున్నాయి. ఇక్కడ తెదేపా 4, వైకాపా 5, ఇతరులు 2 స్థానాలను దక్కించుకున్నారు. ఎంపీపీ స్థానానికి ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం. ఇక్కడ స్వతంత్రుల్లో ప్రస్తుతం ఒక్కరు పూర్తిగా తెదేపాకు మద్దతు పలుకుతున్నారు. మరొకరు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. మండల పరిషత్తు తెదేపా పరమవుతుంది.
* ఎచ్చెర్ల మండలంలో 25 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మండల పరిషత్తు అధ్యక్ష పదవి కావాలంటే కనీసం 13 మంది మద్దతు అవసరం. ప్రస్తుతం తెదేపాకు 12 స్థానాలు దక్కాయి. వైకాపా 11 చోట్ల, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. ఇప్పటికే ఓ స్వతంత్ర అభ్యర్థి తెదేపాకు మద్దతు ప్రకటించారు. దీంతో ఈ మండలంలో తెదేపా ఎంపీపీ స్థానం చేజిక్కించుకునే అవకాశం కలిగింది.
* జి.సిగడాం మండలంలో 16 స్థానాలున్నాయి. తెదేపాకు 8 మంది, వైకాపాకు ఏడుగురు ఉన్నారు. ఓ స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. ఇక్కడ తెదేపాకు ఒక్క సభ్యుడి మద్దతు దొరికితే చాలు.
* ఆమదావలస మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీ ఎన్నికకు ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. తెదేపా 5, వైకాపా 7, కాంగ్రెస్ ఒకరు ఉన్నారు. కాంగ్రెస్ సభ్యుడు తెదేపాకు మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. వైకాపా నుంచి ఒక సభ్యుడి మద్దతు కోసం తెదేపా రంగంలోకి దిగింది.
* బూర్జ మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎంపీపీ స్థానం కైవసం చేసుకునేందుకు ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. తెదేపా తరఫున ముగ్గురు, వైకాపా నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. ఇక్కడ తెదేపాకు కాంగ్రెస్‌తోపాటు, స్వతంత్ర సభ్యుడు మద్దతు ఇచ్చే అవకాశాలు మెరుగయ్యాయి.
* రాజాంలో 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎంపీపీ స్థానం దక్కించుకునేందుకు 8 మంది సభ్యుల మద్దతు అవసరం. తెదేపా 6, వైకాపా 8, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థితో పాటు మరో వైకాపా అభ్యర్థి మద్దతు లభిస్తే.. ఈ మండల పరిషత్తు తెదేపా వశమవుతుంది.
* కొత్తూరు మండలంలో 19 స్థానాలు ఉండగా ఎంపీపీ ఎన్నికను 10 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక్కడ తెదేపాకు 8, వైకాపాకు 10, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థితో పాటు వైకాపా అభ్యర్థి మద్దతు కూడగట్టుకుంటే ఇక్కడ ఎంపీపీ స్థానాన్ని తెదేపా కైవసం చేసుకునే అవకాశం ఉంది.
* హిరమండలం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలున్నాయి. తెదేపా 6, వైకాపా 8 చోట్ల గెలుపొందాయి. ఇక్కడ కూడా తెదేపాకు మద్దతు లభించే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది.
- =============================
No comments:
Post a Comment