Thursday, May 15, 2014

Srikakulam politics Up and down 2014 , శ్రీకాకుళం రాజకీయాలలో కష్ట సుఖాలు 2014 ,

  •  


  •  
    వీరంతా గత అయిదు, పదేళ్లుగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పినవారే. మంత్రులుగా ఎమ్మెల్యేలుగా.. తమతమ స్థాయుల్లో నియోజకవర్గ, జిల్లా రాజకీయాలను నడిపించినవారే...అది నిన్నటి మాట...
నేడు.. అధికార సమీకరణాలు మారిపోయాయి. జిల్లా పరిషత్తు పీఠం తెదేపా పరమైంది. ఎచ్చెర్ల మొదలు.. ఇచ్ఛాపురం వరకు స్థానిక సంస్థల్లో తెదేపా హవా చాటింది. పట్టణాలు, మండలాల్లో కొత్త రాజకీయ శక్తులు తెరపైకి వచ్చాయి. పుర, ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో ఎవరి నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉందో లెక్క తీస్తే 9 నియోజకవర్గాల్లో తెదేపా స్పష్టమైన ఆధిక్యత చాటింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల మాట ఎలా ఉన్నా... ప్రస్తుత పరిస్థితి మాత్రం ఈ నాయకులకు ఇబ్బందికరంగానే పరిణమించింది.

ధర్మాన ప్రసాదరావు: శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం గ్రామీణ, గార మండలాలను కోల్పోయారు. గార జడ్పీ స్థానాన్ని కూడా గెలవలేకపోయారు. శ్రీకాకుళం జడ్పీ స్థానంలో క్రాస్‌ ఓటింగు, ప్రలోభాల పుణ్యమా అని వైకాపా గట్టెక్కగలిగింది.

కిల్లి కృపారాణి: టెక్కలి నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీపరంగా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. అయితే.. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ వైకాపాతో బహిరంగంగానే కుమ్మక్కయింది. సొంత గ్రామంలో సైతం అభ్యర్థిని నిలబెట్టలేకపోయారు.

ధర్మాన కృష్ణదాస్‌: దశాబ్దాలపాటు నరసన్నపేట నియోజకవర్గాన్ని ఏలిన ధర్మాన కుటుంబానికి పెద్దషాక్‌ మబగాం గ్రామాన్ని ప్రత్యర్థికి కోల్పోవటం. అంతేకాదు.. పోలాకి మండలాన్ని సైతం దక్కించుకోలేకపోయారు. రాజకీయ కేంద్ర స్థానమైన నరసన్నపేటనూ తెదేపా చేతుల్లో పెట్టారు.

కోండ్రు మురళీమోహన్‌: రాజాం నియోజకవర్గంలో పరువు దక్కించుకోవటం కోసం చివరి నిమిషంలో శ్రమించినా.. అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు. ఆయన స్వగ్రామం లావేటిపాలెంలో తెదేపా గెలుపొందింది.

మీసాల నీలకంఠంనాయుడు: సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపాలో చేరినా.. సొంత గ్రామం ఎందువలో మాత్రమే తన అభ్యర్థిని గెలుపించుకోగలిగారు. జి.సిగడాంలో పాగా వేయాలన్న ఆయన ఆలోచనను ఓటర్లు తిప్పికొట్టారు. జడ్పీ ప్రాదేశిక, మండల పరిషత్తూ తెదేపా పరమయ్యాయి.

జుత్తు జగన్నాయకులు: పలాస నియోజకవర్గంలోని పలాస పురపాలకసంఘం తెదేపా పరమైంది. మందస, వజ్రపుకొత్తూరు మండల పరిషత్తులు, జడ్పీటీసీలు సైకిలెక్కాయి. చివరకు వైకాపాకు వేదనే మిగిలింది. జగన్నాయకులు సొంత గ్రామం బిడిమి మండల పరిషత్తు ప్రాదేశికంలో తెదేపా పరమైంది.

పిరియా సాయిరాజ్‌: తెదేపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై వైకాపాలోకి దూకేసిన ఈయన వల్ల ఆ పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదన్నది స్పష్టమైంది. ఒక్క ఇచ్ఛాపురంలో తెదేపా నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్ల పురపాలకసంఘాన్ని పోగొట్టుకున్నా.. ప్రాదేశిక ఎన్నికలొచ్చేసరికి సంపూర్ణ ఆధిపత్యం చాటింది.

కొర్ల భారతి: టెక్కలి నియోజకవర్గంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. జైసమైక్యాంధ్ర పార్టీలో చేరిన ఆమె.. ప్రాదేశిక ఎన్నికల్లో ఎలాంటి పాత్రనూ పోషించలేకపోయారు.

నిమ్మక సుగ్రీవులు: పాలకొండ నగర పంచాయతీ తెదేపా పరమైంది. సొంత మండలం సీతంపేట జడ్పీ, మండల పరిషత్తునూ నిలబెట్టుకోలేకపోయారు. పాలకొండ, వీరఘట్టం, భామిని జడ్పీ స్థానాలూ ఎంపీపీలూ ఇతర పక్షాల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

బొడ్డేపల్లి సత్యవతి: ఆమదాలవలస నియోజకవర్గంలో కొంత ప్రభావం చూపించగలిగారు. పురపాలక ఎన్నికల్లో 3 వార్డులను గెలవగలిగారు. ప్రాదేశిక ఎన్నికల్లోనూ తన వరకు ప్రభావం చూపించారు.4 మండల పరిషత్తు ప్రాదేశికాల్లో కాంగ్రెస్‌ గెలవగలిగింది.
--ఈనాడు శ్రీకాకుళం రూరల్ ,
 

  • =============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment