Tammineni Seetharam,తమ్మినేని సీతారాం .......... 2014 ఎన్నికల్లో ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి వై.ఎస్.అర్ పార్టీ తరుపున పోటీ చేశారు .ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావము తో తమ్మినేని సీతారాం ఆ పార్టీలో చేరి ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన 'ఆపరేషన్ స్వగృహ్' పిలుపు బాగానే పని చేస్తోంది. గత ఎన్నికల్లో తెదేపాకు గుడ్‌బై చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరిన పలువురు నేతలు ఒక్కొక్కరుగా తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. ఈ జాబితాలో సీనియర్ నేత తమ్మినేని సీతారాం కూడా ప్రరాపాకు గుడ్‌బై చెప్పారు. ఈయన ఈనెల 15 ఆగస్టు 2009 వ తేదీన పార్టీలో చేరనున్నట్టు బుధవారం ప్రకటించారు.
భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఆయన తన అనుచరులు, సన్నిహితులతో ఆముదాలవలసలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇందులో తిరిగి మాతృసంస్థలో చేరాలని తీర్మానించారు. బలమైన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే.. అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తన అనుచరులు, సన్నిహితులు సూచించారని చెప్పారు.
అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రరాపా ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. దీనివల్ల ప్రరాపా భవిష్యత్‌లో నిర్వీర్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆయన జోస్యం చెప్పారు. అందువల్లే తాను తెదేపాలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సీతారాం వెల్లడించారు. తమకున్న మనస్పర్థలను పక్కన పెట్టి, పార్టీకి తిరిగి పూర్వవైభవం కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలం అంటూ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని తమ్మినేని సీతారాం తప్పపట్టారు. విభజన విషయంలో బాబు కీలకపాత్ర పోషించడంపై సీతారాం నిప్పులు చెరిగారు.
బాబు వైఖరికి నిరసనగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావాన్ని ప్రకటించారు.
పూర్తి వివరాలు (Bio-Data):
· పేరు : Tammineni Seetharam,తమ్మినేని సీతారాం
·
వయస్సు : 58 ,
· పోటీ చేస్తున్న పార్టీ పేరు :
· పోటీ చేసున్న నియోజకవర్గం :
·
ఎన్నోసారి పోటీచేయడము :
·
తండ్రి / : తమ్మినేని శ్రీరామమూర్తి (లేటు),
·
భార్య :తమ్మినేని వాణశ్రీ (ఇంటర్మీడియట్ ) వ్యాపారము ,వ్యవసాయము ,
·
పిల్లలు : వెంకట శ్రీరాం ,
·
ఆడ్రస్ : పాలకొండ రోడ్ , ఆమదాలవలస ,
· పోన్ నెంబర్ :
·
చదువు : B.A - discontinued,
·
వృత్తి : వ్యవసాయము , సామాజిక రాజకీయ సేవ ,
·
కులము /మతము : కాళింగ / హిందూ ,
· ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
· నేర-అరోపణలు :
ఉన్నా కనిపించనీయరు.
source :
http://www.ceoandhra.nic.in/
- ============================
No comments:
Post a Comment