Wednesday, June 18, 2014

2014 TDP Andhrapradesh Cabinet biodatas , టి.డి.పి చంద్రబాబు మంత్రివర్గం బయోడేటా 2014



ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు జూన్‌ 8న ప్రమాణస్వీకారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఏఎన్‌యూ ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై అతిరథ మహారధుల సమక్షంలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అశేష ప్రజానీకం కరతాళ ధ్వనుల మధ్య బాబు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 19మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

1. కేఈ కృష్ణమూర్తి, 2. యనమల రామకృష్ణుడు, 3. నిమ్మకాయల చినరాజప్ప, 4. చింతకాయల అయ్యన్నపాత్రుడు, 5. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, 6. దేవినేని ఉమామహేశ్వరరావు, 7. పొంగూరు నారాయణ, 8. పరిటాల సునీత, 9. ప్రత్తిపాటి పుల్లారావు, 10. డా.కామినేని శ్రీనివాస్‌, 11. గంటా శ్రీనివాసరావు, 12.పల్లె రఘునాథరెడ్డి, 13. పీతల సుజాత, 14. కింజరాపు అచ్చెన్నాయుడు, 15. శిద్దా రాఘవరావు, 16. డాక్టర్‌ కిమిడి మృణాళిని, 17. కొల్లు రవీంద్ర, 18. రావెల కిషోర్‌బాబు, 19. పైడికొండల మాణిక్యాలరావు,
  • -------------------------------------------------------
  • బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,
  • నియోజకవర్గం: శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా,
  • స్వగ్రామం: వూరందూరు, శ్రీకాళహస్తి మండలం,
  • పుట్టిన తేది: 15 ఏప్రిల్‌ 1948; విద్యార్హత: బీఎస్‌సీ, బీఎల్‌,
  • కుటుంబం: ఈయన తండ్రి గంగసుబ్బరామిరెడ్డి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కుమార్తె బృందమ్మను గోపాలకృష్ణారెడ్డి వివాహం చేసుకున్నారు.
  • రాజకీయ నేపథ్యం: 1976లో శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి అధ్యక్షునిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1989, 1994, 99, 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో చిన్ననీటిపారుదల శాఖ మంత్రిగా, 1998లో రహదారులు, భవనాలశాఖ మంత్రిగా, 2001లో ఇన్పర్మేషన్‌ టెక్నాలజి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
-----------------------------------------------------------------


  • చింతకాయల అయ్యన్నపాత్రుడు
  • నియోజకవర్గం: నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా
  • స్వగ్రామం: నర్సీపట్నం; పుట్టిన తేదీ: 4 సెప్టెంబరు 1956
  • విద్యార్హత: బీఏ
  • కుటుంబం: భార్య పద్మావతి; కుమారులు విజయ్‌, రాజేష్‌
  • రాజకీయ నేపథ్యం: తాత రుత్తల లచ్చాపాత్రుడు నర్సీపట్నం సర్పంచిగా 38 ఏళ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన రాజకీయ వారసుడిగా అయ్యన్న 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 94, 99, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్‌ హయాంలో 1985 నుంచి 87 వరకు రాష్ట్ర సాంకేతిక, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా పనిచేశారు. 1995 నుంచి 96 వరకు చంద్రబాబు హయాంలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రిగా పనిచేశారు. 1996 నుంచి 1997 వరకు అనకాపల్లి ఎంపీ.
--------------------------------------------------------------------
  • దేవినేని ఉమామహేశ్వరరావు
  • నియోజకవర్గం: మైలవరం, కృష్ణాజిల్లా
  • స్వగ్రామం: కంచికచర్ల
  • పుట్టిన తేదీ: 12 మార్చి 1962
  • విద్యార్హతలు: బీఎస్సీ, బీటెక్‌
  • కుటుంబం: తల్లిదండ్రులు శ్రీమన్నారాయణ, సీతమ్మ;
  • భార్య: అనుపమ; పిల్లలు: నిహార్‌, జ్ఞాతవ్య
  • రాజకీయ నేపథ్యం: 1999 జూన్‌ 4న అప్పటి మంత్రిగా ఉన్న ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ రైలు ప్రమాదంలో మరణించడంతో.. జరిగిన ఉప ఎన్నికలో నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో నందిగామ నుంచి, 2009, 2014లో మైలవరం నుంచి గెలుపొందారు.
-------------------------------------------------------------

  • గంటా శ్రీనివాసరావు
  • నియోజకవర్గం: భీమిలి, విశాఖపట్నం జిల్లా
  • స్వగ్రామం: కామేపల్లి, కందుకూరు, ప్రకాశం జిల్లా
  • పుట్టిన తేదీ: 01 డిసెంబరు 1960
  • విద్యార్హతలు: బీకాం, బీఎల్‌
  • కుటుంబం: భార్య శారద, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
  • వరుసగా రెండోసారి మంత్రి పదవి: 1999లో అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు (తెదేపా), 2004లో చోడవరం ఎమ్మెల్యే, 2009లో అనకాపల్లి ఎమ్మెల్యే (ప్రరాపా)గా గెలిచారు. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో మౌలిక సౌకర్యాల కల్పన, పెట్టుబడులు, ఓడరేవుల మంత్రిగా పనిచేశారు.
  • ------------------------------------------------------------


  • కేఈ కృష్ణమూర్తి
  • నియోజకవర్గం: పత్తికొండ, కర్నూలు జిల్లా
  • స్వగ్రామం: కంబాలపాడు, కృష్ణగిరి మండలం
  • పుట్టిన తేదీ: 2 అక్టోబరు 1938; విద్యార్హత: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
  • కుటుంబం: భార్య పద్మావతి, కుమారులు శ్యాంబాబు, హరిబాబు, కుమార్తెలు ఉమ, విజయ.
  • జిల్లాలో తెదేపాకు పెద్ద దిక్కు: దివంగత ఎమ్మెల్సీ కేఈ మాదన్న రాజకీయ వారసునిగా కృష్ణమూర్తి 1978లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌ నుంచి మొదటి సారి డోన్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెదేపా నుంచి1983, 1985, 89లో డోన్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో కోట్ల విజయభాస్కరరెడ్డిపై ఎంపీగా విజయం సాధించారు. 2009లో డోన్‌ నుంచి తెదేపా ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయంసాధించారు.
  • ---------------------------------------------------------------


  • కామినేని శ్రీనివాస్‌
  • నియోజకవర్గం: కైకలూరు, కృష్ణాజిల్లా
  • స్వగ్రామం: వరహపట్నం, కైకలూరు మండలం
  • పుట్టిన తేదీ: 3 డిసెంబరు 1947
  • విద్యార్హత: ఎంబీబీఎస్‌ చదవి కొంతకాలం వైద్యుడిగా హైదరాబాద్‌లో ప్రాక్టీస్‌ చేశారు.
  • కుటుంబం: తల్లిదండ్రులు రాజేశ్వరమ్మ, విజయసింహం, భార్య: కామినేని మనోరమ; ముగ్గురు కుమారులు ఉన్నారు.
  • తెదేపా వ్యవస్థాపక సభ్యుడు: ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించిన సమయంలో వ్యవస్థాపక సభ్యుడు. 1984లో శాసన మండలి సభ్యుడయ్యారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో భాజపా నుంచి గెలిచారు.
  • ----------------------------------------------------------


  • కిమిడి మృణాళిని
  • నియోజకవర్గం: చీపురుపల్లి, విజయనగరం
  • స్వగ్రామం: రేగిడి, శ్రీకాకుళం జిల్లా
  • పుట్టిన తేదీ: 05 మార్చి 1958; విద్యార్హత: ఎంబీబీఎస్‌
  • కుటుంబం: భర్త కిమిడి గణపతిరావు, మాజీ ఎమ్మెల్యే, పిల్లలు: మాళవిక, నాగార్జున
  • రాజకీయ నేపథ్యం: భర్త గణపతిరావు శ్రీకాకుళం జిల్లా ఉణుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. బావ కిమిడి కళావెంకటరావు ప్రస్తుతం ఎచ్చెర్ల శాసనసభ్యునిగా ఉన్నారు. మృణాళిని విజయనగరం జిల్లా తెర్లాం మండలం పెరుమాళి పీహెచ్‌సీ వైద్యాధికారిగా పనిచేస్తూ 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించారు. 1991లో రెండోసారి శ్రీకాకుళం జడ్పీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
  • ----------------------------------------------------------


  • కింజరాపు అచ్చెన్నాయుడు
  • నియోజకవర్గం: టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
  • స్వగ్రామం: నిమ్మాడ, కోటబొమ్మాళి మండలం
  • పుట్టిన తేదీ: 26 మార్చి 1971; విద్యార్హతలు: బీఎస్సీ
  • కుటుంబం: తల్లిదండ్రులు కింజరాపు దాలినాయుడు, కళావతమ్మ; భార్య- విజయమాధవి (నిమ్మాడ సర్పంచి); కుమారులు- కృష్ణమోహన్‌నాయుడు, తనూజ్‌నాయుడు
  • 25 ఏళ్లకే ఎమ్మెల్యే: సోదరుడు ఎర్రన్నాయుడు 1996లో ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా నియమితులవ్వడంతో అప్పటివరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన హరిశ్చంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలతో అచ్చెన్నాయుడు రాజకీయరంగ ప్రవేశం చేశారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004లోనూ విజయం సాధించారు.
  • ----------------------------------------------------------

  • కొల్లు రవీంద్ర
  • నియోజకవర్గం: మచిలీపట్నం, కృష్ణా
  • పుట్టిన తేదీ: 20 జూన్‌ 1972
  • విద్యార్హత: బీఏ, ఎల్‌ఎల్‌బీ
  • కుటుంబం: తల్లిదండ్రులు కొల్లు సుబ్బారావు, వెంకట సౌభాగ్యవతి; భార్య నీలిమ, పిల్లలు పునిత్‌చంద్ర, జిషాంత్‌
  • రాజకీయ నేపథ్యం: 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో తెదేపా అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2010 నుంచి తెలుగు యువత జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికై, వెంటనే మంత్రి పదవి దక్కించుకున్నారు. రవీంద్ర మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు అల్లుడు.
  • ----------------------------------------------------------

  • నిమ్మకాయల చినరాజప్ప
  • కుటుంబం: భార్య అనురాధ. ఈమె 1996లో ఉప్పలగుప్తం ఎంపీపీగా సేవలందించారు. కుమార్తె శివకల్యాణి, కుమారుడు రంగనాథ్‌.
  • రెండు దశాబ్దాలుగా జిల్లా అధ్యక్షుడు: 1983లో పార్టీలో చేరారు. 1987లో ఉప్పలగుప్తం ఎంపీపీగా ఎన్నిక. 2001లో కెనరా బ్యాంకు డైరెక్టరుగా విధులు చేపట్టారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు. తెదేపా జిల్లా అధ్యక్షునిగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు.
  • నియోజకవర్గం: పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా
  • స్వగ్రామం: పెదగాడవిల్లి, ఉప్పలగుప్తం మండలం
  • పుట్టిన తేదీ: 1 అక్టోబరు 1953
  • విద్యార్హతలు: ఎంఏ
  • తల్లిదండ్రులు: వెంకటరంగయ్య, కొండమ్మ
  • ------------------------------------------------------------------

  • పైడికొండల మాణిక్యాలరావు
  • నియోజకవర్గం: తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా
  • స్వస్థలం: తాడేపల్లిగూడెం పట్టణం
  • పుట్టిన తేదీ: 1 నవంబరు, 1961
  • విద్యార్హత: డిగ్రీ మధ్యలో ఆపేశారు
  • కుటుంబం: భార్య సూర్యకుమారి, గృహిణి
  • రాజకీయ నేపథ్యం: భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యనిర్వాహకసభ్యుడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఫొటోగ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ట్రాక్టర్‌ యంత్రాల విడిభాగాల వ్యాపారం చేస్తున్నారు
  • ----------------------------------------------------------

  • పల్లె రఘునాథరెడ్డి
  • నియోజకవర్గం: పుట్టపర్తి, అనంతపురం జిల్లా
  • స్వగ్రామం: పల్లెవాండ్లపల్లి గ్రామం, నల్లచెరువు మండలం
  • పుట్టిన తేదీ: 18 ఏప్రిల్‌ 1954
  • విద్యార్హతలు: ఎంఎస్సీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, ఈజిప్టు డబ్ల్యూ.ఐ.డి.యు. విశ్వవిద్యాలయం నుంచి మరో డాక్టరేట్‌
  • కుటుంబ నేపథ్యం: తల్లిదండ్రులు పల్లె చినవెంకటరెడ్డి, చినవెంకట నరసమ్మ; భార్య ఉమ, కుమారుడు పల్లె వెంకట క్రిష్ణ కిషోర్‌రెడ్డి, కోడలు సింధూర రెడ్డి
  • ఎన్నో అవార్డులు: పలు రంగాల్లో 10 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. బాలాజీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వ్యవస్థాపకులు. సాధారణ, సాంకేతిక విద్యాసంస్థల అధిపతి. 1997-99మధ్య రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ సంచాలకులుగా విధులు నిర్వర్తించారు.
  • ---------------------------------------------------------

  • పరిటాల సునీత
  • నియోజకవర్గం: రాప్తాడు, అనంతపురం జిల్లా
  • స్వగ్రామం: వెంకటాపురం, రామగిరి మండలం
  • పుట్టిన తేదీ: 28 మే 1970; విద్యార్హత: 9వ తరగతి
  • కుటుంబ నేపథ్యం: భర్త దివంగత పరిటాల రవీంద్ర. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్‌ ఏడాది నుంచి సేవా కార్యక్రమాల్లో, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సునీత భర్త పరిటాల రవీంద్ర నక్సల్స్‌ ఉద్యమం నుంచి ఎన్టీఆర్‌ పిలుపు మేరకు 1994లో తెలుగుదేశం అభ్యర్థిగా పెనుకొండలో పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి 2004లో హత్యకు గురయ్యే వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. తదనంతరం సునీత 2005 ఉప ఎన్నికల్లో పెనుకొండ తెదేపా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రాప్తాడు నుంచి గెలుపొందారు.
  •  
  • ---------------------------------------------------------

  • పీతల సుజాత
  • నియోజకవర్గం: చింతలపూడి(ఎస్సీ), పశ్చిమగోదావరి జిల్లా
  • స్వస్థలం: వీరవాసరం
  • పుట్టిన తేదీ: 13 ఫిబ్రవరి 1975
  • విద్యార్హత: ఎంఏ, బీఈడీ
  • కుటుంబం: భర్త సురేష్‌కుమార్‌, ఉపాధ్యాయుడు
  • రాజకీయ నేపథ్యం: 2004-2009 మధ్య ఆచంట ఎమ్మెల్యేగా పనిచేశారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా నరసాపురం మండలం కొప్పర్రులో పనిచేస్తూ 2004లో తెదేపాలో చేరారు. రెండుసార్లు కూడా స్థానికేతర నియోజకవర్గాల్లోనే ఆమె గెలుపొందడం గమనార్హం. చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఆయనతోపాటు జిల్లాలో ఎక్కువదూరం నడిచినవారిలో సుజాత ఒకరు.
  •  
  • ------------------------------------------------------------

  • పొంగూరు నారాయణ
  • విద్యాభ్యాసం: ఎంఎస్సీ, పీహెచ్‌డీ; పుట్టినతేదీ: 1957
  • భార్య పేరు: రమాదేవి, కుమార్తె సింధూర, కుమారుడు నిషిత్‌
  • స్వస్థలం: తోటపల్లిగూడూరు, నెల్లూరు జిల్లా
  • కుటుంబ నేపథ్యం: నారాయణ తండ్రి ఓ ప్రైవేటు బస్సు కండక్టరు. డిగ్రీ, పీజీల్లో యూనివర్సిటీ ఫస్ట్‌గా నిలిచి బంగారు పతకాన్ని సాధించిన నారాయణ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. 1979లో నెల్లూరులో నారాయణ కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 300లకు పైగా జూనియర్‌ కళాశాలలు, 250కి పైగా పాఠశాలలు, మెడికల్‌, డెంటల్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు నడుస్తుండడం విశేషం.
  • ప్రస్తుతం నారాయణ ఉభయ సభల్లోనూ సభ్యుడు కాకపోయినా మంత్రిపదవి వరించడం విశేషం.
  • ----------------------------------------------------------

  • ప్రత్తిపాటి పుల్లారావు
  • నియోజకవర్గం: చిలకలూరిపేట, గుంటూరు జిల్లా
  • స్వగ్రామం: బొబ్బేపల్లి, మార్టూరు మండలం, ప్రకాశం జిల్లా.
  • పుట్టిన తేదీ: 29 మే 1960 ; విద్యార్హత: బీకాం
  • కుటుంబం: తల్లిదండ్రులు సుబ్బారావు, నారాయణమ్మ. భార్య వెంకటకుమారి; కుమార్తె స్వాతి, కుమారుడు శరత్‌.
  • రాజకీయ నేపథ్యం: పత్తి వ్యాపారిగా ఉన్న పుల్లారావు 1999లో చిలకలూరిపేట తెదేపా అభ్యర్థిగా విజయం సాధించారు. 2004లో ఓటమి పాలయ్యారు. 2009లో, 2014లో విజయం సాధించారు. 2006 నుంచి గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 1952 నుంచి చిలకలూరిపేట నియోజకవర్గానికి దక్కని మంత్రి పదవి ప్రత్తిపాటికి దక్కింది.
  • ------------------------------------------------------------

  • రావెల కిషోర్‌బాబు
  • నియోజకవర్గం: ప్రత్తిపాడు (ఎస్సీ), గుంటూరు జిల్లా
  • స్వగ్రామం: రావెల, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా
  • పుట్టినతేదీ: 1958 మార్చి 11
  • విద్యర్హత: ఎంఫిల్‌
  • కుటుంబం: తండ్రి ఇసాక్‌, భార్య శాంతిజ్యోతి. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
  • నేపథ్యం: కిషోర్‌బాబు దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేస్తూ 2014 ఏప్రిల్‌ 15న రాజీనామా చేసి తెదేపా అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారే మంత్రి అయ్యారు. కిషోర్‌బాబు గతంలో దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి వద్ద కార్యదర్శిగా పని చేశారు.
  •  
  • -----------------------------------------------------------

  • శిద్దా రాఘవరావు
  • నియోజకవర్గం: దర్శి, ప్రకాశం జిల్లా
  • స్వగ్రామం: చీమకుర్తి, ప్రకాశం జిల్లా
  • పుట్టిన తేదీ: 10 ఆగస్టు 1957
  • విద్యార్హత: బీకాం
  • కుటుంబం: తల్లిదండ్రులు శిద్దా వెంకటసుబ్బమ్మ, వెంకటేశ్వర్లు
  • భార్య: లక్ష్మీపద్మావతి, కుమారుడు సుధీర్‌కుమార్‌, కుమార్తె: సునీత ప్రసన్న మణికుమారి
  • రాజకీయ ప్రవేశం: చంద్రబాబు పిలుపు అందుకుని 1999లో తటస్థుడిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2002 నుంచి 2004 వరకు శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు. 2007లో తెదేపా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2011 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు.
  •  
  • ----------------------------------------------------------------

  • యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ
  • స్వగ్రామం: ఎ.వి.నగరం, తొండంగి మండలం, తూర్పుగోదావరి జిల్లా
  • పుట్టిన తేదీ: 1951
  • విద్యార్హత: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
  • కుటుంబం: భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు
  • డబుల్‌ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే: 1983లో పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన యనమల 1983, 85, 89, 1994, 99, 2004 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు విజయంతో డబుల్‌హ్యాట్రిక్‌ సాధించారు. సహకారశాఖ, పురపాలకశాఖ, ఆర్థికశాఖ మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా, పబ్లిక్‌ అకౌంట్స్‌కమిటీ ఛైర్మన్‌గా అనేక పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూ, శాసనమండలి పక్షనేతగా ఉన్నారు.

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment