Monday, April 28, 2014

2014 Cine artists in A.P elections2014,ఎన్నిక(2014)ల్లో సినీ ప్రముఖులు

  •  



ఎన్నికల్లో సినీ ప్రముఖులు, నటులు పోటీ చేయడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో సినీరంగం నుంచి 10 మంది పోటీలో ఉన్నారు. లోక్‌సభకు ఇద్దరు నటులు, ఒక సినీనిర్మాత ఉన్నారు.

రాజమండ్రి నుంచి మురళీమోహన్‌ తెదేపా పక్షాన పోటీలో ఉన్నారు. ఏడాదిగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. విజయంపై నమ్మకంతో ఉన్నారు. చిత్తూరు ఎంపీ, సినీనటుడు ఎన్‌.శివప్రసాద్‌ మరోసారి తెదేపా పక్షాన ఎన్నికల బరిలో నిలిచారు. ఈయన రాష్ట్ర విభజన అంశంపై పార్లమెంటులో వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. రోజుకో వేషధారణతో సభకు వెళ్లి ఆంధ్ర ప్రజల మనోగతాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చారు. సినీ రంగంతో ఎప్పటి నుంచో అనుబంధం ఉన్న మాగంటి కుటుంబం నుంచి మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు ఏలూరు పార్లమెంటు స్థానానికి తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు.

''నందమూరి బాలకృష్ణ'' తొలిసారిగా తెదేపా తరఫున హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్‌ ఇక్కడి నుంచే పోటీ చేశారు. నటి ''రోజా'' మూడోసారి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. గతంలో రెండుసార్లు ఆమె శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. ఈసారి చిత్తూరు జిల్లా నగరి శాసనసభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హాస్య, సహాయ నటి పాత్రలు పోషించే ''హేమ'' మొదటిసారి పోటీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట శాసనసభ స్థానానికి జైసపా నుంచి పోటీలో ఉన్నారు. సినీదర్శకుడు పూరి జగన్నాధ్‌ తమ్ముడు ''పి.ఉమాశంకర్‌ గణేష్‌'' వైకాపా నుంచి విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా పలు పాత్రల్లో తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడైన ''వై.సుధాకర్‌నాయుడు(జీవీ)'' విశాఖపట్టణం జిల్లా గాజువాక శాసనసభ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన దర్శకుడిగా కూడా పనిచేశారు. రెండుసార్లు తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న ''కొడాలి నాని'' వైకాపాలో చేరారు. కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో సినిమా నిర్మించారు. సినీ నిర్మాత ''చెంగల వెంకట్రావు'' విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేట శాసనసభ స్థానానికి వైకాపా పక్షాన పోటీ చేస్తున్నారు.

  • =====================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment