.సార్వత్రిక ఎన్నికలు 2014(General Elections 2014) లో విభజన తర్వాత --తెలంగాణలో 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలు , ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ బరిలో 2,576 మంది---తెలంగాణలో 1,934 అభ్యర్థులు---రెండు రాష్ట్రాల్లో కలిపి 4,510 మంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 4,510 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం23-04-2014 తో ముగియడం జరిగినది .
* ఓటు హక్కును వినియోగించుకునేందుకు గతములో 62 వేలు ఉన్న పోలింగు కేంద్రాలను 71,223కు పెంచారు .
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పార్లమెంటు స్థానాలు- అభ్యర్థుల సంఖ్య :
- అరకు-- 11,
- శ్రీకాకుళం-- 10,
- విజయనగరం-- 9,
- విశాఖపట్నం-- 22,
- అనకాపల్లి --8,
- కాకినాడ --22,
- అమలాపురం --14,
- రాజమండ్రి-- 14,
- నర్సాపురం--14,
- ఏలూరు --15,
- మచిలీపట్నం --11,
- విజయవాడ-- 22,
- గుంటూరు --12,
- నరసరావుపేట --11,
- బాపట్ల-- 14,
- ఒంగోలు --15,
- నంద్యాల-- 14,
- కర్నూలు --12,
- అనంతపురం--13,
- హిందుపురం-- 12,
- కడప--14,
- నెల్లూరు--14,
- తిరుపతి-- 14,
- రాజంపేట-- 9,
- చిత్తూరు-- 7,
సీమాంధ్ర లో అసెంబ్లీ స్థానాలకు జిల్లాల వారీగా నామినేషన్లు వేసిన అబ్యర్ధులు ..
- శ్రీకాకుళం--84,
- విజయనగరం--77,
- విశాఖపట్నం--178,
- తూర్పుగోదావరి --250,
- పశ్చిమగోదావరి-- 163,
- కృష్ణా-- 227,
- గుంటూరు--239,
- ప్రకాశం --189,
- నెల్లూరు--138,
- కడప-- 143,
- కర్నూలు-- 180,
- అనంతపురం-- 188,
- చిత్తూరు--187,
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య :
ప్రాంతం------శాసనసభ అభ్యర్థులు --లోక్‌సభ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్- 2,243------------- 333
తెలంగాణ--- 1,669 ----------------265
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలో 12మంది
బరిలో ముగ్గురు స్వతంత్య్ర అభ్యర్ధులు--సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 12 మంది తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. 15 మంది నామినేషన్లు దాఖలు చేయగా తెదేపా నుంచి నామినేషన్ దాఖలు చేసిన గుండ విశ్వనాథ్ నామినేషన్ తిరస్కరించగా మరో ఇద్దరు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకొన్నారు. ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలకు చెందిన గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు కాంగ్రెస్ నుంచి చౌదరి సతీష్‌లు పోటీలో ఉన్నారు.
- రాజాంలో వైకాపా రెబల్‌గా పీఎంజేబాబు,
- పలాసలో కాంగ్రెస్ రెబెల్‌గా శారద,
బుధవారం నామపత్రాల ఉపసంహరణ అనంతరం నికరంగా తుది జాబితా ఖరారైంది. * శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి మొత్తం 15 మంది నామపత్రాలు దాఖలు చేశారు. నాలుగు తిరస్కారానికి గురయ్యాయి. ఒకరు నామపత్రాన్ని ఉపసంహరించుకున్నారు. పదిమంది పోటీలో నిలిచారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది.
* అసెంబ్లీ స్థానాలకు 122 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 15 మందివి తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 107 లో 23 మంది నామపత్రాలను ఉపసంహరించుకున్నారు.* అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా శ్రీకాకుళం నుంచి 12 మంది పోటీలో ఉన్నారు. పలాసలో 11 మంది, ఇచ్ఛాపురం, రాజాం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో తొమ్మిది మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఎచ్చెర్ల నుంచి 8 మంది, పాలకొండ, నరసన్నపేట నియోజకవర్గాల నుంచి ఏడుగురు చొప్పున, టెక్కలి, పాతపట్నం నుంచి ఆరుగురేసి బరిలో నిలిచారు.
లోక్‌సభ అభ్యర్థులు గుర్తులు ఇవే...
* కిల్లి కృపారాణి (కాంగ్రెస్) హస్తం,
బొడ్డేపల్లి రాజారావు (బీఎస్పీ) ఏనుగు,
కింజరాపు రామ్మోహన్‌నాయుడు (తెదేపా) సైకిల్,
కడియం జయలక్ష్మి (పిరమిడ్ పార్టీ) టెలివిజన్,
ఇంజరాపు జయదేవ్ (ఆమ్ ఆద్మీ).చీపురు,
పైడి రాజారావు (జై సమైక్యాంధ్ర) పాదరక్షలు,
రెడ్డి శాంతి (వైకాపా) సీలింగ్ ఫ్యాన్,
బొడ్డు వాసుదేవరావు (సిపిఐ లిబరేషన్) ఆటో రిక్షా,
కింజరాపు తేజేశ్వరరావు (స్వతంత్ర) బ్యాట్,
తోట తేజేశ్వరరావు (స్వతంత్ర) కోకోనట్
జిల్లా ఓటర్లు :
జిల్లా ఓటర్లు 19,85,239.
రెండు నెలల్లో పెరుగుదల 55,804. శ్రీకాకుళం, ఇచ్ఛాపురంల్లో అత్యధికంగా కొత్త ఓటర్ల నమోదు. జిల్లాలో ఓటర్లు భారీగా పెరిగారు. అదీ కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 55,804 మంది కొత్తగా చేరారు. దీంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో 19,85,239 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టినందున భారీగా పేర్లు నమోదయ్యాయని యంత్రాంగం చెబుతోంది.
- గత జనవరి నాటికి జిల్లాలో నమోదైన ఓటర్లు--- 19,29,435 మంది.
- వీరిలో పురుషులు,= 9,64,055 మంది ,
- మహిళలు= 9,65,190 మంది ఉన్నారు.
ఓటర్లు కొత్తగా చేరారు.
- Courtesy with : ఈనాడు - హైదరాబాద్
- ==============================
No comments:
Post a Comment