Sunday, April 27, 2014

Killari Ravikiran,కిల్లారి రవికిరణ్‌




 ఎచ్చెర్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కిల్లారి రవికిరణ్‌ది జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామం. ఈయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు. రవికిరణ్‌ తండ్రి కిల్లారి సత్యనారాయణ పంచాయతీ రాజ్‌ విభాగంలో గుమాస్తాగా చేరి కడప జిల్లా పంచాయతీ అధికారిగా 2004లో ఉద్యోగ విరమణ పొందారు. ఆ వెంటనే తెదేపాలో చేరారు. జిల్లా తెదేపా ఉపాధ్యక్ష పదవి కూడా చేపట్టారు. 2004లో తెదేపా టిక్కెట్టు ఆశించినప్పటికీ రాలేదు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఎచ్చెర్ల అభ్యర్థిత్వం కోసం బొత్స సత్యనారాయణ, కోండ్రు మురళీమోహన్‌ను కోరారు. వీరి సూచనల మేరకు కుమారుడు రవికిరణ్‌కు అవకాశం ఇచ్చారు.
* రవికిరణ్‌ కాకినాడలో బిటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగు పూర్తి చేశారు. కోల్‌కతాలో ఎంటెక్‌ కంప్యూటర్స్‌ పూర్తి చేశారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికై హర్యానాలోని గుర్గావ్‌లో ఉద్యోగంలో చేరారు. గుర్గావ్‌ నుంచి బెంగళూరు బదిలీ అయ్యారు.
* తెదేపా నాయకుడు కిమిడి కళావెంకటరావు సోదరుడి కుమార్తె ఈయన భార్య.


పూర్తి వివరాలు (Bio-Data):

  • పేరు :   Killari Ravikiran,కిల్లారి రవికిరణ్‌,
  • వయస్సు :  39 సం.లు ,
  • పోటీ చేస్తున్న పార్టీ పేరు : కాంగ్రెస్ (INC),
  • పోటీ చేసున్న నియోజకవర్గం : ఎచ్చెర్ల అసెంబ్లీ ,
  • ఎన్నోసారి పోటీచేయడము : మొదటిసారి ,
  • తండ్రి  :  కిల్లారి సత్యనారాయణ ,
  • ఆడ్రస్ :  డోర్ .నెం: 1-72 చెట్టుపొదిలాం . గ్రామము , జి.సిగడాం (మం) , శ్రీకాకుళం జిల్లా532148,
  • పోన్‌ నెంబర్ : 9701279418,
  • చదువు : M.Tech,
  • వృత్తి :  సాఫ్ట్ వేర్ ఇంజనీర్(M.Tech) & సామాజిక / రాజకీయ సేవ ,
  • కులము /మతము :  కాపు / హిందూ,
  • భార్య : తెదేపా నాయకుడు కిమిడి కళావెంకటరావు సోదరుడి కుమార్తె ఈయన భార్య.
  • పిల్లలు :
  • ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
  • నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

source : http://www.ceoandhra.nic.in/

 

  • ========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment