స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపు
జడ్పీ ఛైర్మన్‌కు రూ.40 వేలు .సర్పంచ్‌కు రూ.3 వేలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలోని 12,918 మంది సర్పంచులు, 659 మంది జడ్పీటీసీ సభ్యులు, 659 మంది ఎంపీపీలు, 10,148 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు మేయర్లు, కార్పొరేటర్లు, పురపాలక సంఘాల ఛైర్మన్లు, కౌన్సిలర్లకు వేతనాలు పెరగనున్నాయి. పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధులకు వేతనాల పెంపు వల్ల ప్రభుత్వంపై రూ.93 కోట్ల అదనపు భారం పడనుంది. పురపాలక సంస్థల ప్రతినిధులనూ కలిపితే ఈ భారం మొత్తం సుమారు రూ.125 కోట్లు ఉంటుందని అంచనా. వేతనాల పెంపు నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు బాబూరాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షుడు సుబ్బరామయ్యలు సోమవారమిక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేతనాల పెంపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రెండు, మూడురోజుల్లో ప్రకటించనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పెరిగిన వేతనాలు ఇలా ఉండబోతున్నాయి.
- ========================