Sunday, April 20, 2014

History of parties in Andhrapradesh,ఆంధ్రప్రదేశ్‌లోని పార్ట్టీలు చరిత్ర




1. భారత జాతీయ కాంగ్రెస్‌(NCP) :
ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం ముందు నుంచే కాంగ్రెస్‌ కీలకమైన రాజకీయపక్షంగా వుంది. 1956 నుంచి 1983 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన కొనసాగింది. 83,85 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ఓటమి చెందింది. అనంతరం 1989లో తిరిగి అధికారంలోకి వచ్చి 94, 99 ఎన్నికల్లో పరాజయం పాలైంది. 2004, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకుంది. ప్రస్తుతం రాష్ట్రం విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ పరిధిలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ సారధులుగా పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి వ్యవహరిస్తున్నారు.

2. తెలుగుదేశం(TDP) :
ప్రముఖ తెలుగు సినీనటుడు నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని 1982లో నెలకొల్పారు. పార్టీని స్థాపించిన తొమ్మిదినెలల్లోనే 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అనంతరం జరిగిన పరిణామాలతో అప్పటి ముఖ్యమంత్రి రామారావు విధానసభను రద్దుచేయడంతో తిరిగి 1985లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం భారీ విజయాన్ని నమోదుచేసింది. 1989లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైంది. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కొద్దికాలానికే చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో బాబు నాయకత్వంలో తెలుగుదేశం విజయం సాధించింది. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయింది. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు వున్నారు.

3. భారతీయ జనతా పార్టీ(BJP) :
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖకు కిషన్‌రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. 1980లో ఆవిర్భవించిన పార్టీ క్రమేణా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి తన ప్రాబల్యాన్ని విస్తరించింది. భాజపా రాష్ట్రశాఖకు చెందిన నాయకులు వెంకయ్యనాయుడు, బంగారు లక్ష్మణ్‌, బండారు దత్తాత్రేయ...తదితరులు జాతీయనేతలుగా ఎదిగారు.

4. వామపక్షాలు(Left parties) :
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన కమ్యూనిస్టులు హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ యూనియన్‌లో విలీనమైన అనంతరం రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదిగారు. 1964లో జాతీయస్థాయిలో పార్టీలో చీలిక ఏర్పడింది. కమ్యూనిస్టులు, మార్కిస్టులుగా పార్టీ చీలిపోయింది. అయితే ఉభయ వామపక్షాలు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో తమ పట్టును నిలుపుకోవడం గమనార్హం. సీపీఐకి రాష్ట్ర కార్యదర్శిగా నారాయణ, సీపీఎంకు రాఘవులు కార్యదర్శిగా వున్నారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించడంతో తెలంగాణ సీపీఎం శాఖకు తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్‌ సీపీఎం శాఖకు మధు కార్యదర్శులుగా నియమితులయ్యారు.

5. తెలంగాణా రాష్ట్రసమితి(TRS):
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రసమితిని నెలకొల్పారు. అనతికాలంలోనే తెలంగాణలో పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, 2009 ఎన్నికల్లో తెలుగుదేశంలో ఎన్నికల పొత్తు పెట్టుకొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది.

6, మజ్లిస్‌ ఇత్తెదుహాల్‌ ముస్లిమిన్‌(MIM) :
మజ్లిస్‌ను 1927లో హైదరాబాద్‌ సంస్థానానికి చెందిన మహ్మద్‌ నవాజ్‌ ఖాన్‌ స్థాపించారు. హైదరాబాద్‌లో పట్టున్న ఈ పార్టీకి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కర్నూలు ...తదితర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ బలముంది. అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.

7. వైకాపా(YSR CP) :
కాంగ్రెస్‌ ఎంపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైకాపాను ఏర్పాటుచేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్‌ విజయమ్మ, పార్టీ అధ్యక్షునిగా జగన్‌ ఉన్నారు.

8. జైసమైక్యాంధ్ర(JSA) :
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని ప్రారంభించారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌, హర్షకుమార్‌, తులసీరెడ్డి, సాయిప్రతాప్‌, లగడపాటి రాజగోపాల్‌, సబ్బంహరి... తదితరులు ముఖ్యనేతలుగా వున్నారు.

9. జనసేన(JS) :
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ పేరుతో నూతన రాజకీయపక్షాన్ని నెలకొల్పారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేయడంతో పాటు అవినీతి, బ్లాక్‌మార్కెట్‌...తదితర సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు.

10. ఎస్సీ, బీఎస్పీ, ఆర్‌ఎన్‌ఎల్‌డీ...తదితర జాతీయపక్షాలకు చెందిన శాఖలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ అంత బలంగా లేవు

No comments:

Post a Comment