- Pusapati Ashok gajapati raju,పూసపాటి అశోక్ గజపతి రాజు : విజయనగరం పార్లమెంట్ నియోజక పరిధిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎచ్చెర్ల , రాజాం అసెంబ్లీ సెగ్మెంట్స్ కలిసి ఉన్నాయి. అందుచే గజపతిరాజు గారు కొంతమేరకు శ్రీకాకుళం జిల్లా లో రాజకీయం చేయవలసి ఉంది.
అలనాటి విజయ నగర సామ్రాజ్య వారసులైనా... సంప్రదాయాలకు... ప్రజాస్వామ్య విలువలకు పెట్టింది పేరు... పూసపాటి వారి వంశం. 1952 నుంచి ‘గజపతి నగరం’ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పూసపాటి విజయ రామ గజపతి రాజు కుమారుడు అశోక్ గజపతి రాజు ప్రస్తుతం రద్దయిన శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. 2004 ఎన్నికలు మినహా ఏడుసార్లు విజయం సాధించిన నేపథ్యం అశోక్ గజపతి రాజుది.
1978లో తొలిసారి జనతా పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహించిన అశోక్ గజపతి రాజు 1983 నుంచి వరుసగా 1999 వరకూ గజపతి నగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చిన సీనియర్ సభ్యుడు. 2004 ఎన్నికల్లో మాత్రం స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన కె వీరభద్రస్వామి చేతిలో తొలిసారి పరాజయాన్ని మూట గట్టుకున్నారు. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మీసాల గీత పోటీతో 28,341 ఓట్ల చీలికతో కాంగ్రెస్ పార్టీ నేతగా పోటీ చేసిన కోళ్ల వీరభద్రస్వామిపై అశోక్ గజపతి రాజుపై కేవలం 3282 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
1983లో తొలిసారి ఎన్నికైన అశోక్ గజపతి రాజు, 1985లో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కేబినెట్‌లో చోటు దక్కించుకున్న పూసపాటి అశోక్ గజపతి రాజు, తెదేపా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారంటే అతిశేయోక్తి కాబోదు. 1995లో తెలుగుదేశం పార్టీ అంతర్గత సంక్షోభంలో చిక్కకున్నప్పుడు రాయబార ప్రతినిధుల్లో అశోక్ గజపతి రాజు ఒకరు. చంద్రబాబు నాయుడు తొలి కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందీ పూసపాటి అశోక్ గజపతి రాజే.
ఆయన తండ్రి విజయరామ జగపతి రాజు కూడా శాసనసభకు 1952 నుంచి ఏడుసార్లు ఎన్నికై రికార్డు నెలకొల్పారు. ఈ నియోజకవర్గం నుంచి 1962లో కాంగ్రెస్ ఎన్నికైన భాట్టం శ్రీ రామ్మూర్తి అంతకుముందు 1957లో సోషలిస్టు పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అన్న ఆనంద గజపతి రాజు కూడా తెదేపా, కాంగ్రెస్ పార్టీల నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు.
- పూర్తి వివరాలు (Bio-Data):
పేరు : Pusapati Ashok gajapati raju,పూసపాటి అశోక్ గజపతి రాజు ,
వయస్సు : 62 సం.లు ,
పుట్టిన ఊరు : విజయనగరం ,
కులము /మతము : క్షత్రియ (రాజులు)-హిందూ,
ఆడ్రస్ : నెం.5 బంగ్లా,కంటోన్ మెంట్ , విజయనగరం -535003,
పోన్ నెంబర్ : 9440822599,
తల్లి :
తండ్రి
: లేటు - పి.వి.జి. రాజు ,
భార్య : గృహిణి ,
పిల్లలు :
చదువు : మెట్రిక్యులేషన్ ,
వృత్తి : ల్యాండ్ లార్డ్ & రాజకీయము ,
పోటీ చేస్తున్న పార్టీ పేరు : తెలుగు దేశం ,
పోటీ చేసున్న నియోజకవర్గం : విజయనగరం పార్లిమెంట్ నియోజగకవర్గం ,
ఎన్నోసారి పోటీచేయడము : పలు మార్లు ,
ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు
.
నేర-అరోపణలు :
ఉన్నా కనిపించనీయరు.
source :
http://www.ceoandhra.nic.in/
- ========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.
No comments:
Post a Comment