Saturday, March 21, 2009

పాలకొండ నియోజకవర్గం 2009 , Palakonda Assembly constituency 2009



-->
* పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాలు ఉన్నాయి. * మొత్తం 699.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. * విజయనగరం జిల్లా నుంచి, అటు ఒరిస్సా సరిహద్దుగా ఉంది. తూర్పున ఆముదాలవలస నియోజకవర్గం, పశ్చిమాన విజయనగరం జిల్లా, దక్షిణాన రాజాం నియోజకవర్గం, ఉత్తరాన పాతపట్నం నియోజకవర్గాల మధ్య ఉంది. * 2011 లెక్కల ప్రకారం జనాభా 2,40,087. ఇందులో పురుషులు 1,14,614, మహిళలు 1,16,200 మంది. * మొత్తం ఓటర్లు 1,50,813. ఇందులో మహిళలు 78,357, పురుషులు 72,456 మంది. * పాలకొండ మండల విస్తీర్ణ 119.82 చదరపు కిలోమీటర్లు. వీరఘట్టం మండల విసీర్ణం 137.48 చదరపుకిలోమీటర్లు. సీతంపేట మండల విస్తీర్ణం 303.08 చదరపు కిలోమీటర్లు. భామిని మండల విస్తీర్ణం 139.27 చదరపు కిలోమీటర్లు. * నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పరిస్థితి: 2009లో నియోజకవర్గ పునర్విభజన చేశారు. పునర్విభజనకు ముందు పాలకొండ, రేగిడి, సంతకవిటి మండలాలు ఉండేవి. * డివిజన్‌కేంద్రం కావడంతో పాలకొండ పట్టణం విస్తరిస్తోంది. దీనికితోడు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా ఉంది. ప్రస్తుతం పట్టణంలో సెంటు గృహనిర్మాణ భూమి ధర రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు పలుకుతోంది.
  • చూడదగిన ప్రాంతాలు
* ఏజెన్సీలోని సీతంపేట మండలంలో సున్నపుగెడ్డ జలపాతం, కొండల్లో మలుపులతో ప్రకృతిని కట్టిపడేసే అడవితల్లి సోయగాలు, అబ్బురపరిచే దోనుబాయి లోయల రహదారి, హడ్డుబంగి సమీపంలో కారిగూడ వద్ద ఉన్న చింతాడగెడ్డ జలపాతం మనోహరంగా ఉంటాయి. రాష్ట్రస్థాయిలో సంచలనం రేపిన కన్నెధార కొండలు పులిపుట్టి వద్ద ఉన్నాయి. 1980 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కొండలపై శ్రీరామగిరిక్షేత్రం, ముక్కెడుపోలమ్మ అమ్మవారి ఆలయాలు కొలువుతీరాయి. భామిని మండలంలో మనుమకొండలోని అక్షరబ్రహ్మ ఆలయం, పాలకొండ పట్టణంలోని ఒడిశలోని పూరి తరువాత అంతటి శిల్పకళాశోభితంగా నిర్మించిన జగన్నాధస్వామి ఆలయం, రాజులు దేవతగా పూజలందుకుంటున్న ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ ఆలయం. వీరఘట్టం మండలం కత్తులకవిటి సత్యసాయి సామాజిక సేవా క్షేత్రం. పాలకొండ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. అప్పటి చట్టసభలకు పాలవలస సంగంనాయుడు మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం పైడి నరసింహాఅప్పారావు, కెంబూరు సూర్యనారాయణలు ఎమ్మెల్యేలయ్యారు. 1967లో నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వు చేశారు. జమ్మాన జోజి, కొత్తపల్లి నర్సయ్య, కంబాల రాజరత్నం, గోనెపాటి శ్యామలరావు, తలే భద్రయ్య, పి.జె.అమృతకుమారి, కంబాల జోగులులు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. 2009 పునర్విభజనలో నియోజకవర్గంలోని సంతకవిటి రేగిడి మండలాలను తొలగించి కొత్తగా సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాలను కలిపి ఎస్టీలకు కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నిమ్మక సుగ్రీవులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
  • రెండు రాష్ట్రాల సరిహద్దు
పాలకొండ నియోజకవర్గం ఇటు విజయనగరం జిల్లా నుంచి, అటు ఒరిస్సా సరిహద్దు వరకు విస్తరించి మొత్తం 699.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. తూర్పున ఆముదాలవలస నియోజకవర్గం, పశ్చిమాన విజయనగరం జిల్లా, దక్షిణాన రాజాం నియోజకవర్గం, ఉత్తరాన పాతపట్నం నియోజకవర్గాల మధ్య ఏర్పడింది. 2011 లెక్కల ప్రకారం జనాభా 2,40,087. ఇందులో పురుషులు 1,14,614, స్త్రీలు 1,16,200 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 1,50,813. ఇందులో స్త్రీలు 78,357, పురుషులు 72,456 మంది ఉన్నారు. పాలకొండ 119.82 చ.కి.మీలు, వీరఘట్టం 137.48 చ.కి.మీ.లు, సీతంపేట 303.08 చ.కి.మీలు, భామిని 139.27 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.
  • బ్రిటిష్‌పాలన ఆనవాళ్లు
నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బ్రిటిష్‌పాలనా రూపాలు కనిపిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు వందేళ్ల భవనాలల్లోనే కొనసాగుతున్నాయి. సామంత రాజుల కోటలు గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. బొబ్బిలిరాజుల పాలన సాగినట్లు ఆధారాలు కనిపిస్తాయి. నియోజకవర్గ కేంద్రమైన పాలకొండ డివిజన్‌ కేంద్రంగా కొనసాగుతుంది.
  • వ్యవసాయరంగం
మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే పాలకొండ నియోజకవర్గం వ్యవసాయాధారితం. 25వేల గిరిజన కుటుంబాలు దశాబ్ధాలుగా అనాస, జీడి, పసుపు, అల్లం సాగు చేస్తున్నారు. ఏటా రూ.పది కోట్ల మేర విలువచేసే వాణిజ్యపంటలు ఏజెన్సీ నుంచే ఎగుమతి అవుతుంది. సీతంపేటలో పండే సింహాచలం రకం అనాసపనాస వీరఘట్టంలో విస్తారంగా పండే అరటి ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌, ఢిల్లీ రాష్ట్రాలకు నిత్యం లారీల్లో ఎగుమతి అవుతోంది. భామిని మండలంలో వాటర్‌ మిలన్‌గా పిలవబడే కర్భూజా పండ్లు సాగులో ఉంది.
  • వైద్యరంగం
పాలకొండలో వందపడకల ప్రాంతీయ ఆసుపత్రి ఉంది. దీంతోపాటు సీతంపేటలో 30 ఆసుపత్రి, పాలకొండ, వీరఘట్టం మండలాల్లో రెండేసి చొప్పున పీహెచ్‌సీలు, సీతంపేట, భామిని మండలాల్లో మూడేసి పీహెచ్‌సీలు ఉన్నాయి. 53 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. ప్రాంతీయ ఆసుపత్రికి సూరింటెండెంట్‌గా కృష్ణచంద్ర పనిచేస్తున్నారు.
  • విద్యారంగం
20 ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలు కొనసాగుతున్నాయి. పాలకొండ, సీతంపేట, వీరఘట్టంలలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మరో ఆరు ప్రైవేటు డిగ్రీకళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు నాలుగు ఉన్నాయి. గురుకుల కళాశాలలు రెండు, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు 13, గురుకుల పాఠశాలలు ఆరు, ప్రత్యామ్నాయ పాఠశాలలు 40 ఉన్నాయి. నియోజకవర్గంలో అక్ష్యరాస్యత 53.82 శాతం.
  • సాగు పరిస్థితి
నియోజకవర్గంలో ప్రధానంగా సాగునీటి కోసం చెరువులపైనే ఆధారపడుతున్నారు. తోటపల్లి ప్రాజెక్టు ఎడమకాలువ ద్వారా పాలకొండ, వీరఘట్టం మండలాల్లో 15వేల ఎకరాలు సాగు నీరందుతుంది. పాలకొండ మండలంలో జంపరకోట వద్ద 2,100 ఎకరాలకు ప్రాజెక్టు నిర్మాణదశలోనే ఉంది. భామిని మండలంలోని లోవగెడ్డ వద్ద రిజర్వాయరు నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా 450 చిన్నాపెద్దా సాగునీటి చెరువులు ఉన్నాయి. ఏటా చెరువుల కింద 50వేల ఎకారాలు, కాలువల కింద 15వేల ఎకరాలు సాగవుతుంది. ప్రాజెక్టులతో ఒక్క ఎకరం కూడా సాగు సాగడంలేదు.
  • పర్యాటకం
ఏజెన్సీ ప్రాంతంతో కూడుకున్న నియోజకవర్గం పర్యాటకంగా ఆకట్టుకొంటోంది. విశాలమైన అటవీప్రాంతం, వంపులు తిరిగే సెలయేళ్లు, అబ్బురపరిచే లోయలు, ఆహ్లాదం కలిగించే ప్రాంతాలు సీతంపేట మండలంలో కనువిందు చేస్తాయి. సీతంపేట నుంచి దోనుబాయి వరకు ఉన్న రహదారి వింత అనుభూతి కలుగుతుంది. పాలకొండ నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఆర్టీసీ సదుపాయం ఉంది.
  • ఆధ్యాత్మికం
బొబ్బిలి రాజుల ఆరాధ్యదేవత పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం ఉత్తరాంధ్రకే ప్రసిద్ధి. జిల్లాలోనే అత్యధిక ఆదాయాన్నిచ్చే ఆలయాల్లో ఇది రెండవది. ప్రతి ఏటా దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులుపాటు వైభవంగా జరుగుతాయి. 600 ఏళ్ల కిందట నిర్మించిన జగన్నాధస్వామి ఆలయం పాలకొండలో ఉంది. పూరీలో ఉన్న ఆలయ నమూనాలో నిర్మించారు. భామిని మండలం మనుమకొండలో అక్షరబహ్మ ఆలయం ఉంది. అక్షరాలనే దైవంగా ఇక్కడి గిరిజనులు పూజిస్తారు. ఇందుకోసం ప్రత్యేక పర్వదినాలు నిర్వహిస్తారు.
Palakonda or Palkonda is a town, Revenue Division and a mandal in the Srikakulam district in the state of Andhra Pradesh in India. palakonda Assembly Contituency was reserved for SC's till 2004 election and it is reserved for ST's for 2009 election.
-->
2009 Election Palakonda Assembly Constituency(ST) : 2009-Incubent – Contesting Candidates
Party
Name of Contesting M.LA. candidate
Total votes
Votes polled
Votes Secured
Winner
Mejority
INC
Nimmaka Sugrivulu
TDP
Nimmaka Gopala rao (Jaathapu st)
PRP
B.Kalavati (jaathapu –st)

  • Mandals , Population & voters :2004

  • Mandal Name
    Population
    SC’s
    ST’s
    Votres
    Male Voters
    Female Voters
    Palakonda
    73592
    10637
    2997
    Seethampeta
    52282
    1879
    45741
    Bhamini
    41058
    7495
    8178
    Veeraghattam
    63882
    12196
    4224
    Total
    230814
    32207
    61140
    120726

    -->
    Palakonda Assembly Constituency MLA’s details
    Year
    Winner
    Party
    Runner
    Party
    Total Votes
    Polled Votes
    Winner Votes
    Runner Vontes
    Mejority
    2004
    Kambala Jogulu
    TDP
    Tompala RajaBabu
    INC
    120,726
    73030
    42,327
    30,703
    11,624
    1999
    Amrutha KumariP.J.
    INC
    1994
    Tale Bhadrayya
    1989
    Amrutha KumariP.J.
    INC
    1985
    Tale Bhadrayya
    TDP
    1983
    Gonipati Syamala Rao
    1978
    Kambala Rajaratnam
    1951
    Palavalasa Sangam Naidu
    Palakonda Assembly Constituency Voters Caste Details
    Kapu
    /Telaga
    /Ontari
    Velama
    Kalinga
    SC
    Besta
    /Palli
    /Gandla
    Yadava
    /Golla
    Reddi
    /Kompara
    ST
    Vysya
    Balija
    Srisaina
    /chegidi
    Oddera
    /Oddara
    Rajaka
    /Chakali
    Devanga
    Others
    • =====================================================
    Visit my website --> Dr.Seshagirirao-MBBS

    No comments:

    Post a Comment