Tuesday, September 13, 2011

రాజాం శాసనసభ నియోజకవర్గం 2009 , Rajam Assembly Constituency 2009


మండలాలు:
  • 4 (రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర)
  • * నగరపంచాయతీలు: 1 (రాజాం)
  • * పంచాయతీలు: 120
పంచాయతీల వివరాలు:
  • * రాజాం: 20
  • * రేగిడి : 39
  • * వంగర: 27
  • * సంతకవిటి: 34
నియోజకవర్గానికి హద్దులు
  • * రాజాం నియోజకవర్గానికి తూర్పులో జి.సిగడాం, బూర్జ, పొందూరు మండలాలు ఉన్నాయి. ఉత్తరలో పాలకొండ, వీరఘట్టం మండలాలు, దక్షణంలో జి.సిగడాం, గరివిడి
  • మండలాలు, పడమరలో విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలాలు హద్దులుగా ఉన్నాయి
రాజాం నియోజకవర్గం విశిష్టత
  • రాజాం నియోజకవర్గానికి ఎన్నో విశిష్టతలున్నాయి. నాగావళి, సువర్ణముఖి, వేగవతి నదులు కలిసే చోట త్రివేణి సంగమం అంటారు. కాశీ తరువాత అత్యంత పుణ్యమైన క్షేత్రంగా ప్రసిద్ధి. సమీపంలోని సంగమేశ్వర ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. మరణించినవారి అస్తికలను మూడు నదులు కలిపే చోట నిమజ్జనం చేయటం సంప్రదాయంగా వస్తోంది. మడ్డువలస ప్రాజెక్టు రాష్ట్రంలోనే జీవ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడ వేగవతి, సువర్ణముఖి నదుల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో దీనికి ఈ ప్రత్యేకత వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గ్రంధి మల్లిఖార్జునరావు రాజాం పట్టణానికి చెందిన వారు. రాజాం ప్రాంతం నుంచి జి.ఎం.ఆర్‌.గ్రూప్‌ అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. జాతీయ ఎన్నికల అధికారిగా అత్యంత గుర్తింపు పొందిన కె.జె.రావుది రేగిడి మండలం కె.ఎం.వలస గ్రామం.
  • రాష్ట్రంలో గత ఆరేళ్లుగా పాలకవర్గం లేని నగరపంచాయతీగా రాజాం గుర్తింపు పొందింది. మున్సిపాల్టీ ప్రారంభం నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోనే నడుస్తోంది. బొబ్బిలి రాజుల సమీప బంధువు తాండ్ర పాపారాయుడు రాజాంలోనే నివాసం ఉండేవారు. బొబ్బిలి సంస్థానాధీసుల ప్రధాన పరిపాలన కేంద్రం రాజాంగానే పరిగణించేవారు. ఠాణా కూడా ఇక్కడే ఉండేది. కాలక్రమంలో ఇది తహశిల్దార్‌ కార్యాలయంగా మారింది. ఠాణా పేరుతో ఠాణావీధి ఇప్పటికీ ఉంది. నియోజకవర్గ రాజకీయ
ముఖచిత్రం
  • నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గతంలో ఉణుకూరుగా ఉన్న నియోజకవర్గం పేరు రాజాంతో ఆవిర్భవించింది. బలిజిపేట మండలం వేరుపడి సంతకవిటి మండలం కొత్తగా చేరింది. పార్వతీపురం లోక్‌సభ స్థానం పరిధి నుంచి విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోకి చేరింది. రాజాం నియోజకవర్గం పేరుతో జరిగిన మొదటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కోండ్రు మురళీమోహన్‌ (కాంగ్రెస్‌), లోక్‌సభ సభ్యురాలిగా బొత్స ఝాన్సీలక్ష్మి( కాంగ్రెస్‌) రికార్డు స్ధాయి మెజారిటీతో గెలుపొందారు.
Rajam assembly constituency is newly formed for 2009 elections . and it is reserved for SC catagory .
  • 2009 Election Rajam Assembly Constituency(SC) : 2009-Incubent – Contesting Candidates
    Party
    Name of Contesting M.LA candidate
    Total votes
    Votes polled
    Votes Secured
    Winner
    Mejority
    INC
    Kondru Murali Mohan
    1,84,729
    61,542
    INC
    26,984.
    TDP
    Kavali Prathiba bharti
    ,,
    34,558.
    PRP
    Kambala Jogulu
    ,,
    27,829.
    BJP
    Paka Rajarao
    ,,
    4,233.
    LS
    Dukka Adinaraya
    ,,
    1,622
Mandals , Population & voters :
Mandal Name
Population
SC’s
ST’s
Rajam
81693
9497
1041
Santha Kaviti
66893
7052
132
Regidi Amadalavalasa
68422
7673
578
Vangara
47879
7081
1248
Total
264867
31303
2998
  • ===============================================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment