స్థానిక స్వపరిపాలనలో మహిళలదే హవా. మొత్తం సీట్లలో 50 శాతం రిజర్వేషన్ ఈసారి జరిగే ఎన్నికల నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ ముఖచిత్రంలో మగువలకు కీలక స్థానం దక్కనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల రిజర్వేషన్ మాటెలా ఉన్నా మొత్తం స్థానాల్లో సగభాగం మహిళలకే కేటాయించనున్నారు. అతి త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నందున.. జిల్లాలోని పరిస్థితిని పరిశీలిస్తే...
* జిల్లాలోని మొత్తం పంచాయతీలు 1,107.
* 33 శాతం రిజర్వేషన్ల ప్రకారం గత పాలకవర్గాల్లో మహిళలు సర్పంచులుగా ఉన్న పంచాయతీలు 367
* 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తే మహిళలకు దక్కే పంచాయతీలు: 556
* 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు 73, ఎస్సీలకు 101, బీసీలకు 621 కేటాయించారు.
* 2006లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసినందున ఎస్టీ మహిళలు 22 చోట్ల, ఎస్సీ మహిళలు 32 చోట్ల, బీసీ మహిళలు 207 చోట్ల, ఇతర స్థానాల్లో 106 చోట్ల సర్పంచి పదవులను దక్కించుకున్నారు. అంటే మొత్తం 367 మంది.
* 2009 ఆగస్టు 27న కేంద్రం ఆర్టికల్ 243 (డి)ని అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో 2011లో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
* కులాల వారీగా రిజర్వేషన్ల మాటెలా ఉన్నా ఎన్నికలు జరగనున్న స్థానాల్లో సగభాగం మహిళలే పీఠమెక్కనున్నారు. ఈ లెక్కన 1,101 పంచాయతీల్లో 556 మంది మహిళా సర్పంచులు ఎన్నికవనున్నారు. గతంతో పోల్చుకుంటే అదనంగా 189 సర్పంచు పదవులు మహిళకు దక్కుతాయి.
* ఎస్టీ మహిళలకు దక్కే సర్పంచు స్థానాలు 22 నుంచి 37కు పెరుగుతాయి. ఎస్సీ మహిళలకు 32 నుంచి 51కి, బీసీ మహిళలకు 207 నుంచి 309కి, రిజర్వేషన్‌లేని మహిళలకు 106 నుంచి 155కు సర్పంచి పదవులు దక్కనున్నాయి.
* పంచాయతీల్లోని మొత్తం వార్డులు 10,460. ఇందులో ఎస్టీలకు 731, ఎస్సీలకు 957, బీసీలకు 5,726 కేటాయించారు.
* అప్పటి మహిళా రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీ మహిళకు 222, ఎస్సీ మహిళలకు 195, బీసీ మహిళలకు 1,933, రిజర్వేషన్‌లేనివారికి 1,010 వార్డులు దక్కాయి. 2006 ఎన్నికల్లో మొత్తం 3,360 మంది మహిళలు పంచాయతీ కార్యవర్గాల్లో వార్డు సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు.
* 50 శాతం రిజర్వేషన్ వల్ల వార్డుల్లో మహిళల వాటా 5,230కి పెరగనుంది. అంటే అదనంగా 1,870 వార్డులు మహిళల చేతుల్లోకి వెళ్లనున్నాయి.
* వర్గాలవారీగా పరిశీలిస్తే.. ఎస్టీ మహిళలకు వార్డులు 222 నుంచి 366కు, ఎస్సీ మహిళలకు 195 నుంచి 478కు, బీసీ మహిళలకు 1,933 నుంచి 2,863కు, రిజర్వేషన్ లేని మహిళలకు 1,010 నుంచి 1,525కు పెరగనున్నాయి.
* జిల్లాలోని 38 జడ్పీటీసీ స్థానాలకుగాను గత పాలకవర్గంలో మహిళల వాటా 13. ఈసారి ఈ సంఖ్య 19కి పెరగనుంది.
* మండలాధ్యక్ష స్థానాల్లోనూ 50 శాతం రిజర్వేషన్ అమలవుతుంది.
* గతంలో జిల్లాలో 648 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను 214 మంది మహిళలున్నారు. 50 శాతం రిజర్వేషన్ వల్ల వీరి సంఖ్య 324కు పెరగనుంది.
- ============================
ReplyDeleteMy web page - buy facebook likes trial
Hеllo Therе. I founԁ уοuг ѕite ωith а bizarгe sеarсh
ReplyDeleteterm, how ѵегy lucky. Тhat is а veгу ωell ωгitten
article. I will be surе to bοokmaгκ it and гeturn tо read extгa οf your
helpful info. Thаnk уou foг the post.
I ωill definitelу return.
Alsо viѕit my blοg ... long term loans no guarantor