* జిల్లాలోని ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలు: 1095,
* ఏకగ్రీవం: 221,
* పాలకొండ డివిజన్‌లో అత్యధికంగా 93 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టెక్కలి డివిజన్లో 78, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో 50 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు.
* పాలకొండ డివిజన్‌లోని రాజాం, శ్రీకాకుళం డివిజన్‌లోని లావేరు మండలాల్లో ఒక్క సర్పంచీ ఏకగ్రీవం కాలేదు.
* అత్యధికంగా పాతపట్నం మండలంలో 17 మంది, నందిగాంలో 12 మంది, రేగిడిలో 10 మంది, సంతకవిటిలో తొమ్మిదిమంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు.
* మెళియాపుట్టి, బూర్జ, పోలాకి, సారవకోట, సోంపేట, కంచిలి, వి.కొత్తూరు మండలాల్లో ఎనిమిదేసి చొప్పున సర్పంచులు ఏకగ్రీవమయ్యారు.
ఏకగ్రీవ సర్పంచులు : 221,
మహిళలు: 134 (60.63 శాతం),
పురుషులు: 87 (39.36 శాతం),
విద్యార్హత ఇలా...
నిరక్షరాస్యులు: 31 (14.02 శాతం),
పదో తరగతిలోపు: 131 (59.27 శాతం),
ఇంటరు: 29 (13.12 శాతం),
డిగ్రీ: 25 (11.13 శాతం),
డిగ్రీ ఆపై: 05 (2.26 శాతం),
అత్తెసరి చదువులే
ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నికైన వారిలో చాలా మందివి అత్తెసరు చదువులే. ఏకంగా 31 మంది నిరక్షరాస్యులున్నారు. ఇందులో రిజర్వు పంచాయతీల నుంచి ఎన్నికైనవారే ఎక్కువ. పదోతరగతిలోపు చదివిన వారు 131 మంది (59.27 శాతం) ఉన్నారు. డిగ్రీ పైబడి చదివిన వారు కేవలం అయిదుగురే ఉన్నారు. వీరిలో ఒకరు న్యాయవాది. స్వయంశక్తి సంఘాల ప్రతినిధి, డీలరు కూడా ఏకగ్రీవ పంచాయతీల జాబితాలో చోటు సంపాదించారు.
సర్పంచుల వయసులవారీగా ఇలా...
21 నుంచి 30 ఏళ్లమధ్య: 15 (6.78 శాతం) మంది
31 నుంచి 40 ఏళ్లమధ్య : 86 (38.91 శాతం) మంది
41 నుంచి 55 ఏళ్ల మధ్య : 72 (32.57 శాతం) మంది
55పైబడి: 48 (21.71 శాతం) మంది
యువత వెనక్కి
* ఏకగ్రీవ సర్పంచుల్లో యువత పాత్ర తగ్గింది. 30 ఏళ్లలోపు వయస్సున్న వారు కేవలం 6.78 శాతం మందే ఎన్నికయ్యారు. 31 -40 ఏళ్ల లోపు వయస్సున్న వారు 38.91 శాతం మాత్రమే ఎన్నికయ్యారు.
వృత్తులవారీగా..
గృహిణిలు: 123 (55.65 శాతం)
వ్యవసాయం: 74 (33.48 శాతం)
వ్యవసాయ కూలీలు: 05 (2.26 శాతం)
వ్యాపారులు: 11 (4.97 శాతం)
ఇతరులు: 08 (3.61 శాతం)
- ========================
No comments:
Post a Comment