Thursday, June 13, 2013

Srikakulam Panchayat electionsReservations,పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్లు 2013

  •  

  •  
పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్లు 2013 :

జిల్లాలో మొత్తము  పంచాయతీలు: 1099.
జిల్లాలోఎన్నికలు జరుగుతున్న  పంచాయతీలు: 1095.
  • షెడ్యూలు ఏరియా పంచాయతీలు: 16--ఇందులో పురుషులు:08--మహిళలు: 08
  • ఎస్టీలకు కేటాయించిన పంచాయతీలు: 45--ఇందులో మహిళలు: 23--పురుషులు: 22
  • ఎస్సీలకు కేటాయించిన పంచాయతీలు :82--ఇందులో మహిళలకు: 41--పురుషులకు: 41
  • బీసీలకు కేటాయించిన పంచాయతీలు: 474--ఇందులో మహిళలకు: 237--పురుషులకు: 237
  • జనరల్‌ స్థానాలు: 482--ఇందులో మహిళలు: 241--పురుషులు: 241

పంచాయతీ ఎన్నికల క్రతువులో అత్యంత కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రం యూనిట్‌గా స్థానిక రిజర్వేషన్లను జిల్లాల వారీగా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాకు సామాజిక వర్గాల వారీగా ఎన్ని స్థానాలు కేటాయించాలన్న దానిపై సందిగ్థత వీడిపోయింది. జిల్లాలో 1099 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించింది.

జులై నెలాఖరు నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాల వారీగా రిజర్వేషన్ల సంఖ్యను ప్రకటించింది. అత్యధికంగా బీసీలకు 474 స్థానాలు కేటాయించింది.

జనరల్‌ స్థానాలపైనే గురి
జిల్లా స్థాయిలో రిజర్వేషన్లు ఖరారు కావడంతో స్థానికంగా ఏ పంచాయతీ ఎవరికి రిజర్వు అవుతుందన్న దానిపై ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా జనరల్‌కు 482 స్థానాలు కేటాయించారు. వీటిపైనా అందరి దృష్టి నెలకొంది. ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళా రిజర్వేషన్లు సంఖ్య పెరిగింది. దీంతో జనరల్‌కు కేటాయించిన స్థానాలే కీలకంగా మారాయి. పంచాయతీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. వెంటనే రిజర్వేషన్లు ప్రకటిస్తే శాసనసభలో ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు జిల్లా కేంద్రానికి చేరడంతో పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది.

జనాభా శాతం కీలకం
ఈసారి రిజర్వేషన్‌ కేటాయింపులో కొత్త పద్ధతి తెరపైకి రానుంది. గతంలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేన్లు కేటాయించేవారు. ఈసారి రొటేషన్‌ పద్ధతి కొనసాగిస్తున్నా పంచాయతీ స్థాయిలో జనాభా శాతం కీలకంగా మారనుంది. అసలు మతలబంతా ఇక్కడే దాగుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పంచాయతీల రిజర్వేషన్లు మారిపోయే ప్రమాదం ఉంది. గతం కంటే ఈ ఏడాది 116 వార్డులు అదనంగా చేరాయి. దీంతో 10,542 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

శ్రీకాకుళం శివారు పంచాయతీలపై వీడిన సందిగ్ధం
శ్రీకాకుళం పట్టణానికి అనుసరించి ఉన్న చాపురం, కిల్లిపాలేం, పాతృనివలస, కాజీపేట పంచాయతీలను కూడా కలుపుకుని రిజర్వేషన్లు ఖరారు చేసారు. ఈ పంచాయతీలు శ్రీకాకుళం పురపాలక సంఘంలో విలీనంపై ఉన్న అనుమానాలకు తెరపడింది. గతంలో పెద్దపాడుతో పాటు ఈ నాలుగు పంచాయతీలను కూడా శ్రీకాకుళం పురపాలక సంఘంలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్దపాడు మినహా మిగతా నాలుగుపంచాయతీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

మొత్తం మండలాలు: 38
* మొత్తం పంచాయతీలు: 1,099
* ఎన్నికలు జరగనున్నవి: 1,095
* ఎన్నికలకు దూరంగా ఉన్న పంచాయతీలు: 04
* ఎన్నికలు జరగనున్న వార్డులు: 10,450

ఈ ఏడాది(2013) మార్చి చివరినాటికి గుర్తించిన ఓటర్ల సంఖ్య 15,63,838. ఇందులో 7,78,492 మంది పురుషులు, 7,85,346 మంది మహిళలు. ఏప్రిల్‌ 1 నుంచి జులై 2 వరకు చేపట్టిన మార్పులు చేర్పులతో ఓటర్ల సంఖ్య కాస్త మారే అవకాశం ఉంది.

పెరిగిన ధరావతు
* సర్పంచి, వార్డు సభ్యుల ధరావతు సొమ్ము పెరిగింది.
సర్పంచి (జనరల్‌) రూ. 2 వేలు,
ఎస్టీ, ఎస్సీ, బీసీ సర్పంచి అభ్యర్థులు రూ. వెయ్యి, 
వార్డు అభ్యర్థి (జనరల్‌) రూ. 500,
ఎస్సీ, ఎస్టీ, బీసీ వార్డు అభ్యర్థులు రూ. 250 ధరవాతు కింద చెల్లించాల్సి ఉంటుంది.

* ఎన్నికల్లో వ్యయ పరిమితిని కూడా ఎన్నికల సంఘం పెంచింది. పదివేల జనాభా కంటే తక్కువున్న సర్పంచి అభ్యర్థులు రూ. 40 వేల వరకు, వార్డు అభ్యర్థులు రూ. 6 వేల వరకు ఖర్చు చేయొచ్చు. పదివేల జనాభా కంటే ఎక్కువున్న పంచాయతీల అభ్యర్థులు రూ. 80 వేల వరకు, వార్డు అభ్యర్థి రూ. 10 వేల వరకు ఖర్చు చేయవచ్చు.

ఏకగ్రీవాలపైనే దృష్టి
జిల్లావ్యాప్తంగా కొన్నిచోట్ల ఏకగ్రీవాల కోసం నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు (వార్డులతో సహా) ప్రభుత్వం రూ. 5 లక్షల నజరానా ఇస్తోంది.
  • ======================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment