పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీల జనాభా వివరాలను ఎట్టకేలకు అధికారులు ఖరారు చేశారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలు వెల్లడయిన విషయం విదితమే. ఇప్పటికే స్టేజ్-1, స్టేజ్-2, రూట్, జోనల్ అధికారులను నిర్ణయిస్తూ మండలాల వారీగా జాబితాలను నివేదించారు.
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస పురపాలకసంఘాలు, రాజాం, పాలకొండ నగర పంచాయతీలు మినహాయించి మండలాల వారీగా బీసీ జనాభా వివరాలను ప్రకటించారు. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 27,03,114. పట్టణాలను మినహాయించి మండలాల వారీగా జనాభా 15,27,972. దీని ప్రకారం బీసీల వాటా 65.87 శాతం. ఈ వివరాలను జిల్లా కేంద్రం నుంచి ఆయా మండల పరిషత్తులకు వెళ్లాయి.
ఎచ్చెర్లలో అత్యధిక బీసీలు
జిల్లాలో ఎచ్చెర్ల మండలంలో అత్యధిక మంది బీసీలున్నట్లు తేల్చారు. ఇక్కడ 62,876 మంది ఉన్నారు. 60,635 మందితో శ్రీకాకుళం రెండో స్థానంలో ఉంది. ఇతర వర్గాల జనాభాతో పోల్చి శాతాన్ని పరిశీలిస్తే ఇచ్ఛాపురం మండలంలో 94.54 శాతం మంది బీసీలున్నారు. ఆమదాలవలస మండలంలో 89.25 శాతం, వజ్రపుకొత్తూరులో 82.12 శాతం, జలుమూరులో 77.58 శాతం మంది బీసీలున్నట్లు గుర్తించారు.
- వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం
- ======================
No comments:
Post a Comment