జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.
- జనరల్: శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
- బీసీ మహిళ: ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.
- మొత్తం జనాబా = 39806,
- పురుషులు = 19718,
- స్ర్తీలు = 20088,
- పోలింగ్ తేదీ : 30-03-2014 .
- ఓటర్ల సంఖ్య = 29,085.
- పోలయినవి = 24095,
- పోలింగ్ శాతము : 82.84.
- ఆమదాలవలస మున్సిపాల్టీలో 23 వార్డులు ఉండగా ఎస్సీలకు 02, ఎస్టీలకు 01, బీసీలకు08, జనరల్‌కు 12 వార్డులు కేటాయించారు.
- Amadalavalasa municipality 2014 elections Results,ఆమదాలవలస మునిసిపాలిటీ 2014 ఎన్నికల ఫలితాలు.
ఆమదాలవలస పురపాలక సంఘంలో తెదేపా, వైకాపాలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. మొత్తం 23 వార్డులకుగాను వైకాపా 10, తెదేపా 8, కాంగ్రెస్ 3 గెలుచుకున్నాయి. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. అధ్యక్ష పదవి దక్కాలంటే 12 సభ్యులు అవసరం. దీంతో కాంగ్రెస్, స్వతంత్రులు కీలకంగా మారారు. వీరిని తమ వైపు తిప్పుకునేందుకు ఇరుపక్షాల నుంచీ తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ పురపాలక సంఘంలో శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు సభ్యుడు, శ్రీకాకుళం, ఆమదావలస శాసనసభ్యులు, ఎమ్మెల్సీ ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఓట్లు వేయనున్నారు. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నందున ఆ ఫలితాల తరువాత ఎవరి బలం ఎంత అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ తెదేపా ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా తెదేపా నాయకుడు విద్యాసాగర్ భార్య తమ్మినేని గీత బరిలో ఉన్నారు. ఆమెకు ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఏడుగురి మద్దతుతోపాటు కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థుల మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ మద్దతును కూడా జమకట్టుకుంటే 12 స్థానాలకు చేరుకుంటారు. పురపాలక సంఘం ఎన్నికల సంఘం సమయంలో తెదేపా - కాంగ్రెస్ మధ్య ఓ అవగాహన కుదిరినట్టు వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకురాలు బొడ్డేపల్లి సత్యవతి ఎలాంటి ప్రకటనా చేయలేదు. పరిస్థితిని బట్టి తమ అధినాయకత్వంతో మాట్లాడి అపుడు నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారామె. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పీరుకట్ల మద్దతు తమకే లభిస్తుందన్న ధీమాతో తెదేపా నాయకులున్నారు. 16న వెలువడనున్న సార్వత్రిక ఫలితాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే ఇక్కడ తెదేపాకు అంతా సానుకూలమవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు.
వైకాపా తరఫున ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి రమేష్‌కుమార్ భార్య అజంత కుమారి పోటీలో ఉన్నారు. 23వ వార్డుకు చెందిన బొడ్డేపల్లి ఏకాశమ్మ గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు బహిరంగంగా మద్దతు తెలిపారు. ఆమె ఈసారి కూడా వారికే మద్దతు ఇస్తే ఆ పార్టీకి 11 స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. మరో వైపు కాంగ్రెస్ నుంచి కూడా ఓ కౌన్సిలరు మద్దతు ఇస్తారన్న ధీమాతో వైకాపా నాయకులున్నారు. తద్వారా ఛైర్‌పర్సన్ పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సొంతమవుతుందని లెక్కలు వేస్తున్నారు. మరో వైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కూడా ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. పురపాలక సంఘంలో 14 స్థానాలతో ఛైర్‌పర్సన్ పదవిని దక్కించుకుంటామని ఆ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- ============================
No comments:
Post a Comment