Friday, April 18, 2014

Narasannapeta constituency election 2014,నరసన్నపేట నియోజకవర్గం ఎన్నికలు 2014



  •  
  •  
  •  
జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా మారిన నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న  ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు :

  • తెదేపా అభ్యర్థిగా-- బగ్గు రమణమూర్తి .
  • వైకాపా--ధర్మాన  కృష్ణదాసు.
  • కాంగ్రెస్‌ అభ్యర్థిగా-- డోల జగన్‌,
  •    జై సంక్యాంధ్ర :  శిమ్మ ఉషారాణి  ,
  •     ఆమ్‌ ఆద్మీ : పైడి రవికుమార్  ,
  •     బి.యస్.పి. : ముత్యం సూర్యం  ,
  •     లోక్ సత్త  :   ,
  •     ఇండిపెండెంట్ :ఈతకర్లపల్లి త్రివేశ్వరరావు   ,
  •     సి.పి.ఐ : లేరు ,
  •     సి.పి.ఎం : లేరు ,
గుర్తులకోష పై టేబుల్ ని చూడండి.

నలుగురు శానసభ్యులను అందించిన పోలాకి మండలం-- జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పలువురు నేతల్ని అందించింది పోలాకి మండలం..! ఈ మండలం నుంచి నలుగురు నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం విశేషం! వీళ్లల్లో కొందరు రాజకీయాల్లో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగినవారు కాగా.. మరికొందరు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చినవారు ఉన్నారు. పోలాకి మండలం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైల వారిలో ఇద్దరు మబుగాం గ్రామానికి చెందిన  ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు. ఇంకో ఇద్దరు ప్రియాగ్రహారం, డోల గ్రామాలకు
చెందిన వారు. మండల పరిధికి చెందిన మొదటి ఎమ్మెల్యేగా కన్నేపల్లి అప్పల నర్సింహ భుక్త హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ స్థానంలో ఈయన వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు. రెండో విడతలో డోల గ్రామానికి చెందిన డోల సీతారాములు నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మబుగాం గ్రామానికి చెందిన ధర్మాన సోదరులు ప్రసాదరావు, కృష్ణదాసు నరసన్నపేట, శ్రీకాకుళం శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2004 నియోజకవర్గాల పునర్విభజనలో పోలాకి మండలంలోని 15 పంచాయతీలు టెక్కలి నియోజకవర్గంలో కలిసిపోయాయి. దీంతో హరిశ్చంద్రపురం నియోజకవర్గం పూర్తిగా కనుమరుగైంది.

మొదటి నుంచి లెక్కిస్తే.. మొత్తం 13 సార్లు జరిగిన ఎన్నికల్లో.. 9మంది ఎమ్మెల్యేలు కాగా.. వారిలో నలుగురు పోలాకి మండలానికి చెందినవాళ్లే ఉండటం విశేషం! ప్రియాగ్రహారం గ్రామానికి చెందిన కన్నేపల్లి అప్పలనర్సింహ(కేఏఎన్‌) భుక్త 1972-76, 1976-83 సంవత్సరాల్లో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పని చేశారు. అంతకు ముందు ఆయన 1959-72 వరకు ప్రియాగ్రహారం సర్పంచిగా పని చేశారు. గ్రామ సర్పంచిగా పని చేసిన పెదనాన్న కామేశ్వర భుక్త స్ఫూర్తితోనే కేఏఎన్‌ భుక్త రాజకీయాల్లోకి వచ్చారు.

డోల గ్రామానికి చెందిన డోల సీతారాములు 1978-83 వరకు నరసన్నపేట నియోజకవర్గానికి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా, ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈయన 1960 ప్రాంతంలో సుమారు 5 ఏళ్లు గ్రామ సర్పంచిగా సేవలు అందించారు.

మబుగాం గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాదరావు 1989-1994 అనంతరం 1999-2003 మధ్య రెండు దఫాలు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభ్యుడు కాకముందు ఈయన గ్రామ సర్పంచిగా ఐదేళ్లు, పోలాకి మండలాధ్యక్షుడిగా రెండున్నరేళ్లు పని చేశారు. 2004లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గానికి వెళ్లగా.. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నరసన్నపేట నియోజకవర్గంలో పోటీ చేసి విజేతగా నిలిచారు. 2004 నుంచి కృష్ణదాస్‌ వరుసగా మూడుసార్లు(ఉపఎన్నికతో కలిపి) శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు.



సువిశాల వంశధార నదీతీరం వెంబడి ఆవరించి ఉన్న నరసన్నపేట నియోజకవర్గంలో వ్యవసాయ రంగం ప్రాధాన్యం కలిగి ఉంది. రాజకీయ, కళా రంగాలకు కూడా ఈ నియోజకవర్గం ప్రాధాన్యం ఇస్తుంది. జిల్లాలో ప్రాముఖ్యం కలిగిన నియోజకవర్గంగా పేరు పొందింది. మొదటి నుంచి ప్రతిపక్షానికి ప్రత్యేక ఉంది. 1952లో నగిరి కటకం నియోజకవర్గంగా రూపొందిన అనంతరం 1954లో నరసన్నపేట నియోజకవర్గంగా అవతరించింది. దాదాపు 25 ఏళ్ళ పాటు ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యమిచ్చిన ఈ నియోజకవర్గంలో 1979 తరువాత పదేళ్ళ అనంతరం 1989, 1999, 2004, 09లో కాంగ్రెస్‌ ప్రతినిధులకు స్థానం కల్పించింది. ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యంతో విభిన్న తీర్పునిస్తూ ప్రత్యేకతను చాటడం విశేషం.
  • నియోజకవర్గంలో లక్షా 41,904 ఎకరాల భౌగోళిక విస్తీర్ణం. ప్రధానంగా వరి వ్యవసాయం నియోజకవర్గ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 54 కిలోమీటర్ల పొడవునా మూడు మండలాలలో వంశధార నది ప్రవహించి లక్షా 1645 ఎకరాలలో పలు పంటలు పండుతున్నాయి. దాదాపు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు ఉన్నా, బస్సు సౌకర్యాలు మాత్రంలేవు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం జలుమూరు మండలంలో ఉంది. సారవకోట మండలం బుడితి కంచు పరిశ్రమకు ప్రసిద్ధి. సారవకోట చుప్పుల తయారి, సత్యవరం తప్పెటగుళ్ళు, గుండివిల్లిపేట, జడూరులో చెంచులు ప్రత్యేకతను చాటిచెబుతారు. వరి, చెరకు, అపరాలు పంటలు రైతులు పండిస్తారు. వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతులను రైతులు పాటిస్తారు. జిల్లాలో అత్యధికంగా నరసన్నపేట నియోజకవర్గంలో రైస్‌ మిల్లులున్నాయి. బంగారం, సిమెంట్‌, ఇనుము, ఇత్తడి వ్యాపారాలకు కూడా పెట్టింది పేరు. స్వాతంత్య్ర సముపార్జనకు కృషి చేసిన వారు కూడా నియోజకవర్గంలో ఉన్నారు. పొట్నూరు స్వామిబాబు, టంకాల శశిభూషణగుప్త తదితరులు నాలుగు మండలాల నుంచి 48మంది ఉన్నారు. పోలాకి మండలం ప్రియాగ్రహారంలో గేయకవి గరిమెళ్ళ సత్యనారాయణ, లుకలాం గ్రామానికి చెందిన సినీకళాకారుడు జె.వి.సోమయాజుల కూడా ఈ నియోజవర్గానికి చెందిన వారే.
ఇక జిల్లా స్థాయిలో పదవులుపొందిన వారిలో డోల సీతారాములు, శిమ్మ ప్రభాకరరావు, డి.సి.సి.బి. అధ్యక్షులుగాను, జిల్లా గ్రంధాలయ సంస్థకు అధ్యక్షులుగా అడపామోహనరావు, రాడ మోహనరావులు పని చేశారు. ఇలా నియోజకవర్గంలో ప్రముఖులు, ప్రాముఖ్యంతో భాసిల్లింది. రాజకీయంగా చైతన్యం కలిగిన ఈనియోజకవర్గంలో ప్రతి సారీ గెలుపు ఓటములపై ఉత్కంఠ ఉంటుంది. ఎవరు గెలిచినా భారీ మెజారిటీకి తావులేదు. అదేవిధంగా ఒకపర్యాయం విజయం సాధించిన వారికి తదుపరి చెక్‌ చెప్పడం ఆనవాయితీ, అయితే ఒకటి రెండు సందర్భాలలో మాత్రం వరుస విజయాలు నమోదు అయ్యాయి.

  •  =============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment