Sunday, April 20, 2014

Amadalavalasa Assembly constituency election 2014,ఆమదలవలస శాసనసభ నియోజకవర్గం ఎన్నికలు 2014

  •  







  •  ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గం ఎన్నికలు 2014
  •  
  •  
 2014 ఎన్నికలలో పోటీ అబ్యర్ధులు :

  •     కాంగ్రెస్ : బొడ్డేపల్లి సత్యవతి ,
  •     టి.డి.ఫి :    కూన రవికుమార్  ,
  •     వై.ఎస్.ఆర్ :  తమ్మినేని సీతారాం  ,
  •     జై సంక్యాంధ్ర :  పైడి సత్యప్రసాద్  ,
  •     ఆమ్‌ ఆద్మీ : బొడ్డేపల్లి శ్రీనివాసరావు  ,
  •     బి.యస్.పి. : దులపు పుణ్యావతి   ,
  •     లోక్ సత్త  :  తమ్మినేని అన్నం నాయుడు  ,
  •     ఇండిపెండెంట్ : పేడాడ అప్పాజీ శ్రీనివాస్  &  బాడాన శ్రీనివాసరావు  ,
  •     సి.పి.ఐ : లేరు ,
  •     సి.పి.ఎం : లేరు 
 

  • ఆమదాలవలస
మండలాలు : 4 (ఆమదాలవలస, పొందూరు,సరుబుజ్జిలి, బూర్జ).
పురపాలకసంఘం : 1 (ఆమదాలవలస).
పంచాయతీలు : 105.
విస్తీర్ణం : 395.44 చదరపు కిలోమీటర్లు.
జనాభా : 2,49,001.
ఓటర్లు : 1,62,430.
  • ప్రధాన నదులు
వంశధార, నాగావళి

  • ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు: 
సంగమేశ్వర ఆలయం, దంతపురికోట, పాండవుల మెట్ట, పొందూరు ఖాదీ పరిశ్రమ
సాగునీటి ప్రాజెక్టులు : వెన్నెలవలస రిజర్వాయరు, వయోడెక్టు ప్రాజెక్టు
రైల్వేస్టేషన్లు : 3 (ఆమదాలవలస, దూసి, పొందూరు)
రహదారుల పొడవు: 210 కిలోమీటర్లు

జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది రెండు నదులు... నాగావళి, వంశధార మధ్య ఉంది. వ్యవసాయానికి ఈ రెండు నదులే ఆధారం. నియోజకవర్గాల పునర్విభజనలో ఎల్‌.ఎన్‌.పేట మండలం పాతపట్నం నియోజకవర్గంలోకి చేరింది. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న పొందూరు మండలం కొత్తగా ఆమదాలవలస నియోజకవర్గంలో చేరింది. నియోజకవర్గానికి భౌగోళికంగా తూర్పు భాగాన వంశధార నది ఉంది. పడమరలో జి.సిగడాం మండలం, ఉత్తరాన ఎల్‌.ఎన్‌.పేట మండలం తూర్ప కనుములు, దక్షణాన శ్రీకాకుళం గ్రామీణ మండలాలున్నాయి.
  • ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు
ఆమదాలవలస మండలంలో జొన్నవలస వద్ద సంగమేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయ కొండపై జైన్‌, బౌద్ధ మతస్థులు నివాసం ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు. దన్నానపేట వద్ద పాండవుల మెట్ట ఉంది. ఇక్కడ కూడా పూర్వం వివిధ మతస్థులు నివాసం ఏర్పరచుకుని ఉండేవారని కథనం ప్రచారంలో ఉంది. సరుబుజ్జిలి మండలం రొట్టవలస ప్రాంతంలో అతి ప్రాచీనమైన దంతపురి కోట ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొందూరు ఖాదీ ఈ నియోజకవర్గంలోనే ఉంది.
1952లో ద్విసభ్య నియోజకవర్గంగా శ్రీకాకుళం ఉండేది. అప్పట్లో కృషికార్‌ లోక్‌పార్టీ నుంచి కిల్లి అప్పలనాయుడు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955 నగిరి కటకం నియోజకవర్గంగా ఏర్పడింది. మొదటిసారిగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పెద్దనాన్న తమ్మినేని పాపారావు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 1978లో ఆమదాలవలస నియోజకవర్గంగా ఏర్పడింది. మొదటి నుంచీ బొడ్డేపల్లి - తమ్మినేని కుటుంబాల మధ్య రాజకీయం నడుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి మామ బొడ్డేపల్లి రాజగోపాలరావు వరుసగా ఏడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. శాసనసభకు తమ్మినేని కుటుంబం నుంచి మూడుసార్లు తమ్మినేని పాపారావు ఎన్నిక కాగా అదే కుటుంబానికి చెందిన తమ్మినేని సీతారాం ఐదుసార్లు ఎన్నికయ్యారు. బొడ్డేపల్లి కుటుంబం నుంచి వరుసగా రెండుసార్లు బొడ్డేపల్లి సత్యవతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రూ. 122 కోట్ల వ్యయంతో వంశధార కుడి ప్రధాన కాల్వను నిర్మించారు. దీనిద్వారా వచ్చే నీటిని దిగువ ప్రాంతానికి అందించేందుకు సరుబుజ్జిలి మండలం వెన్నవలస వద్ద ఒక సాగునీటి రిజర్వాయరు నిర్మించారు. వంశధార కుడి ప్రధాన కాల్వ ద్వారా వచ్చి నీరు దిగువ ప్రాంతానికి వెళ్లేందుకు ఆమదాలవలస వద్ద రైల్వేట్రాక్‌ ఆటంకం ఏర్పాడటంతో ఎటువంటి సాంకేతిక పనిముట్లతో పని లేకుండా సాగునీరందించేందకు దేశంలో పేరుగాంచిన వయోడెక్టు ప్రాజెక్టు నిర్మించారు.
జిల్లా కేంద్రానికి అతిదగ్గరలో ఉన్న ఆమదాలవలస పట్టణంలో ప్రధాన రైల్వేస్టేషన్‌ ఉంది. ప్రధాన రైళ్లన్నీ ఇక్కడ ఆగుతాయి.
* వ్యవసాయరంగంలో కొత్త పరిశోధనలకు ఆమదాలవలసలో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావటంతో పొందూరు మండలంలో ప్రత్తి, వేరుశెనగ, వరి వంటి పంటలు పండిస్తుండగా ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది.

  • ================================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment