Pathapatnam Assembly constituency election 2014,పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కికలు 2014 పోటీ లో ఉన్న అబ్యర్ధులు :
కాంగ్రెస్ : పాలవలస కరుణాకరరావు ,
టి.డి.ఫి : శతృచర్ల విజయరామరాజు ,
వై.ఎస్.ఆర్ : కలమట వెంకటరమణమూర్తి ,
జై సంక్యాంధ్ర : కొమరాపు తిరుపతి రావు ,
ఆమ్ ఆద్మీ : లేరు ,
బి.యస్.పి. : బొడ్డేపల్లి కృష్ణారావు ,
లోక్ సత్త : ముంజి మురళీకృష్ణ ,
ఇండిపెండెంట్ : లేరు,
సి.పి.ఐ :లేరు,
సి.పి.ఎం :లేరు,
సమాచారము : నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, ఎల్.ఎన్.పేట మండలాల్లోని 140 పంచాయతీలతో కలిసి పాతపట్నం నియోజకవర్గం ఏర్పడింది. పునర్విభజన అనంతరం తొలిసారిగా 2009వ సంవత్సరంలో ఇక్కడ సాధారణ ఎన్నికలు జరిగాయి. 2009కు పూర్వం కొత్తూరు మండలంలోని 16 పంచాయతీలు, సారవకోట మండలంలోని 10 పంచాయతీలు, పాతపట్నం మండలంలోని 21 పంచాయతీలు, హిరమండలం, మెళియాపుట్టి మండలాల్లోని అన్ని పంచాయతీలతో కలిసి ఈ నియోజకవర్గం ఉండేది. ప్రస్తుతం ఆమదాలవలస, టెక్కలి, పలాస, పాలకొండ నియోజకవర్గాలు పాతపట్నం నియోజకవర్గానికి సరిహద్దు నియోజకవర్గాలుగా ఉన్నాయి.
- పర్యాటక ప్రదేశాలు
* మెళియాపుట్టిలోని వేణుగోపాలస్వామి ఆలయం
* పాతపట్నంలోని షిరిడిగిరి, నీలమణిదుర్గ అమ్మవారి ఆలయం
* ఇలా చేరుకోవాలి: శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి చేరుకొనేందుకు బస్సులు ఉంటాయి.
- భౌగోళిక స్వరూపం
* పరిధిలోగల మండలాలు: పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, ఎల్.ఎన్.పేట, కొత్తూరు
* సరిహద్దు నియోజకవర్గాలు: ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పాలకొండ, పలాస
* మైదాన ప్రాంతం విస్తీర్ణం: 70%
* ఏజెన్సీ ప్రాంతం విస్తీర్ణం: 30%
* ప్రవహిస్తున్న నదులు: వంశధార, మహేంద్రతనయ
* పర్వత శ్రేణులు: తూర్పు కనుమల్లో ఎత్త్తెన మహేంద్రగిరి పర్వత శ్రేణులు మెళియాపుట్టి మండలాన్ని తాకుతున్నాయి
* అటవీ విస్తీర్ణం: 33782 ఎకరాలు
* ముఖ్య అటవీ ఉత్పత్తులు: చింత, ఉసిరి, కొండ చీపుర్లు, జనుములు, కందులు, తేనె తదితరులు
- పరిపాలనా వ్యవస్థ
* గ్రామాల సంఖ్య: 250
* చెప్పుకోదగ్గ పెద్ద గ్రామాలు: కొరసవాడ, సీది, తెంబూరు, కాగువాడ, హిరమండలం, తులగాం, కొత్తూరు, నివగాం, పారాపురం, చాపర, గొప్పిలి, మెళియాపుట్టి, ఎల్.ఎన్.పేట, పాతపట్నం
- జనాభా
* రైతులు: 70,000
* ఉద్యోగులు: 15,000
* వ్యాపారులు: 20,000
* ఇతరత్రా: 70,000
- అక్షరాస్యత
* వారి శాతం: 44.2%
* స్త్రీ అక్షరాస్యులు/శాతం:48,529/45.2%
* పురుష అక్షరాస్యులు/శాతం: 60,590/55.2%
ఓటర్ల గణాంకాలు
* నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య: 1,68,219
* జనాభాలో ఓటర్ల శాతం: 64.59%
* పురుష ఓటర్ల సంఖ్య: 82,000
* స్త్రీ ఓటర్ల సంఖ్య: 82,219
* పురుష ఓటర్ల శాతం: 63.12%
* స్త్రీ ఓటర్ల శాతం: 66.05%
- విద్యారంగం
* ప్రాథమికోన్నత పాఠశాలలు: 70
* ఉన్నత కళాశాలలు (స్వతంత్ర): 29
* జూనియర్ కళాశాలలు : 5
* ఆశ్రమ పాఠశాలలు: 15
* మొత్తం డిగ్రీ కళాశాలలు ప్రైవేటు : 6
* నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నంకు విద్యల నిలయంగా ప్రత్యేక పేరు ఉంది. దాదాపు 20కు పైగా ప్రైవేటు కళాశాలలు, 3 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, 2 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
* అన్ని మండల కేంద్రాలలోను ప్రైవేటు రంగంలో విద్యా సంస్థలు ఉన్నాయి.
వైద్య రంగం-:
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: 10
* కమ్యూనిటీ ఆసుపత్రులు: 1
* ప్రైవేటు ఆసుపత్రులు: 4
* హోమియో ఆసుపత్రులు: 3
* ఆయుర్వేద ఆసుపత్రుల: 2
* ఆరోగ్య ఉపకేంద్రాలు: 58
* నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నంలో 50 పడకల ఆసుపత్రి ఉంది. నాలుగు మండలాల ప్రజలకు ఇదే ఆధారం.
- వ్యవసాయం
* సాగు యోగ్యమైనది: 33,046 హెక్టార్లు
* సాగు యోగ్యంకానిది: 8806 హె.
* పల్లం: 26,044
* మెట్టు: 7002
సాగునీటి రంగం
* గొట్టాబ్యారేజి: వంశధార 2232.74 ఎకరాల ఆయకట్టు
చెరువులు
* అసర్ల సాగరం: తెంబూరు, 800 ఎకరాలు
* పెద్దచెరువు: చాకిపల్లి, 500
* బగడచెరవు: చాపర, 600 ఎకరాలు
* పెద్దచెరువు: చాపర, 600 ఎకరాలు
* పెద్దపద్మాపురం: పెద్దనాయుడు చెరువు, 600 ఎకరాలు
ఎత్తిపోతల పథకాలు
* రుగడ ఎత్తిపోతల పథకం దశాబ్ధాలుగా నిర్మాణంలోనే ఉంది
* పాతపట్నం, పెద్దపద్మాపురం ఎత్తిపోతల పథకాలు మూలకు చేరాయి
* మాకనాపల్లి ఎత్తిపోతల పథకం పనిచేస్తుంది. దీని ఆయకట్టు 800 ఎకరాలు
రహదారులు
* నియోజకవర్గంలో జాతీయ రహదారుల పొడవు: లేవు
* రాష్ట్రీయ రహదారులు:లేవు
* పంచాయతీరాజ్ రహదారులు: 350 కి.మీ.
* ఆర్. అండ్ బి. రహదారులు 100 కి.మీ.
- Courtesy with : Eenadu , Saakshi , Andhrajyoti news papers & Election commision website.
- =================================
No comments:
Post a Comment