2014 ఎన్నికలలో పోటీ అబ్యర్ధులు :
- కాంగ్రెస్ : కిలారి రవికిరణ్ ,
- టి.డి.ఫి :కళా వెంకటరావు ,
- వై.ఎస్.ఆర్ :గొర్లె కిరణ్ కుమార్ ,
- జై సంక్యాంధ్ర : వండాన వెంకటరావు ,
- ఆమ్ ఆద్మీ : ధనలకోటి రమణ ,
- బి.యస్.పి. :గుదివాడ కుప్పయ్య ,
- లోక్ సత్త : పైడి అమ్మినాయుడు ,
- ఇండిపెండెంట్ : గొర్లె గౌరినాయుడు ,
*ఎచ్చెర్ల సమాచారము :
ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం , Etcherla Assembly constituency రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 2009 ఎన్నికల ముందు రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల మండలాలు ఉండేవి. అంతవరకు ఎస్సీ రిజర్వ్‌డుగా ఉన్న నియోజకవర్గానికి పునర్విభజన తరువాత అదనంగా జి.సిగడాం మండలం కలసింది. ప్రస్తుతం జనరల్ అభ్యర్ధులకు కేటాయించారు. నియోజకవర్గం పరిధిలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం, మహిళా శిక్షణా కేంద్రాలు, అంతర్జాతీయంగా పేరుగాంచిన పరిశ్రమలు, విశాలమైన సముద్రతీరం, జాతీయ రహదారి, మూడు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో పారిశ్రామికవాడలు ఉన్నాయి. పారిశ్రామిక వాణిజ్యమండలి కూడా ఏర్పాటవుతోంది. నియోజకవర్గంలో సుమారు 15 వేల హెక్టార్లులో వరి పంట వేస్తారు.
*విశిష్టత
నియోజకవర్గం పరిధిలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం, మహిళా శిక్షణా కేంద్రాలు, అంతర్జాతీయంగా పేరుగాంచిన పరిశ్రమలు, విశాలమైన సముద్రతీరం, జాతీయ రహదారి, మూడు ఇంజినీరింగ్ కళాశాలలు నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో పారిశ్రామికవాడలు ఉన్నాయి. ఇక పారిశ్రామిక వాణిజ్యమండలి కూడా ఏర్పాటవుతోంది.
*వ్యవసాయం:
నియోజకవర్గంలో ప్రధనంగా వరి పండుతుంది. సుమారు 15 వేల హెక్టార్లులో వరి పంట వేస్తారు. 8 వేల హెక్టార్లలో వేరుశెనగ పండిస్తారు. ఆ తరువాత పెసర, మినుము, మొక్కజొన్న, రాగులు, కంది, చెరుకు పంటలు వేస్తారు. ఇక మామిడి, జీడిమామిడి, సరుగుడు, నీలగిరి, కొబ్బరి, బొప్పాయి వంటి తోటలు అధికంగా ఉన్నాయి. జి.సిగడాం మండలంలో కొంతమేర మడ్డువలస నీరు అందుతుంది. ఎచ్చెర్ల మండలంలో 12 వేల హెక్టార్లు నారాయణపురం కుడికాలువ ద్వారా నీరు అందుతుంది. మిగతా భూములన్నీ వర్షాధారంపైనే పండుతాయి. ప్రస్తుతం రణస్థలం, లావేరు మండలాల్లో 21 వేల హెక్టార్లుకు సాగునీరందించేందుక తోటపల్లి కాలువ పనులు జరుగుతున్నాయి.
- రియల్‌ఎస్టేట్లు:
రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో రియల్‌ఎస్టేట్లు ఉన్నాయి. ఇక్కడ భూముల విలువ చాలా ఎక్కువ. జాతీయ రహదారి పక్కన సెంటు ధర రూ.50 వేల వరకు ఉంది. ప్రధానంగా పరిశ్రమలు ఉండటం వలన భూముల ధరలు పెరిగాయి. ఇక్కడ ఎక్కువ భూములను డాక్టర్లు, పోలీసులు అధికార్లు ఎక్కువుగా ఉన్నారు. పలువురు పరిశ్రమల యజమానులు భవిష్యత్తులో పరిశ్రమల ఏర్పాటుకు అసవరమైన స్థలాలను కొనుగోలు చేసి ఉంచుకున్నారు.
- దేవాలయాలు
ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.
* జనాభా:
రణస్థలం: 76,771, లావేరు: 68,716, ఎచ్చెర్ల: 82,416, జి.సిగడాం: 55,679.
* పంచాయతీలు:
రణస్థలం: 30, లావేరు: 26, ఎచ్చెర్ల: 28, జి.సిగడాం: 31.
* బ్యాంకులు: రణస్థలం: 8, లావేరు: 3, ఎచ్చెర్ల: 3, జి.సిగడాం:5
* టెలిఫోన్ ఎక్సేంజిలు: రణస్థలం: 3, లావేరు: 2, ఎచ్చెర్ల: 1, జి.సిగడాం: 2
* పాఠశాలలు: రణస్థలం: 125, లావేరు 89, ఎచ్చెర్ల: 112, జి.సిగడాం: 66
* అంగన్‌వాడీలు: రణస్థలం: 96, లావేరు 91, ఎచ్చెర్ల: 98, జి.సిగడాం: 66
* విద్యుత్తు ఉపకేంద్రాలు: రణస్థలం: 4, లావేరు: 3, ఎచ్చెర్ల: 2, జి.సిగడాం: 1
* సర్కిల్ కార్యాలయం: జె.ఆర్.పురం(రణస్థలం మండలం)
* పీహెచ్‌సీలు: రణస్థలం: 1, లావేరు: 2, ఎచ్చెర్ల: 3, జి.సిగడాం: 1
* సామాజిక ఆసుపత్రి: రణస్థలం: 1
* జూనియర్ (ప్రభుత్వ)కళాశాలలు: రణస్థలం1, లావేరు: 1, ఎచ్చెర్ల: 2, జి.సిగడాం: ప్రైవేటు-1
* విశ్వవిద్యాలయం: ఎచ్చెర్ల: అంబేద్కర్ విశ్వవిద్యాలయం-0894281422
* వసతిగృహాలు: రణస్థలం: 8, లావేరు: 6, ఎచ్చెర్ల: 3, జి.సిగడాం: 4
* సాగునీటి పారుదల ప్రాజెక్టులు: రణస్థలం: అర్తమూరు ఆనకట్ట, ఎచ్చెర్ల: నారాయణపురంకుడికాలువ
* జాతీయ రహదారి: రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో 35 కి.మీ
* సముద్రతీరం: రణస్థలం, ఎచ్చెర్ల మండలాలు: 30 కి.మీ
* సాధారణ వర్షపాతం: నాలుగు మండలాల్లో సగటున 980.6 మి.మీ
* పంచాయతీలు: 115
- మూలము : ఈనాడు దిన పత్రిక , ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ,ఇతత తెలుగు న్యూస్ పేపర్లు .
- ============================
No comments:
Post a Comment