-
- Srikakulam Assembly Constituency,శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం .
- 2014 ఎలక్షన్ లో పోటీ అబ్యర్ధులు :
------పార్టీ పేరు ------------
అబ్యర్ధి పేరు
- కాంగ్రెస్ :---------- చౌదరి సతీస్ ,
- వై.ఎస్.ఆర్ :------ ధర్మాన ప్రసాదరావు ,
- టి.డి.ఫి : ----------గుండ లక్ష్మీదేవి ,
- సమక్యాంద్ర :------పొన్నాడ జోగినాయుడు,
- బియస్పీ-----------బలగ బాలకృష్ణమూర్తి ,
- ఎస్.పి.ఎస్ --------జి.ఎల్.ఎల్ సూర్యనాయుడు ,
- సమక్యాంధ్ర ------పి.జె.నాయుడు ,
- లోక్ సత్తా ---------పంచాది రాంబాబు ,
- ఆమ్.ఆద్మీ--------పేడాడ మోహన్ దాస్ ,
- పిరమిడ్ పార్టీ-------డి.వీరబాబు ,
- స్వతంత్ర పార్టీలు :బగ్గు కృష్ణారావు , రాగోలు నాగశివ , సుగ్గు వేణుగోపాలరెడ్డి ,
గుర్తులు కోషం పైన టేబుల్ ని చూడండి .
శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం.. జిల్లా కేంద్ర పట్టణం శ్రీకాకుళంతో కలిసి ఉంది. ఈ నియోజకవర్గం ప్రారంభం నుంచి ఎలా ఉందో ఇప్పటికీ అలానే కొనసాగుతోంది. 2009లో జరిగిన పునర్వ్యవస్థీకరణలోనూ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళం పురపాలకసంఘం తోపాటు శ్రీకాకుళం, గార మండలాలు ఉన్నాయి. 1927లో పూజ్యబాపూజీ మహాత్మగాంధీ, 1935లో బాబూరాజేంద్రప్రసాద్, 1936లో జవహర్‌లాల్ నెహ్రూ పర్యటించారు. గతంలో రాష్ట్ర శాసనసభ స్పీకరుగా వ్యవహరించిన స్వర్గీయ తంగి సత్యనారాయణ ఈ ప్రాంతానికి చెందినవారే. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహిస్తుండగా, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఇదే పట్టణంలో నివసిస్తున్నారు. ప్రత్యక్షదైవంగా భావించే అరసవల్లి సూర్యనారాయణస్వామి, శ్రీమహావిష్ణువు రెండవ అవతారంగా భావించే శ్రీకూర్మనాథుని ఆలయాలు, హైదరాబాద్ తరువాత అతిపెద్దదైన జామియా మసీదు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. గలగలపారే నాగావళి నది శ్రీకాకుళం పట్టణం మధ్యలోంచి ప్రవహించడం ఒక విశిష్టతగా చెప్పవచ్చు. సుమారు 150 సంవత్సరాల చరిత్రగల మున్సిపాలిటీ, ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ వైద్యకళాశాల, వ్యవసాయ పరిశోధన కేంద్రం, వ్యవసాయ కళాశాల, దంతవైద్యకళాశాల, రెండు వైద్యకళాశాలలు (రిమ్స్ & జెమ్స్ కాలేజీలు ), జిల్లా కేంద్ర ఆసుపత్రి, 60 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మహిళా కళాశాల , ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. 31802 హెక్టార్లలో నియోజకవర్గం విస్తరించి ఉంది.
36 వార్డుల పరిధిలో విస్తరించిన శ్రీకాకుళం పట్టణం 62,583 మంది పురుషులు, 63,420 మంది మహిళలతో కలిపి మొత్తంగా 1,26,003 మంది జనాభాతో కొనసాగుతోంది. గ్రేడు-1 మున్సిపాలిటీ హోదాలో శ్రీకాకుళం పురపాలక సంఘం ఉంది. పట్టణం మధ్యలోంచి ప్రవహిస్తున్న నాగావళి నది దశాబ్దాల తరబడి శ్రీకాకుళం వాసుల దాహార్తిని తీరుస్తోంది. సుమారు 26 బ్యాంకుల పరిధిలో 30 వరకు బ్రాంచిలు కొనసాగుతున్నాయి. జిల్లాకేంద్ర పట్టణం కావడంతో చుట్టుపక్కల మండలాల నుంచి గ్రామాల నుంచి వలస వస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది.
28 పంచాయతీలతో, 31 రెవెన్యూ గ్రామాలతో విస్తరించిన శ్రీకాకుళం మండలం విస్తీర్ణం 39,888 ఎకరాలుగా ఉంది. ఇందులో సాగు ప్రాంతం 37,917 ఎకరాలుగా ఉంది. మండల పరిధిలో ప్రతిష్టాత్మక వ్యవసాయ పరిశోధనా కేంద్రం రాగోలులో ఉండగా, వ్యవసాయకళాశాల నైరాలో ఉంది. దీనికి తోడు శ్రీసాయి దంతవైద్యకళాశాల, జెమ్స్ వైద్యకళాశాల కూడా ఈ మండలంలోనే ఉన్నాయి.
1987లో ఏర్పడిన గార మండలం ప్రస్తుతం 24 పంచాయతీలతో, 39,897 మంది పురుషులు, 39,971 మంది స్త్రీలతో కలిపి మొత్తంగా 79,868 మంది జనాభా. శ్రీమహావిష్ణువు రెండో అవతారం అయిన శ్రీకూర్మ దేవాలయం బ్రిటీష్‌కాలం నాటి ఓడరేవు, కళింగపట్నం, బౌద్ధబిక్షువుల ఆవాసస్థలం (సాలిహుండం), జిల్లాలో ఏకైక ప్రభుత్వ డైట్ కళాశాల (ఒమరవెల్లి) ఈ మండలంలోనే ఉన్నాయి. సిస్టమ్ ఇంజినీరింగ్ కళాశాల (అంపోలు)తో పాటు జిల్లా జైలు (అంపోలు)కూడా ఉన్నాయి.
-
- ==============================
Visit my website - >
Dr.Seshagirirao-MBBS.
No comments:
Post a Comment