భారత లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య : 545.--ప్రతిసభ్యుడు ఒక నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తాడు.1962 వరకు 494 లోక్‌సభ స్థానాలు ఉండేవి. 1967 లో ఇవి 525 కు పెరిగాయి. 1973 లో 31 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545 కు పెంచారు. 2001 వరకు ఈ సంఖ్యను మార్చకూడదని 1976 లో 42 వ రాంజ్యాంగ సవరణ తెచ్చారు. 2026 వరకు ఈ సంఖ్య ఇలాగే ఉండాలని 2002 లో 84 వ రాజ్యాంగ సవరణ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య : 42. ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించబడి 1.ఆంధ్రప్రదేశ్ 2.తెలంగాణ ... గా పరిగణించబడుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికలు తరువాత అన్నివిధాలు గా ప్రత్యేకించబడతాయి. లోక్ సభ , శాసనసభ ఎన్నికలు తెలంగాణ లో ఏప్రిల్ 2014 న , సీమాంధ్రలో మే-07 న జరుగనున్నాయి. సీమాంధ్రలో 13 జిల్లాలలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు , తెలంగాణ లో 10 జిల్లాలలో
మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఒక పూర్తిస్థాయి పార్లమెంట్ నియోజకవర్గము , రెండు పాక్షిక పార్లమెంట్ నియోజక వర్గాలు ఉన్నాయి. 1.శ్రీకాకుళం ,2.విజయనగరం(ఎచ్చెర్ల ,రాజాం) , 3 అరకు(పాలకొండ),
శ్రీకాకుళం జిల్లాలో మొత్తము 10 శాసనసభ నియోజగవర్గాలు ఉన్నాయి.వీటిలో 7 శాసనసభ నియోజగకవర్గాలతో కూడికొని శ్రీకాకుళం పార్లిమెంట్ నియోజకవర్గము ఏర్పాటుచేసారు.
- ఇచ్చాపురం ,
- పలాసా,
- టెక్కలి ,
- నరసన్నపేట ,
- శ్రీకాకుళం ,
- ఆమదాలవలస ,
- పాతపట్నం
ఈ ఎన్నికలు 2008 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారమే జరుగుతాయి. అందువల్ల ప్రస్తుత నియోజకవర్గాల సంఖ్య, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా 2008నాటి పునర్విభజన లెక్కల ప్రకారమే జరుగుతాయి.
2014 జనవరి 1నాటి జాబితా ప్రకారం దేశంలో ఓటర్ల సంఖ్య 81.45 కోట్లకు చేరింది. 2009లో ఈ సంఖ్య 71.3 కోట్లు. 18-19 ఏళ్ల వయస్సున్న ఓటర్ల నమోదు భారీస్థాయిలో పెరిగింది. ఈ వర్గంలో 2.3 కోట్లమంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి వాటా 2.88శాతం. 2009లో ఇది కేవలం 0.75 శాతమే ఉంది. మొత్తం 29 రాష్ట్రాలు - 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు, 3 రాష్ట్రాల్లో పూర్తి అసెంబ్లీ, 8 రాష్ట్రాల్లోని 23 అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న నియోజకవర్గాల ప్రకారమే ఎన్నికలు జరపొచ్చు. తెలంగాణలోని 119, సీమాంధ్రలోని 175 అసెంబ్లీలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమరం మరో ఎత్తు. విభజన నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో భావోద్వేగాలు ప్రభావం చూపిస్తాయా? ఇతరత్రా అంశాలా అన్నది ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న చిట్టచివరి ఎన్నికలు ఇవే కావడం మరో విశేషం.
శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం సమాచారం--
ఆవిర్భావం : శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం 1952లో ఏర్పడింది.
2014 లో రిజర్వేషన్ : జనరల్
అసెంబ్లీ నియోజకవర్గాలు : దీని పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట ఉన్నాయి.
నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య :
* పురుషులు : 6,80,221
* మహిళలు: 6,84,431
*ఇతరులు : 149
* మొత్తం : 13,64,801
ఎన్నికల చరిత్ర
ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 8 సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు తెదేపా, ఒకసారి స్వతంత్ర పార్టీ, మరోసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
సంవత్సరం-- విజేత-- పార్టీ
* 1952 బొడ్డేపల్లి రాజగోపాలరావు (స్వతంత్ర)
* 1957 బొడ్డేపల్లి రాజగోపాలరావు (కాంగ్రెస్)
* 1962 రాజగోపాలరావు(కాంగ్రెస్)
* 1967 సర్దార్ గౌతులచ్చన్న(స్వతంత్ర)
* 1971 ఎన్.జి.రంగా(స్వతంత్ర)
* 1977 రాజగోపాలరావు (కాంగ్రెస్)
* 1980 రాజగోపాలరావు (కాంగ్రెస్)
* 1984 హనుమంతు అప్పయ్యదొర(తెలుగుదేశం)
* 1991 డాక్టర్ కణితి విశ్వనాథం (కాంగ్రెస్)
* 1996 కింజరాపు ఎర్రన్నాయుడు (తెలుగుదేశం)
* 1999 కింజరాపు ఎర్రన్నాయుడు (తెలుగుదేశం)
* 2004 కింజరాపు ఎర్రన్నాయుడు(తెలుగుదేశం)
* 2009 కృపారాణి (కాంగ్రెస్)
- =========================
No comments:
Post a Comment