శ్రీకాకుళం జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.
- జనరల్: శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
- బీసీ మహిళ: ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.
- పాలకొండ మినిసిపాలిటీ : పాలకొండ నగరపంచాయతీలో 20 వార్డులు ఉండగా, ఎస్సీలకు 2, ఎస్టీలకు 01, బీసీలకు 14, జనరల్‌కు మూడు వార్డులు కేటాయించారు
- date of Election : 30-03-2014,
- మొత్తం జనాబా = 20760,
- పురుషులు = 10069,
- స్ర్తీలు = 10691,
- ఓటర్ల సంఖ్య = 18,420.
- పోలైన ఓట్లు : 14,215 ,
2014 పాలకొండ , మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలు :
పాలకొండ నగర పంచాయతీ పోరులో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం నేడు12-05-2014న తేలనుంది. . పట్టణ ప్రజల్లో తొలి నగర పంచాయతీ పీఠాన్ని అధిష్ఠించేది ఎవరోనని జోరుగా చర్చ సాగుతోంది. పాలకొండ నగర పంచాయతీకి ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా కోర్టు తీర్పుతో ఫలితాలు వెల్లడివాయిదాపడింది . 20 వార్డులు ఉండగా, 14వ వార్డు ఏకగ్రీవమైంది. దీంతో 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 82 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎచ్చెర్లలో నిర్వహించనున్నారు. రెండు రౌండ్లలో ఓట్లు లెక్కింపు జరగనుంది. ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గంటలో ఫలితాల వెల్లడించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరగడంతో లెక్కింపు ప్రక్రియ సైతం సులభంగా, తక్కువ సమయంలోనే వెలువడతాయని అధికారులు చెబుతున్నారు. నగర పంచాయతీ కైవసం చేసుకోవాలంటే ఇరు పార్టీల(వై.ఎస్.ఆర్ & టి.డి.పి)లకు స్వతంత్రుల మద్దతు తప్పనిసరి. స్వతంత్రులు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీ నగర పంచాయతీని కైవసంచేసుకునే పరిస్థితి ఉంది. నగర పంచాయతీలో అత్యధిక స్థానాలు తెదేపా కైవసం చేసుకుంటే ఆ పార్టీ తరఫున అధ్యక్ష పదవిని పల్లా విజయనిర్మల పీఠమెక్కనున్నారు. వైకాపా తరఫున అధ్యక్ష పదవికి మాజీ ఎంపీపీ పాలవలస ఇందుమతి పేరును ఆ పార్టీ ఖారారు చేసింది. ఆ పార్టీ తరఫున అభ్యర్థులు ఎక్కువ మంది విజయం సాధిస్తే ఇందుమతి అధ్యక్ష పదవి అధిరోహించనున్నారు.
Palakonda Municipality 2014 electionResults,పాలకొండ నగర పంచాయతీ 2014 ఎన్నికల ఫలితాలు :
శ్రీకాకుళం జిల్లాలో మూడు పురపాలకసంఘాలు, ఒక నగర పంచాయతీలకుగాను పాలకొండ, పలాసల్లో తెదేపాకు, ఇచ్ఛాపురం వైకాపాకు ఇచ్చి ఆమదాలవలసలో హంగ్ ఏర్పడినది.. కాంగ్రెస్ ఒక్క ఆమదాలవలసలో తప్ప మిగిలిన చోట్ల నామమాత్రంగా మిగిలిపోయింది.
పాలకొండ నగర పంచాయతీ :
మొత్తం వార్డులు: 20,
ఏకగ్రీవం: 1 (స్వతంత్రుడు),
తెదేపా: 12 (పోటీ చేసింది 17 స్థానాల్లో),
కాంగ్రెస్: 0,
స్వతంత్రులు: 4,
వైకాపా: 3,
పాలకొండ నగర పంచాయతీని తెదేపా సొంతం చేసుకుంది. మూడింట రెండొంతుల స్పష్టమైన మెజారిటీ సాధించి ఛైర్‌పర్సన్ పదవిని కైవసం చేసుకుంది. నగర పంచాయతీగా మారిన తరువాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో తెదేపా (12) తిరుగులేని మెజారిటీ సాధించింది. మొత్తం వార్డులు 20. మొదట్లోనే ఓ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో తెదేపా 12 చోట్ల, స్వతంత్రులు నాలుగుచోట్ల, వైకాపా మూడుచోట్ల గెలుపొందాయి. కాంగ్రెస్ చిరునామా పూర్తిగా గల్లంతయింది. సోమవారం ఎచ్చెర్లలోని 21వ శతాబ్ది గురుకుల పాఠశాలలో పాలకొండ నగరపంచాయతీ ఓట్లను లెక్కించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు 9.15 గంటలకల్లా పూర్తయింది. ఎన్నికల పరిశీలకుడు వీఎన్ విష్ణు, జిల్లా సంయుక్త కలెక్టరు జి.వీరపాండియన్ లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. పాలకొండ ఆర్డీవో తేజ్‌భరత్, పురపాలక కమీషనర్ టి.కనకరాజు పర్యవేక్షించారు.
* ఈ నగరపంచాయతీలో మొదట్లోనే 14వ వార్డు స్వతంత్ర అభ్యర్థికి ఏకగీవ్రమైంది.
* పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డ వైకాపా అభ్యర్థి, జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం భార్య పాలవలస ఇందుమతి 65 ఓట్ల తేడాతో పల్ల కొండలరావు చేతిలో ఓడిపోయారు.
* పాలకొండ తెదేపా ఛైర్‌పర్సన్ అభ్యర్థిని పళ్ల విజయకుమారి 5వ వార్డునుంచి గెలుపొందారు. వైకాపా అభ్యర్థిపై 219 ఓట్ల మెజారిటీ సాధించారు.
19 పోస్టల్ బ్యాలెట్లు
* ఎన్నికల్లో 19 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకున్నారు. ఇందులో ఒక బ్యాలెట్ చెల్లలేదు.
* నాలుగో వార్డుకు సంబంధించి 7 ఓట్లు పోల్ కాగా ఒకటి తెదేపాకు, 6 వైకాపాకు వచ్చాయి.
* 11వ వార్డుకు రెండు ఓట్లు స్వతంత్రులకు పడ్డాయి.
* 10వ వార్డులో రెండు పోస్టల్ బ్యాలెట్‌లు రాగా ఒకటి తెదేపాకు, మరోటి వైకాపాకు వచ్చాయి.
* 6, 13, 15, 17, 19, 20 వార్డులకు ఒక్కో ఓటు చొప్పున వచ్చాయి. ఇవి స్వతంత్రులకు పడ్డాయి.
* 7వ వార్డుకు ఒక ఓటు రాగా అది తెదేపాకు వచ్చింది.
ఎన్నికల్లో అందరి దృష్టీ ఉన్నది నాలుగోవార్డుపైనే. ఇక్కడ తెదేపా తరఫున మాజీ సర్పంచి పల్లా కొండలరావు, వైకాపా తరఫున ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు పాలవలస రాజశేఖరం సతీమణి ఇందుమతి పోటీ పడ్డారు. ఇక్కడ గెలుపును వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విజయం కోసం అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించింది. అయినా.. అవి ఫలించలేదు.
రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌ను ఓటర్లు అసలు పట్టించుకోలేదు. 20 వార్డులకుగాను కేవలం ఆరు వార్డుల్లోనే పోటీ చేసినా.. అందరూ డిపాజిట్లు కోల్పోయారు. వీరందరికీ వచ్చిన ఓట్లు కేవలం 101.
- Courtesy with : Eenadu News paper 13-05-201`4
- ============================
No comments:
Post a Comment