జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.
- జనరల్: శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
- బీసీ మహిళ: ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.
- మొత్తం జనాబా = 36493,
- పురుషులు =17716 ,
- స్ర్తీలు = 18777,
- ఓటర్ల సంఖ్య = 24,722.
- పురుషులు =12,216 ,
- స్త్రీలు :12,506 ,
- పోలైన ఓట్లు L18,08ళ్,
ఇచ్ఛాపురం పురపాలకసంఘంలో అధిక స్థానాలను వైకాపా గెలుచుకున్నది. అసెంబ్లీ టిక్కెట్ విషయంలో వైకాపా నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎంవీ కృష్ణారావు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అక్కడే ఉన్నారు. సార్వత్రిక ఫలితాల అనంతరం ఇక్కడికి రానున్నారు. అప్పటి వరకు పుర అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగవు కనుక ఆయన వర్గం ధీమాగా ఉంది. నర్తు నరేంద్రయాదవ్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన ఎంపిక చేసిన అభ్యర్థులు మండల ఎన్నికల బరిలోఉన్నారు. వారి విజయం కోసం నరేంద్ర ఆరాటపడుతున్నారు. ఫలితాలు ఎలా వచ్చినా, ప్రయోజనం ఇతర పార్టీలకే ఉంటుందని, అందుకు పార్టీ బాధ్యుల ఒంటెద్దు పోకడలే కారణమని రామారావు వ్యతిరేక వర్గాలు అంటున్నాయి. సోమవారం ఇక్కడకు వచ్చిన రామారావు తమ పార్టీనుంచి ఎన్నికయిన అభ్యర్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికీ మిగిలిన రెండు వర్గాలకు చెందినవారు ఎవరూ లేకపోవడం గమనార్హం.
- ====================================
No comments:
Post a Comment