- తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన సాధారణ, మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన కింజరాపు దాలినాయుడు- కళావతమ్మ దంపతుల నలుగురు కుమారుల్లో పెద్ద కుమారుడిగా 23.02.1957న జన్మించిన ఎర్రన్నాయుడు స్వయంప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్రంలోనే ప్రముఖ రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారు.
* విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్న ఎర్రన్నాయుడు సమాజంలోని పేద, అట్టడుగు వర్గాల ప్రజలకు సేవ చేసే విషయంలో ముందుండేవారు.
* 1983లో ఎన్.టి.ఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించగా.. ఆయన స్ఫూర్తితో ఎర్రన్నాయుడు తెదేపాలో చేరి, రాజకీయాల్లో ప్రవేశించారు. శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం ఎమ్మెల్యే స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి, తొలిసారే భారీ విజయం కైవశం చేసుకున్నారు. అలా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం.. ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకునేలా అప్రతిహతంగా ముందుకు సాగింది.
* 1985లో మళ్లీ రెండోసారి కూడా ఎర్రన్న తెదేపా అభ్యర్థిగా హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచే విజయ కేతనం ఎగరేశారు.
* 1989లో పార్టీ టిక్కెటు నిరాకరించగా.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు!
* 1994లో మళ్లీ తెదేపా అభ్యర్థిగానే విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేశారు. చంద్రబాబుకు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత బాబుతో సన్నిహితంగా మెలుగుతూ.. పార్టీలో కీలకవ్యక్తిగా ఎదిగారు.
* కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షం ప్రతినిధిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి శాఖల మంత్రిగా కేబినెట్ హోదాలో పని చేశారు.
* శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానానికి వరుసగా మూడు సార్లు విజేతగా నిలిచారు.
* 2004 ఎన్నికల సమయంలో మర్నాడు పోలింగ్ అనగా.. ముందు రోజు నక్సల్స్ బాంబు పేల్చిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. అయినా ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.
* చివరిగా 2009 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయినా.. ఇప్పటికీ ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తరాంధ్రలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అగ్రనేతల్లో ఒకరుగా వ్యవహరిస్తున్నారు.
* ఎర్రన్నగా అభిమానులు, పార్టీ నేతలు ఆప్యాయంగా పిలుచుకునే ఎర్రన్నాయుడుకు మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, డీఎస్పీ ప్రభాకర్, కోటబొమ్మాళి పీఏసీఎస్ అధ్యక్షుడు హరివరప్రసాద్ తమ్ముళ్లు, భార్య విజయలక్ష్మి, కుమార్తె భవానీ, కుమారుడు రాము ఉన్నారు. గురువారం రాత్రి కూడా జిల్లాలోని కవిటిలో కార్యక్రమాలకు హాజరైన ఎర్రన్నాయుడు, విశాఖపట్నంలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై, తిరిగి వస్తూ.. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలోమరణించడం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని విషాదంలో నింపింది.
=======================
Yerrannaidu Kinjarapu is a member of Lok Sabha of India. He represents the Srikakulam constituency of Andhra Pradesh and is a member of the Telugu Desam Party.
Born : 23 February 1957
Place of Birth : Nimmada, Distt. Srikakulam, Andhra Pradesh
Political party: Telugu Desam Party
Residence :Hyderabad
Father's Name : Shri K. Dali Naidu
Mother's Name : Smt. K. Kalavathamma
Profession : Agriculturist,Lawyer
Marital Status : Married
Date of Marriage : 28 May 1982
Spouse's Name : Smt. Kinjarapu Vijaya Kumari
No. of Children : 2, 1 daughter and 1 son
Educational Qualifications : B.Sc., B.L.
Educated at Dr. V.S. Krishna College, Visakhapatnam and ,Andhra University, Visakhapatnam, Andhra Pradesh,
Permanent Address : Old MLA Quarters Room 307,Hyderabad,Andhra Pradesh
Phone: 040-23296666
Mobile: 9868180901
Fax: 011-23793558
E-Mail : yerran@sansad.nic.in
Position Held : 1982-1994
Member, Panel of Chairmen, Andhra Pradesh Legislative Assembly
1996
Elected to 11th Lok Sabha
1998
- Re-elected to 12th Lok Sabha (2nd term)
- Chairman, Committee on Subordinate Legislation, Andhra Pradesh Legislative Assembly
- Leader, Telgu Desam Parliamentary Party, Lok Sabha
- Chairman, Committee on the Welfare of the Backward Classes, Andhra Pradesh Legislative Assembly
1995-1996
Chief Whip, Andhra Pradesh Legislative Assembly
1996-1998
Union Cabinet Minister, Rural Areas and Employment
1982-1996
- Member, Andhra Pradesh Leglislative Assembly (four terms)
- Member, Privileges Committee, Andhra Pradesh Legislative Assembly
- Member, Telegu Desam Politburo
- Member, Committee of Privileges
- Member, Panel of Chairmen
- Chairman, Committee on Agriculture
1998-1999
- Member, Panel of Chairmen
- Leader, T.D.P. Parliamentary Party, Lok Sabha
1999-2004
- Chairman, Committee on Railways
- Member, Telugu Desam Politburo
- Member, Business Advisory Committee
- Member, General Purposes Committee
- Member, General Purposes Committee
- Member, Consultative Committee, Ministry of Civil Aviation
1999
- Re-elected to 13th Lok Sabha (3rd term)
- Member, Public Accounts Committee
- Member, Ethics Committee
- Member, Joint Parliamentary Committee on Safty of Perticide Residves in soft and aucated drinks
2004
Re-elected to 14th Lok Sabha (4th term)
2003-2004
- Member, Committee on External Affairs
- Member, Joint Parliamentary Committee, S.E.B.I.
- Member, Committee on Labour and Welfare
2000-2004
- Member, Consultative Committee, Ministry of Steel
- Member, General Purposes Committee
- Member, Committee on Social Justice & Empowerment
- Leader, Telugu Desam Parliamentary Party
- Special Invitee, Business Advisory Committee
16 August 2006 onwards
Member, Committee on Empowerment of Women
========================================================
- =======================
We lost a great warrior and leader.
ReplyDeleteYerram naidu garu TDP nayakudu ayinappatiki, chala mandi yuva nayakulaku, yuvatha ku aadarsham. mana Bharata Desam oka goppa nayakudu ni kolpoyindi. Mana srikakulam jillaa ki peru techina oka vajram lanti vaaru Yerrannayudu garu. Prati roju media lo vivaada rahitam ga vaani ni vinipinchina nayudu garu bhoutikam ga leka povatam vicharakaram. Vaari aatma ki shaanti kalagalani prardhistuu...
ReplyDeleteFans of Dola Jagan