Sunday, January 20, 2013

Majji Sarada,మజ్జి శారద

  •  



పలాస నియోజకవర్గంలో మాజీ ఎంఎల్‌సి మజ్జి శారద స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉండటంతో అక్కడ ఇటు కాంగ్రెస్‌, అటు వైకాపా కూడా తలపట్టుకుంటోంది. ఆమె గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ రావడం, ఇప్పుడు ఇండిిపెండెంట్‌గా పోటీచేస్తుండటంతో కాంగ్రెస్‌ ఓట్లకు గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆ సామాజికవర్గం నుంచి పోటీచేస్తున్న వైకాపా, జైసపా అభ్యర్ధులు కూడా కలవరపడుతున్నారు. మంగళవారంవరకూ ఆమెను పోటీనుంచి తప్పించాలని ప్రధాన పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్‌, వైకాపా, జైసపా పార్టీలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. అయితే నామినేషన్ల ఉపసంవహరణకు తుది రోజైన బుధవారం వరకూ ఆమె పోటీనుంచి తప్పుకోవచ్చునన్న ఆశతో ఆపార్టీలు ఉన్నాయి. తాను మాత్రం ఎట్టిపరిస్థితులలో కూడా పోటీనుంచి తప్పుకోనని మాత్రం మజ్జి శారద గట్టిగానే చెబుతున్నారు.

మజ్జి తులసీదాసు శ్రీకాకుళం జిల్లాలో సోంపేట నియోజక వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు . సొంత గ్రామం పాత్రపురం-సోంపేట మండలం.1972 సోంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున MLA గా గెలుపొందేరు. ఈయన 1992 - 94 కాలములో పి.సి.సి. ప్రసిడెంట్ గా తన సేవలు అందించారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు . పెద్ద కుమార్తె మజ్జి శారద .. మంచి పభుత్వ ఉద్యోగం విడిచి తండ్రి మరణాంతరము రాజకీయ వారసత్వము తీసుకున్నారు. రెండవ కుమార్తె హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగిణి గా స్థిరపడ్డారు .

పీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మజ్జి శారదకు పలాస నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభిస్తుందని అందరూ భావించారు. పిసీసీ మాజీ అధ్యక్షుడు మజ్జి తులసీదాసు కుమార్తె అయిన శారద 1994లో గ్రూప్ వన్ అధికారి ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయ ఆరంగేట్రం చేశారు. అయితే ఆమెకు అప్పటి సోంపేట నియోజకవర్గం అచ్చిరాలేదు. పార్టీ ఒకసారి అవకాశం కల్పించిన అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొత్తగా పలాస నియోజకవర్గం ఏర్పడటంతో పరిస్థితులు కాస్త అనుకూలించాయి.

 అయితే సామాజకవర్గ సమీకరణల కారణంగా 2004 ఎన్నికల్లో ఆమెకు పోటీ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత పార్టీ నాయకత్వం ఆమెకు ఎమ్మెల్సీ పదివిచ్చి సంతృప్తి పరిచింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈసారైనా తనకు టిక్కెట్టు వస్తుందని శారదతోపాటు పార్టీ కార్యకర్తలు ఆశించారు. దాని కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా శారదను కాదని గత ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీచేసిన వంక నాగేశ్వరరావును పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. తనను నిర్లక్ష్యం చేసినందుకు ఆగ్రహించిన మజ్జి శారద పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. శనివారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ పరిణామాన్ని కాంగ్రెసు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అభ్యర్థి వంక నాగేశ్వరరావుకు ఇది త ట్టుకోలేని ఎదురు దెబ్బ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 శారదకు మందస, పలాస మండలాల్లో తమ సామాజిక వర్గ ఓట్ల బలంతో పాటు గిరిజన గ్రామాల్లో కొంత పట్టు ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు చీలిపోయి  డిపాజిట్లు కూడా రావని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వంక నాగేశ్వరరావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కార్యకర్తలు పుక్కళ్ల గురయ్యనాయుడు, దువ్వాడ ప్రకాశరావు, సాతుపల్లి శేషయ్య, కోట్ని దుర్గాప్రసాద్ తదితరులు ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయారు. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే మేలని భావిస్తున్నారు. పార్టీకి  ఇటువంటి దుస్థితి వస్తుందని తాము ఎన్నడు కూడా అనుకోలేదని అక్కడక్కడ మిగిలి ఉన్న  సీనియర్ కార్యకర్తలు మధనపడుతున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీకి కాలం చెల్లిందని చెప్పక తప్పదు.
2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గవర్నర్‌కోటా కింద పదవిని దక్కించుకున్న మజ్జి శారద నాలుగేళ్లకే పరిమితమయ్యారు. తిరిగి ఈమె ఆ పదవిని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాళింగసామాజిక వర్గానికి చెందిన ఈమె మాజీ పిసిసి చీఫ్ దివంగత మజ్జి తులసీదాస్ వారసురాలిగా గ్రూపు-1 ఉద్యోగాన్ని వీడి కాంగ్రెస్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆదినుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ఈ కుటుంబానికి తిరిగి మండలిలో స్థానం కల్పించాలని కాంగ్రెస్ దిగ్గజాలను ఒప్పించేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిని మజ్జిశారదకు కేటాయించినట్లయితే రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ విజయాలకు ఆ సామాజికవర్గం వెన్నుదన్నుగా నిలుస్తుందని, మరో అవకాశం కల్పించాలని హైకమాండ్ వద్ద అభ్యర్ధించినట్లు తెలిసింది. ఇవేకాకుండా విద్యాధికురాలైన శారదకు పెద్దలసభలో అవకాశం కల్పించినట్లయితే జిల్లావాణిని గట్టిగా వినిపించేందుకు ఈ పదవి ఎంతగానో దోహదపడుతుందని పలువురు భావిస్తున్నారు.

  •  

  • ==========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment