- photo of Sira Nageswararao
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీపీ ,తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడుదుర్మరణం
- మందస మాజీ ఎంపీపీ, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సీర నాగేశ్వరరావు (62) బుధవారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పలాస-గొప్పిలి రోడ్డు మొగిలిపాడు పెట్రోల్‌బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. నాగేశ్వరరావు ఏడున్నరేళ్లు పాటు ఎంపీపీగా పనిచేయగా ఆయన భార్య సీర సౌదామిని ఐదేళ్ల పాటు ఎంపీపీగా ప ని చేశారు. వజ్రపుకొత్తూరు మండల కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీ,ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ కో సం స్వగ్రామం డిమిరియా నుంచి నా గేశ్వరరావు, దువ్వాడ వెంకటరావు కలి సి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పె ట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న టాటా మ్యాక్స్‌కాబ్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా మందస మండలంలో తెలుగుదేశం పార్టీకి నాగేశ్వరరావు ఎనలేని సేవలందించారని ఆయ న మృతి తీరని లోటని ఆ పార్టీ నాయకులు తెలిపారు. నాగేశ్వరరావు మృతి తో పలాస నుంచి వజ్రపుకొత్తూరుకు జరగాల్సిన టీడీపీ ర్యాలీని రద్దు చేశారు.
ఆయన స్వగ్రామం డిమిరియా. ఆయన రాజకీయ నేపథ్యాన్ని ఓసారి ఆత్మావలోకనం చేసుకుంటే..
1985-87 సంవత్సరంలో కాంగ్రెస్ నాయకుడు మజ్జి నారాయణరావుపై ఎంపీపీగా పోటీ చేసి విజయం సాధించారు.
1992-97 మధ్య కాలంలో ఆయన ఎంపీపీగా,
1997-2002 వరకూ ఆయన సతీమణి సీర సౌదామిని ఎంపీపీగా పని చేశారు. రెండు పర్యాయాలు మండల టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మాజీ మంత్రి శివాజీకి నాగేశ్వరరావు విరవిధేయుడుగా పేరుంది. మాజీ మంత్రి ఎర్రన్నాయుడుతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
టీడీపీ పాలనలో గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెప్పించారు. రాజకీయ జీవితంలో సౌమ్యుడిగా, వివాద రహితుడిగా అందరి మన్ననలు పొంది వయోభారం ఉన్నప్పటికీ పార్టీ అభివృద్ధికి కృషిచేస్తూ వచ్చారు.
ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతోష్ ఉన్నారు.
- ==============================
No comments:
Post a Comment