సహకార సంఘాల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఇపుడు నీటి సంఘాల ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంఘాలను సర్కారు 1997లో గుర్తించి ఎ.పి.ఎఫ్.ఎం.ఐ.ఎస్. చట్టాన్ని తీసుకొచ్చింది. 2006లో పునఃవ్యవస్థీకరించి పదవీకాలాల్లో మార్పులు తెచ్చింది. ప్రతి రెండేళ్లకో పర్యాయం ఎన్నికలు నిర్వహించి నాలుగోవంతు సభ్యుల స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మూడేళ్లపాటు కార్యవర్గ ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేసింది. వచ్చే ఏడాదితో మొత్తం నీటిసంఘాల పదవీకాలం ముగియబోతోంది.
* జిల్లాలో భారీ, మధ్య, చిన్న నీటిపారుదల శాఖల పరిధిలో మొత్తం 510 నీటిసంఘాలున్నాయి.
* వంశధార, నాగావళి, నారాయణపురం తదితర ప్రాజెక్టుల్లో 104 నీటిసంఘాలున్నాయి.
* జిల్లాలో మొత్తం 5,25,662 ఎకరాలకు సాగునీటిసంఘాల ద్వారా నీటియాజమాన్యం సాగుతోంది.
* వంశధార ఎడమ కాల్వ పరిధిలో 1,48,246 ఎకరాలు కాగా, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో 3,14,876 ఎకరాలకు సాగునీటి సంఘాలు ఏర్పాటయ్యాయి.
* వంశధార కుడి కాల్వ పరిధిలోని 62,540 ఎకరాలకు ఇంతవరకు సాగునీటి సంఘాల ఏర్పాటు ప్రక్రియ జరగలేదు.
మూడేళ్లపాటు మరచి...
సంఘంలోని 12 ప్రాదేశిక స్థానాల్లో ప్రతి రెండేళ్లకు నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలి. 2008 జనవరి 9న నీటిసంఘాలకు ఎన్నికలు నిర్వహించింది. తదుపరి తొలి 4
ప్రాదేశికాలకు 2010లో ఎన్నికలు నిర్వహించాలి. నాటి నుంచి వరుసగా ప్రతి ఏటా సంఘాల పదవీకాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా గతేడాది ఫిబ్రవరి 15న ప్రభుత్వం జీవో
25 ద్వారా గత నెల 31 వరకు పదవీకాలాన్ని పొడిగించింది.
ఏడాది ముందుగానే....
నీటిసంఘాల్లోని నాలుగోవంతు ప్రాదేశికాల పదవీకాలం వచ్చే ఏడాది డిసెంబరు వరకు ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికలు గనుక నిర్వహిస్తే 8 ప్రాదేశికాలకు నేరుగా రైతుల నుంచి
ఎన్నికలు జరపాలి. అదే వచ్చే ఏడాది వరకు వేచి ఉంటే మొత్తం అన్ని స్థానాలకూ ఎన్నికలు జరిపించవచ్చు. మూడేళ్ల పాటు వాయిదా వేసిన ప్రభుత్వం మరో ఏడాది గనుక వేచి ఉంటే నీటిసంఘాల్లోని 12 స్థానాలకు, డి.సి.లకు, పి.సిలకు ఒకే పర్యాయం ఎన్నికలు జరిపించవచ్చునని నీటిపారుదల శాఖకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నీటిసంఘాల వివరాలు ఇవీ....జిల్లాలోని ప్రాజెక్టుల పరిధిలోని నీటిసంఘాల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాజక్టు నీటి సంఘాలు డిస్ట్రిబ్యూటరీలు
--------------------------------------------
* వంశధార 54 8
* నాగావళి 25 5
* నారాయణపురం 25 5
* మైనర్ ఇరిగేషన్‌లో 456 10
------------------------------------------
సంఘాల్లోని 4 ప్రాదేశికాలకు మరో ఏడాది పదవీ కాలం ఉంది. గడువు కంటే ముందు అన్ని స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తే న్యాయ పోరాటానికి నీటిసంఘాల ప్రతినిధులు
సమాయత్తమవుతున్నారు. 2008లో లాటరీ పద్ధతిలో పదవీ కాలం నిర్ణయించిన ప్రభుత్వం ఇపుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా అని టి.సి. సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తమకు అధ్యక్ష
స్థానానికి పోటీ చేసే అవకాశం కోల్పోవలసి ఉంటుందని వారు అంటున్నారు.
నీటిసంఘాల పదవీకాలం పూర్తయిన పిదప వచ్చే ఏడాది అన్ని టీసీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచిది. ఇప్పటికే జరగాల్సిన జాప్యం జరిగింది. మరో ఏడాదితో సంఘాల్లోని
అన్ని స్థానాలకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం సబబు.
Sept-2015
జిల్లాలో సాగునీటి సంఘాలలో ఎక్కువ శాతం అధికార పక్షం తెలుగుదేశం కైవసం చేసుకుంది. మొత్తం 505 సంఘాలకు గాను ఇప్పటి వరకు 417 సంఘాలకు ఎంపిక పూర్తయింది. వంశధార ప్రాజెక్టులో మాత్రం ఒకటి మినహా దాదాపుగా మిగిలిన అన్ని సంఘాలకు సజావుగానే ఎంపిక ప్రక్రియ ముగిసింది. ప్రధాన జలవనరుల శాఖకు చెందిన నారాయణపురం ఆనకట్ట, పాత తోటపల్లి ఆయకట్టు (నాగావళి రివర్ సిస్టం) సహా చిన్ననీటి వనరులకు చెందిన సంఘాల్లోనే కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పూర్తయిన సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరిస్తే.. తరవాత పంపిణీ (డిస్టిబ్యూటరీ)సంఘాలు, ఆ తరవాత ప్రాజెక్టు కమిటీల ఎంపిక ప్రక్రియను చేపడతారు.
సాగునీటి వినియోగదారుల సంఘాల ఎంపికను ఏకాభిప్రాయంతో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు స్పష్టమైన విధివిధానాలను సూచించింది. ముందుగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించివారిలో ఎక్కువ మంది ఎవరి పేర్లను ప్రతిపాదిస్తే వారికే అవకాశం కల్పించాలని నిర్ధేశించింది. ఆ మేరకు దాదాపుగా చాలా చోట్ల పూర్తయింది. కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తాయి. సభ్యుల ఎంపికలో కొన్ని చోట్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో మరికొన్ని చోట్ల ఏకాభిప్రాయాలు రాలేని పరిస్థితి నెలకొంది. ఎంపికైన ప్రతి సంఘాన్ని తెదేపానే కైవసం చేసుకుంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికార పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుందని వైకాపా ప్రత్యక్షంగా ఎక్కడా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. పరోక్షంగా మాత్రం కొన్ని చోట్ల పావులు కదిపింది. అలాంటిచోట్లే కొంత ఎంపిక ప్రక్రియకు కొంత గందరగోళం నెలకొంది.
- ======================
No comments:
Post a Comment