- గాదె శ్రీనివాసులునాయుడు -- 2013
- మన భారతదేశములో ఎన్నికలు లేని నెల అంటూ ఉండదు. ఇక్కడ ఎన్నికలు ఓ పెద్ద గేమ్. ఎన్నికలతో లింక్ లేని వ్యవహారమంటూ లేదు. ఇదంతా అవసరమా అంటే ... రాజకీయ నిరుద్యోగ సమస్యకోసము అవసరమే!.
- మూడు ఉపాధ్యాయ (1.శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం, 2.వరంగల్- ఖమ్మం- నల్గొండ, 3.మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్),
- మూడు పట్టభద్రుల (1.తూర్పు-పశ్చిమ గోదావరి,- 2.కృష్ణా-గుంటూరు, -3.మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్) శాసనమండలి నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
- 21-feb-2013 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది . ఆరు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు మొత్తం 1437 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. మొత్తం 84 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి దుర్గాప్రసాద్ మరణించడంతో 83 మంది బరిలో ఉన్నారు. పట్టభద్రుల స్థానాలకు 64 మంది, ఉపాధ్యాయ స్థానాలకు 19 మంది పోటీ చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్‌కాస్ట్‌తో పాటు సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేసారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించరు. మొత్తం ఆరు నియోజకవర్గాల్లో 6,32,000 మంది ఓటర్లు ఉన్నారు. 25వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు-- ఎన్నికకు శ్రీకాకుళం జిల్లాలో 39 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి . 4,611 ఓటర్లు ఉన్నారు. ఇందుకు 5000 బ్యాలెట్ పేపర్లు అవసరము. ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా సంఘాల ప్రచారం బరిలో ఏడుగురు . . సిక్కోలు పైనే అభ్యర్థుల దృష్టి ఉన్నంది . ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉపాధ్యాయ సంఘాలకు ప్రతిష్టగా మారింది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఓటు అడుగుతుండడంతో ఉపాధ్యాయుల్లో ఎన్నికల వేడి రాజుకుంది. సహకార, చేనేత సంఘాలకు ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వూపందుకుంది.
ఉపాధ్యాయుల్లో శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నిక ఈ నెల 21న ఎన్నిక జరగనుండడంతో అన్ని సంఘాలు ప్రచారం ఉద్ధృతం చేశాయి. గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సంఘాల్లో సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయుల్లో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఏగుడురు నిలవడంతో ఓట్లు చీలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంలోని 14,500 మందికి పైగా ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. విశాఖపట్టణం తరువాత శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధికంగా 4,611 మంది ఓటర్లు ఉండడంతో ఇక్కడి ఉపాధ్యాయుల తీర్పు పైనే ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం ఆధారపడి ఉంది. ఏడుగురు అభ్యర్థులు రంగంలో నిలవడంతో ప్రతి ఓటు కీలకంగా మారింది.
* మార్చి మొదటి వారంతో ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పదవీ కాలం ముగయనుంది. ఈ స్థానానికి ఈ నెల 21న ఎన్నిక జరగనుంది.
*5. నక్క దామోదరరావు--,
6.కొండపల్లి రామారావు--,
7.కె.ఆర్.దివాకర్ --- కూడా బరిలో నిలవడంతో పోటీ ఆసక్తిగా మారింది.
- శ్రీకాకుళం జిల్లానుండి -- ఒకరు ,
- విజయనగరము జిల్లానుండి -- నలుగురు ,
- విశాఖపట్నం జిల్లానుండి --ఇద్దరు ,
శ్రీకాకుళం జిల్లాలో 39 పోలింగ్ కేంద్రాలు--
ఈ ఎన్నికకు జిల్లాలో జిల్లాలోని 38 మండలాల్లోనూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎక్కువ మంది ఉండడంతో జిల్లా కేంద్రంలో అదనంగా మరో కేంద్రం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ పురపాలక ఉన్నత పాఠశాలలో ఒక కేంద్రంలో 700 మంది, మరో కేంద్రంలో 419 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఇక్కడ 1,119 మంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అత్యధికంగా పాలకొండలో 301 మంది, టెక్కలిలో 249 మంది, పలాసలో 239 మంది, రాజాంలో 199 మంది ఓటర్లు ఉన్నారు.
- జిల్లా ----------పోలింగ్ కేంద్రాలు-- ఓటర్లు
శ్రీకాకుళం------ 39--------------- 4,611
విజయనగరం-- 36 --------------3,723
విశాఖపట్నం --48 --------------6,094
మొత్తం -------123 -------------14,428
జిల్లాలోని 38 మండలాల్లోనూ పీఆర్‌టీయూకి కార్యవర్గాలు ఉండడం, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో గాదెకు పరిచయాలు ఉండడం ఈ ఎన్నికల్లో బాగా లాభించింది. ప్రచారం విషయంలోనూ మిగిలినవారితో పోలీస్తే గాదె వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. పోలింగుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు గాదెకు మద్దతుగా నిలిచినట్టు అంచనా వేస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొన్ని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించలేక పోయారని ప్రత్యర్థులు ఉధృతంగా ప్రచారం చేసినా.. అది అంతగా ఫలించలేదు. గాదె విజయంపై పీఆర్టీయు జిల్లాశాఖ అధ్యక్ష కార్యదర్శులు బైరి అప్పారావు. వి.హరిశ్చంద్రుడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు.
- ==========================
No comments:
Post a Comment