ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 2014 లో-- లోక్ సభ , శాసనసభ ఎన్నికలతో లోకల్ బాడీస్ అయిన ... మునిసిపాలిటి , జడ్ పి టి సి , ఎం.పి.టి.సి లకు తద్వారా జిల్లాపరిషత్ లకు కోర్టు ఆదేశాలమేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Srikakulam 16th Loksabha election, శ్రీకాకుళం లో పూర్తిస్థాయి లోక్ సభ నియోజకవర్గం ఒకటి ,ఉమ్మడి లో్క్ సభ నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. 15వ లోక్‌సభ ఐదేళ్ల కాలపరిమితి మే 31తో పూర్తవుతుంది. 16వ లోక్‌సభకు స్వేచ్ఛా.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల ఎన్నికల నిర్వహణ చేయవలసి ఉంది .
ఈ ఎన్నికలు 2008 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారమే జరుగుతాయి. అందువల్ల ప్రస్తుత నియోజకవర్గాల సంఖ్య, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా 2008నాటి పునర్విభజన లెక్కల ప్రకారమే జరుగుతాయి.
2014 జనవరి 1నాటి జాబితా ప్రకారం దేశంలో ఓటర్ల సంఖ్య 81.45 కోట్లకు చేరింది. 2009లో ఈ సంఖ్య 71.3 కోట్లు. 18-19 ఏళ్ల వయస్సున్న ఓటర్ల నమోదు భారీస్థాయిలో పెరిగింది. ఈ వర్గంలో 2.3 కోట్లమంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి వాటా 2.88శాతం. 2009లో ఇది కేవలం 0.75 శాతమే ఉంది. మొత్తం 29 రాష్ట్రాలు - 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు, 3 రాష్ట్రాల్లో పూర్తి అసెంబ్లీ, 8 రాష్ట్రాల్లోని 23 అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న నియోజకవర్గాల ప్రకారమే ఎన్నికలు జరపొచ్చు. తెలంగాణలోని 117, సీమాంధ్రలోని 175 అసెంబ్లీలు ఉన్నాయి .ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమరం మరో ఎత్తు. విభజన నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో భావోద్వేగాలు ప్రభావం చూపిస్తాయా? ఇతరత్రా అంశాలా అన్నది ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న చిట్టచివరి ఎన్నికలు ఇవే కావడం మరో విశేషం.
Fig : MP and MLA constituencies in Andhrapradesh -- Telanga and Seemandhra wise shedule.
- General Elections Expenditure --
- fig : General elections of parliament 2014 schedule - India
- ================================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.
No comments:
Post a Comment