Monday, March 24, 2014

Srikakulam MPTC elections 2014,శ్రీకాకుళం ఎమ్పీటీసీ ఎన్నికలు 2014








In Srikakulam Dist (శ్రీకాకుళం జిల్లాలో )-> 
-----------------Panchayats
 (పంచాయతీలు )=1107 , -> శ్రీకాకుళం డివిజన్‌ = 362 , పాలకొండ డివిజన్‌ = 380, టెక్కలి డివిజన్‌ లో = 365
-----------------MPPs
 (మండల పరజా పరిసత్లు )=38
---------------- MPTC (మండల ప్రజా పరిషత్ సభ్యులు )= 675
---------------- ZPP(Z.P)
జిల్లాపరిషత లు =1 ,
----------------ZPTC (జిల్లా ప్రజా పరిసత్ సబ్యులు ) =38


2014 Srikakulam dist MPTC elections,శ్రీకాకుళం జిల్లా లోఎంపీటీసీ  ఎన్నికలు : శ్రీకాకుళం  పంచాయతీ ఎన్నికలు July 2013 లో పూర్తిచేసిన ప్రభుత్వం స్థానిక సంస్థలైన ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2014 లోనిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లా పరిషత్‌ యంత్రాంగం అందుకు అవసరమైన కసరత్తు మొదలుపెట్టింది.

2001 లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా: 22,35,328--2001లో ఎంపీటీసీ సభ్యుల స్థానాలు: 638
2011 లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా: 23,57,635--గతం కంటే పెరిగిన జనాభా: 1,22,307--ఎంపీటీసీ సభ్యుల స్థానాలు: 675
తాజా జనాభా ప్రకారం గతం కంటే పెరిగిన ఎంపీటీసీ సభ్యుల స్థానాలు: 36

పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పురపాలక, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలపై దృష్టి సారించింది. మండల పరిషత్తులకు సంబంధించి అత్యంత కీలకమైన ఎంపీటీసీ సభ్యుల పునర్విభజనపై దృష్టి సారించింది. ఇప్పటి వరకు 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ సభ్యుల స్థానాల సంఖ్య కొనసాగుతోంది. తాజాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ స్థానాలను పునర్విభజించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 36 ఎంపీటీసీ ప్రాదేశికాలు పెరగనున్నాయి.

జిల్లాలో గ్రామీణ జనాభా 23,57,635కు చేరింది. చాలా మండలాల్లో గతం కంటే జనాభా అనూహ్యంగా పెరిగిపోయింది. 3,500 జనాభాకు ఒక ఎంపీటీసీ ప్రాదేశికం చొప్పున పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2001 జనాభా లెక్కలు ప్రకారం 22,35,328 మంది జనాభాకు 638 ఎంపీటీసీ సభ్యుల స్థానాలుగా అప్పట్లో నిర్ణయించారు.

తాజా జనాభా లెక్కల ప్రకారం 37 స్థానాలు అదనంగా పెరిగినట్లు తేల్చడంతో జిల్లాలో ఈ సంఖ్య 675కు చేరనుంది. అధికారుల తాజా లెక్కల ప్రకారం 12 మండలాల్లో ఎలాంటి మార్పు ఉండదు. మిగిలిన 26 మండలాల్లో ఈ స్థానాల సంఖ్య మారనుంది. రెండు మండలాల్లో ఎంపీటీసీ సభ్యుల సంఖ్య తగ్గగా, 24 మండలాల్లో పెరిగింది.

అత్యధికం ఎచ్చెర్ల, శ్రీకాకుళం, రణస్థలం
జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం, రణస్థలం మండలాల్లో ఎంపీటీసీ సభ్యుల స్థానాల సంఖ్య 25 చొప్పున చేరుకుంది. అత్యల్పంగా ఎల్‌ఎన్‌పేటలో 8 స్థానాలకు పరిమితం కానుంది.

ఎచ్చెర్లలో గతంలో 23 స్థానాలు ఉండగా రెండు, రణస్థలంలో గతంలో 22 ఉండగా, మూడు అదనంగా పెరిగాయి. శ్రీకాకుళంలో గతంలో కేవలం 20 స్థానాలు ఉండగా ఏకంగా అయిదు పెరిగి 25కు చేరుకుంది. ఆమదాలవలస, బూర్జ, జి.సిగడాం, జలుమూరు, ఎల్‌.ఎన్‌.పేట, నరసన్నపేట, పలాస, పోలాకి, పొందూరు, రాజాం, రేగిడి, సరుబుజ్జిలి మండలాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎచ్చెర్ల, గార, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, కొత్తూరు, మందస, సోంపేట మండలాల్లో రెండోసి చొప్పున స్థానాలు పెరిగాయి. భామిని, హిరమండలం, కోటబొమ్మాళి, లావేరు, మెళియాపుట్టి, నందిగాం, పాతపట్నం, సంతబొమ్మాళి, సంతకవిటి, సారవకోట, సీతంపేట, టెక్కలి, వి.కొత్తూరు, వీరఘట్టం మండలాల్లో ఒకొక్కటి చొప్పున పెరగనున్నాయి. వంగర, పాలకొండల్లో ఒక్కో స్థానం తగ్గనున్నాయి.


  • ===============================

Visit my website - > Dr.Seshagirirao-MBBS. 

No comments:

Post a Comment