![[Mandals+in+Srikakulam+dist.jpg]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEijJ_aHze5xxl8SAcobE3qje9aTzvrQWf0olzrP6vjGz8BoZ0398Lrs6miJT9fefuhOlNm_zQ-IqnrHrcMCb64_atYC-QB5L0N0RKnNsrxl2_tjAp25uIbzsFlE760Lht9DOjYbce1e0ms/s200/Mandals+in+Srikakulam+dist.jpg)
- papulation :
- Elections 2014 :
2014 ఎన్నికలలో పోటీ అబ్యర్ధులు :
*కాంగ్రెస్ : నరేష్ కుమార్ అగర్వాల్ (లల్లూ) ,
*టి.డి.ఫి : బెందాళం అశోక్.డా.(ఆయుర్వేదిక్) ,
* వై.ఎస్.ఆర్ : నర్తు రామారావు ,
* జై సంక్యాంధ్ర : మురపాల కోదండరావు ,
* ఆమ్ ఆద్మీ : లేరు ,
*బి.యస్.పి. : మలిపెద్ది ధనుంజరరావు ,
*లోక్ సత్త : బడే గౌరీశ్వరి ,
*నవభారత్ నేషనల్ పార్టీ : ఇసురు భాష్కర రెడ్ది ,
* ఇండిపెండెంట్ : తేజ సింగ్ జాన్ ఖాన్ హాంగ్ & బోర తులసీరావు ,
* సి.పి.ఐ : లేరు ,
* సి.పి.ఎం : లేరు ,
రాష్ట్రానికి చివరగా ఉన్న నియోజకవర్గం ఇచ్ఛాపురం. ఇది 2009 వరకు ఒకటోనంబరు నియోజకవర్గంగా గుర్తింపు ఉండేది. అప్పట్లో ఇచ్ఛాపురం పురపాలకసంఘంతో పాటు ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాలు, సోంపేటలోని సాగరతీర గ్రామాలు రామయ్యపుట్టుగ, గొల్లగండి కలిపి ఇచ్ఛాపురం నియోజకవర్గంగా ఉండేవి. మిగిలిన సోంపేట మండలం సోంపేట నియోజకవర్గంగా ఉండేది. పునర్విభజనలో సోంపేట నియోజకవర్గం కనుమరుగయిపోయి, సోంపేట మండలం వరకు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కలిసిపోయింది. మిగిలిన భాగం అంతా కొత్తగా ఏర్పడిన పలాస నియోజకవర్గంలోకి చేరిపోయింది. ఒకప్పుడు ఇచ్ఛాపురం నియోజకవర్గం హద్దుగా సోంపేట ఉండగా, ఇపుడు పలాస నియోజకవర్గం హద్దుగా మారింది.
జనాభా---
(2011 లెక్కలను అనుసరించి)
- ఇచ్ఛాపురం- 70,557
- కవిటి - 78,357
- కంచిలి - 59,840
- సోంపేట - 81,517
- మొత్తం జనాభా 3,00,371
- ఓటర్లు మొత్తం 1,86,583----* ఇక్కడ జనాభాలో మహిళలే అధికం.
నియోజకవర్గం: హద్దులు పరిశీలిస్తే:
- తూర్పు : బంగాళా ఖాతం
- ఉత్తరం : ఒడిశా రాష్ట్రం
- పశ్చిమం : ఒడిశా రాష్ట్రం
- దక్షిణం : పలాస నియోజకవర్గం
* కేంద్రీకృత రవాణారంగ కేంద్రం, సరిహద్దు ఉమ్మడి చెక్‌పోస్టులు ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తేవడమే కాక, దాదాపు 10 వేల మందికి ఉపాధిని కల్పిస్తోంది.
* 30 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు, 5 వేల ఎకరాల్లో జీడి, 4 వేల ఎకరాల్లో మామిడి, రెండువేల ఎకరాల్లో పనస సాగవుతున్నాయి. ఏటా ఉత్తరాది రాష్ట్రాలకు 3 కోట్ల రూపాయలకుపైగా విలువైన కొబ్బరి, కోటి రూపాయలకుపైగా విలువైన ఇతర పళ్లు రవాణా అవుతున్నాయి. అరటి, చింత, చెరకు, కాయగూరలు, తేనె ఉత్పత్తులు స్థానికంగా సంతల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి.
* బాహుదా, మహేంద్రతనయ పాయ, పద్మాపురం గెడ్డ, భీమసముద్రం గెడ్డ, రంగాల గెడ్డ ఈ ప్రాంత జల సిరులు.
* 16వ శతాబ్దపు నాటి కట్టడాలు నేటికి చెక్కుచెదరక నాటి చారిత్రాత్మక వైభవాన్ని భావితరాలకు అందిస్తున్నాయి. వాటిలో ఇచ్ఛాపురం పీర్లకొండ, జగన్నాధస్వామి దేవాలయం, స్వేచ్ఛావతి, కవిటి చింతామణి, కంచిలి కంచమ్మ తల్లి, సోంపేట సోమపోలమాంబ, బారువ జనార్థన, కోటిలింగేశ్వర దేవాలయాలు, ఇచ్ఛాపురం లాలాపేట, కస్పా వీధులలోని పురాతన మసీదులు, ఇచ్ఛాపురం, సోంపేటలలో 60 ఏళ్ల చరిత్ర గల ఆంధ్రా బాప్టిస్టు చర్చిలు గత వైభవ చిహ్నాలుగా నిలుస్తున్నాయి.
* బారువ సముద్రతీరం ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన ఓడ రేవుగా గుర్తింపు పొందింది. వివిధ దేశాలనుంచి పెద్ద నౌకలలో వర్తకాలు సాగించేవారు.
* స్వాతంత్రోద్యమంలో కూడా ఇచ్ఛాపురానికి ప్రత్యేక స్థానం ఉంది. పుల్లెల శ్యాంసుందరరావు, గౌతు లచ్చన్న, ఉప్పాడ రంగబాబు లాంటి ప్రముఖులు ఇక్కడ ఉద్యమాన్ని నడిపి బరంపురం నుంచి ఉమ్మడి మదరాసు కేంద్రం వరకు బ్రిటీష్‌వారిని గడగడలాడించారు.
* ఇపుడు కూడా థర్మల్ ఉద్యమాన్ని నడిపి జాతీయ స్థాయిలో తమ పోరాట శక్తిని నిరూపించుకుంటున్నారు.
* రాజకీయంగా పరిశీలిస్తే నియోజకవర్గాలలో 2009 వరకు ఒకటో నంబరు నియోజక వర్గంగా గుర్తింపు పొందింది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయి మంత్రి పదవిని చేపట్టిన వారిలో గౌతు శ్యాంసుందర శివాజి, పేనల్ స్పీకర్‌గా, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అద్యక్షునిగా ఎం.వి.కృష్ణారావు పదవులు చేపట్టారు.
* 1952 నుంచి ఇప్పటివరకు 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ, రెండుసార్లు కృషీకార్ లోక్ పార్టీ, ఒక్కోసారి జనతా, స్వతంత్ర పార్టీ అభ్యర్ధులు విజేతలుగా నిలిచారు.
* సోంపేట అప్పడాలు, చుప్పుల తయారీలో ప్రసిద్ధి పొందింది. ఇక్కడ నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఎంపి, యుపి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇవి కుటీర పరిశ్రమగా విరాజిల్లుతూ వేలాదిమందికి ఉపాధిని అందిస్తున్నాయి.
* కొబ్బరి ఉత్పత్తులయిన కొబ్బరి ఈనెలు, పీచులతో పరిశ్రమలు, ఎగుమతి కేంద్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు.
* కంచిలి, సోంపేట మండలాలలో గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, సోంపేట, కవిటిలలో సాగరతీర మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి రోజూ 40 లారీల చేపలు ఎగుమతి అవుతుంటాయి.
* ఆంధ్రా ఒడిశా సంస్కృతుల సమ్మేళనంగా ఈ ప్రాంతం విస్తరించి ఉంది. తెలుగుతో పాటు ఒరియా పాఠశాలలు ఇక్కడ కనపిస్తాయి. పండగలు, జాతరలు ఇలానే సమ్మేళనంగా నిర్వహిస్తుంటారు.
* మతసామరస్య వేదికగా ఇచ్ఛాపురం గుర్తింపు పొందింది. హిందువుల పండగలు, పూజలలో మహమ్మదీయులూ భాగస్వాములు అవుతుంటారు.
మండలాల నివేదిక :
*ఇచ్ఛాపురం------
- జనాభా: 44,085 (మండలం), 36,472 (మున్సిపాలిటీ)
- ఓటర్లు: 28,459 (మండలం), 19,797 (మున్సిపాలిటి)
- విస్తీర్ణం: 74.30 చ.కి.మీ(మండలం), 25.25 చ.కి.మీ. (మున్సిపాలిటీ)
- సరిహద్దు మండలాలు: కవిటి, ఒడిశా.
- ప్రత్యేకతలు
* ఆంధ్రా సరిహద్డు మండలంగా, ముఖద్వారంగా, ఒడిశా సరిహద్దు పట్టణంగా గుర్తింపు.
* రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులలో పురుషోత్తపురం మొదటి స్థానంలో ఉంది.
* తేలుకుంచి పక్షుల విహార కేంద్రం.
* మతసామరస్య వేదికగా నిలుస్తున్న పీర్లకొండ.
* నాటి (16వ శతాబ్దం) పాలకులకు గుర్తుగా ఇప్పటికీ ఉన్న ముస్లిం వీధుల పేర్లు, మసీదులు, చెరువులు.
* చారిత్రాత్మకమైన బాహుదానది ప్రవహించే మండలం. ఒడిశా కొండలలో పుట్టి ఈ మండలంలో ప్రవేశించి, ఇదే మండలంలో సముద్రాన కలుస్తోంది.
* కంచిలి కొండలలో పుట్టి ఇచ్ఛాపురం మండలం మీదుగా ప్రవహించే పద్మాపురం గెడ్డ, చికిటి కొండలనుంచి జాలువారి భీమ సముద్రం గెడ్డగా రూపాంతరం చెందిన జలవనరులు ఈ మండలం సొంతం.
* చిలుక తంపర భూములు.
* మండలానికి మూడువైపులా ఒడిశా ఉండగా, ఒకవైపున కవిటి మండలం ప్రాంతం కలసి ఉంది.
* సాగరతీరంలో ఐదు గ్రామాలు ఉన్నాయి.
- చారిత్రాత్మక అంశాలు
* రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న జగన్నాథస్వామి దేవాలయం, స్వేచ్ఛావతి దేవాలయం, ఏకాదశ శంభుల నిలయం (11 శివాలయాలు ఇచ్ఛాపురం పట్టణంలోనే ఉన్నాయి), మండపల్లి గారపోలమ్మ, లొద్దపుట్టి వాహనదేవత ధనరాజమాత, జగన్నాథుని రథయాత్ర విశేష అంశాలు.
* మండలంలోని మూడు గ్రామాలు రెండు రాష్ట్రాల పాలనలో ఉన్నాయి.
* బెల్లుపడ కొండపై ఉన్న మిని కైలాసగిరి పార్కు.
- విద్యారంగం
* మండల ప్రాథమికోన్నత పాఠశాలలు: 12
* జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలు: 7
* ప్రభుత్వ ఉన్నత పాఠశాల: ఒకటి
* మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలు: 11
* మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలు: లేవు
* మున్సిపల్ ఉన్నత పాఠశాలలు: మూడు
సోంపేట :
- జనాభా: 81, 517
- ఓటర్లు: 50,174
- విస్తీర్ణం: 122 చ.కిమీ
- సరిహద్దు మండలాలు: కవిటి, కంచిలి, మందస
- చారిత్రక అంశాలు:
*విద్యారంగం: మండలంలో 56 ప్రాథమిక, 16 ప్రాథమికోన్నత, 13 ఉన్నత పాఠశాలలున్నాయి. ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలతో పాటు 8 బి.సి., ఎస్సీ వసతి గృహాలున్నాయి.
*రాజకీయ పార్టీలు: మండలంలో తెలుగుదేశం, కాంగ్రెస్, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్, సి.పి.ఎం పార్టీలు ఉన్నాయి
కంచిలి :
*జనాభా: 59840 (2001 లెక్కలప్రకారం)
*ఓటర్లు: 41,642 ( ప్రస్తుత లెక్కల ప్రకారం)
*విస్తీర్ణం: 118 చదరపు కిలోమీటర్లు
*సరిహద్దులు: సోంపేట, కవిటి మండలాలు
*ప్రత్యేకతలు: జాతీయస్థాయిలో పేరొందిన కొబ్బరి మార్కెట్.
కవిటి :
*మండలం : కవిటి
*జనాభా : 78,357
*ఓటర్లు : 46,510
*విస్తీర్ణం : 126 చ.కీ.మి.
*సరిహద్దు మండలాలు : ఇచ్చాపురం, కంచిలి, సోంపేట.
*ప్రత్యేకతలు: కొబ్బరి, జీడి, పనస పంటలు, విశాలమైన బీలప్రాంతం.
*చారిత్రక అంశాలు : రాజుల కాలం నాటి హత్తిబడి చెరువు, రాజపురంలో గృహాలయం
Courtesy with Eenadu Telugu news paper.
- ============================
No comments:
Post a Comment