కింజరాపు రామమోహన్‌నాయుడు , కింజరాపు ఎర్రన్నాయుడు కొడుకు. తండ్రి కారు ప్రమాదములో అకాలమరణము తరువాత వారసత్వ రాజకీయం అనుకోండి లేదా తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి అనుకోండి .... రాజకీయప్రవేశం చేసాడు .
కింజరాపు ఎర్రన్నాయుడు లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి గా చేసారు.. కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు. ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి 1982లో హరిశ్చంద్రపురం నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1967లో స్వతంత్ర్య పార్టీ అభ్యర్ధిగా హరిశ్చంద్రపురం నుండి ఎన్నికైన కింజరాపు కృష్ణమూర్తి ఇతడి చిన్నాన్న. అతను, గౌతు లచ్చన్న, ఎన్.జి.రంగా ల అడుగుజాడల్లో నడిచి ప్రజాసేవ ధ్యేయంగా కష్టించి పనిచేశాడు. అప్పటి నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా, ఆ తరువాత శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు (1996, 1998, 1999 మరియు 2004) లోక్ సభ సభ్యునిగా బారత పార్లమెంటుకు ఎన్నికయ్యాడు.
- పేరు : కింజరాపు రామమోహన్‌నాయుడు ,
- వయసు : 27 సం.లు ,
- చదువు : బి.టెక్(2008) .,ఎం.బి.ఎ.(2011)-(అమెరికా),
- భార్య : పెళ్ళి కాలేదు ,
- కులము/మతము : వెలమ(బి.సి) - హిందూ,
- తండ్రి : దివంగత కింజరాపు ఎర్రంనాయుడు ,
- తల్లి పేరు : విజయ కుమారి ,
- అడ్ర : నిమ్మాడ -గ్రా. ప్రియగ్రహారం (వయా),కోటబొమ్మాలి (మండలం),శ్రీకాకుళం జిల్లా,pinప532430.
- టెలిపోన్ నెం: 9440195555,
- ఈ.మెయిల్ : ramamohannaidu@gmail.com,
- పోటీ చేస్తున్న పార్టీ: తెలుగు దేశం ,
- నియోజగక వర్గం : శ్రీకాకుళం పార్లిమెంట్ ,
- ==========================
No comments:
Post a Comment